By: ABP Desam | Updated at : 01 Jul 2023 11:47 AM (IST)
ఈ నెలలోనూ 'బండ' భారం భరించాల్సిందే
LPG Cylinder Latest Price in July 2023: సామాన్యుడు ఈ నెలలోనూ వంట గది మంటను భరించాల్సిందే. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) ఈసారి కూడా కొంచమైనా కనికరం చూపలేదు. ఓవైపు కిరాణా సరుకులు, మరోవైపు కూరగాయల రేట్లు కొండెక్కి కూర్చున్నాయి. కనీసం గ్యాస్ రేట్లయినా తగ్గుతాయేమోనని ఆశగా ఎదురు చూసిన దేశ జనానికి తీవ్ర నిరాశ తప్పలేదు.
ఈ రోజు (జులై 1, 2023) LPG సిలిండర్‌ల కొత్త రేట్లను OMCలు ప్రకటించాయి. ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ప్రకారం, 14.2 కిలోల సిలిండర్ (Domestic LPG Cylinder Price), 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలో (Commercial LPG Cylinder Price) ఎటువంటి మార్పు చేయలేదు. అయితే, ఈ రేట్లు ఇప్పటికే పీక్ స్టేజ్‌లో ఉన్నాయి, సాధారణ ప్రజలకు మోయలేని భారంగా తయారయ్యాయి.
OMCలు ప్రతి నెలా 1వ తేదీన కొత్త గ్యాస్ రేట్లను ప్రకటిస్తుంటాయి. అంతర్జాతీయ స్థాయిలో ధరలు భారీగా తగ్గినా, మన దేశంలో మాత్రం గ్యాస్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తగ్గించడం లేదు. గతంలో వచ్చిన నష్టాలను సర్దుబాటు చేసుకుంటున్నామని, అందువల్లే రేట్లు తగ్గించడం కుదరదని చెబుతున్నాయి.
ఈ ఏడాది మే, జూన్ నెలల్లో కలిపి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును రూ.255.50 మేర OMCలు తగ్గించాయి. అయితే, అంతకుముందు మార్చి 1వ తేదీన ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటును ఒక్కసారే రూ.350.50 పెంచాయి.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లు
దేశ రాజకీయ రాజధాని దిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ (బ్లూ సిలిండర్) రేటు రూ. 1773గా ఉంది. దేశ రాజకీయ రాజధాని ముంబైలో రూ. 1,725, కోల్‌కతాలో రూ. 1,875.50, చెన్నైలో ధర రూ. 1,937 వద్ద ఉన్నాయి.
డొమెస్టిక్ LPG ధర పరిస్థితేంటి?
సామాన్యులు ఉపయోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను ఈ ఏడాది మార్చి నెలలో రూ. 50 పెంచిన ఓఎంసీలు, ఆ తర్వాత ఇక తగ్గించలేదు.
ప్రస్తుతం, దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ (రెడ్ సిలిండర్) ధర హైదరాబాద్‌లో రూ. 1,155గా ఉంది. దిల్లీలో రూ. 1,103, ముంబైలో రూ. 1,102.5, చెన్నైలో రూ. 1,118.5, బెంగళూరులో రూ. 1,105.5, శ్రీనగర్‌లో రూ. 1,219, లెహ్‌లో రూ. 1,340, ఐజ్వాల్‌లో రూ. 1,260, భోపాల్‌లో రూ. 1,108.50, జైపుర్‌లో రూ. 1,106.50, బెంగళూరులో రూ. 1,105.50 గా ఉంది.
దేశంలోని మిగిలిన నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. 16.2 కేజీల దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ ధర పట్నాలో రూ. 1,201, కన్యాకుమారిలో రూ. 1,187, అండమాన్‌లో రూ. 1,179, రాంచీలో రూ. 1,160.50, దెహ్రాదూన్‌లో రూ. 1,122, ఆగ్రాలో రూ. 1,115.5, చండీగఢ్‌లో రూ. 1,112.5, అహ్మదాబాద్‌లో రూ. 1,110, సిమ్లాలో రూ. 1,147.50, లఖ్‌నవూలో రూ. 1,140.5 చొప్పున విక్రయిస్తున్నారు. రవాణా ఛార్జీలతో పాటు, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నుల వల్ల ఒక్కో రాష్ట్రంలో సిలిండర్ రేట్లు ఒక్కోలా ఉంటాయి.
LPG సిలిండర్ రేటును ఎక్కడ చెక్ చేయాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-productsను చూడవచ్చు. LPG కాకుండా ఇతర విషయాల్లోనూ అప్‌డేట్స్ పొందవచ్చు.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Car Sales Report November: నవంబర్‌లో దూసుకుపోయిన కార్ల అమ్మకాలు - టాప్ 5 లిస్ట్ ఇదే!
MSSC vs SSY: ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన - ఏది బెటర్ ఆప్షన్?
Income Tax: మీ పాత ఇంటిని అమ్ముతున్నారా?, ఎంత టాక్స్ కట్టాలో ముందు తెలుసుకోండి
Indian Thali: పెరుగుతున్న వంటింటి బిల్లు, జనం జేబుకు పెద్ద చిల్లు
SIM Card Rules: కొత్త సిమ్ తీసుకోవాలంటే కొత్త రూల్స్, ఇకపై ట్రిక్స్ పని చేయవు
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Revanth Reddy Secretariat: ముఖ్యమంత్రి ఛాంబర్‌లో రేవంత్ రెడ్డి, బాధ్యతల స్వీకరణ - వేద పండితుల ఆశీర్వచనం
Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?
Telangana Cabinet : హోంమంత్రిగా ఉత్తమ్ - భట్టి, సీతక్కలకు ఇచ్చిన శాఖలు ఏమిటంటే ?
/body>