విస్కీ,స్కాచ్ తాగేవాళ్లంతా బాగా చదువుకున్న వాళ్లు - మధ్యప్రదేశ్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
Madhya Pradesh High Court: విస్కీ, స్కాచ్ తాగేవాళ్లంతా చదువుకున్న వాళ్లేనని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Madhya Pradesh High Court:
హైకోర్టు వ్యాఖ్యలు..
మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh High Court) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాగా చదువుకున్న వాళ్లు, డబ్బున్న వాళ్లే విస్కీ, స్కాచ్ తాగుతారని వెల్లడించింది. సొసైటీలో స్పెషల్ క్లాస్‌కి చెందిన వాళ్లే స్కాచ్‌ని ఎక్కువగా ఇష్టపడతారని స్పష్టం చేసింది. రెండు వేరువేరు బ్రాండ్‌లకు చెందిన బాటిల్స్‌ని వీళ్లు చాలా సులువుగా గుర్తించగలరని తెలిపింది. Pernod Ricard లిక్కర్ కంపెనీ వేసిన పిటిషన్‌ని విచారిస్తున్న సమయంలో ఈ వ్యాఖ్యలు చేసింది మధ్యప్రదేశ్ హైకోర్టు. London Pride మార్క్‌తో ఇండోర్‌కి చెందిన JK Enterprises డ్రింక్స్‌ని తయారు చేయడాన్ని వ్యతిరేకించింది పెర్నాడ్ కంపెనీ. ఈ విషయమై కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కంపెనీ Blenders Pride ట్రేడ్‌మార్క్‌ని ఉల్లంఘించి మరీ డ్రింక్స్ తయారు చేస్తోందని వాదించింది. కోర్టు చొరవ చూపించి వెంటనే ఈ తయారీని ఆపేలా ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషన్‌లో పేర్కొంది. వినియోగదారుల్ని నమ్మించి మోసం చేస్తోందని మండి పడింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సుశ్రుత్ అర్వింద్ ధర్మాధికారి, జస్టిస్ ప్రణయ్ వర్మతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే కీలక వ్యాఖ్యలు చేసింది. విస్కీ, స్కాచ్ తాగే వాళ్లు బాగా చదువుకున్న వాళ్లే ఉంటారని, వాళ్లు ఏ బాటిల్ బ్రాండ్ ఏంటనేది వాళ్లు చాలా సులువుగా గుర్తిస్తారని తేల్చి చెప్పింది.
"మీరు చెప్పినట్టుగా ఇందులో అంత ప్రమాదమేమీ కనిపించడం లేదు. విస్కీ, స్కాచ్ తాగేవాళ్లలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్లే ఉంటారు. బ్లెండర్స్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ బాటిల్స్‌లో ఏది ఓ బ్రాండో వాళ్లు గుర్తించగలరు. వాళ్లకు ఆ జ్ఞానం కచ్చితంగా ఉంటుంది"
- మధ్యప్రదేశ్ హైకోర్టు
బాటిల్స్ షేప్ కూడా వేరుగా ఉంటుందని, అందుకే కన్‌జ్యూమర్స్ చాలా సులువుగా బ్రాండ్‌ని గుర్తు పట్టేస్తారని తేల్చి చెప్పింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ బాక్సుల మధ్య ఎలాంటి పోలిక ఉండదని తెలిపింది.