By: ABP Desam | Updated at : 02 Apr 2023 08:38 PM (IST)
కాంగ్రెస్ పై బీజేపీ స్పెషల్ సినిమా (image source- bjp twitter)
అదానీ వ్యవహారం, రాహుల్ అనర్హత అంశాలపై విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న సమయంలో.. అధికార బీజేపీ.. కాంగ్రెస్‌పై ఎదురుదాడిని మరింత ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ పాలనలో ఎంత అవినీతి జరిగిందనే విషయాన్ని వెల్లడిస్తూ.. ఆదివారం ఉదయం 'కాంగ్రెస్ ఫైల్స్' పేరుతో ఓ వీడియోను తన అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించింది.
దేశంలో కాంగ్రెస్ దాదాపు 70 సంవత్సరాల పాటు అధికారంలో ఉందని.. లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్ పాలనలో రూ.48,20,69,00,00,000 విలువైన కుంభకోణాలు జరిగాయని తెలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి కారణంగానే దేశం వెనుకబడి పోయిందని వెల్లడించింది.
70 ఏళ్లు ఒక ఎత్తైతే.. 2004 నుంచి 2014 వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఫలితంగా దేశం ఒక దశాబ్ధం పాటు అభివృద్ధిని కోల్పోయిందని ఆరోపిస్తూ ఆ కాలాన్ని..'లాస్ట్ డికేడ్'గా బీజేపీ పేర్కొంది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగిని అవినీతి అంతా ఇంతా కాదని.. ఆ సమయంలో జరిగిన అవినీతి వార్తలతో న్యూస్ పేపర్లు నిండిపోయేవని వీడియో ద్వారా వెల్లడించింది.
2004 నుంచి 2014 వరకు పదేళ్ల సమయంలో ప్రతి భారతీయుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చిందని బీజేపీ విమర్శించింది. 2జీ కేసు, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ సహా వివిధ కుంభకోణాలలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ప్రమేయం ఉందని ఆరోపించింది. "బొగ్గు కుంభకోణంలో రూ.1.86 లక్షల కోట్లు, 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో రూ.1.76 లక్షల కోట్లు, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ కుంభకోణంలో రూ.10 లక్షల కోట్లు, కామన్వెల్త్ కుంభకోణంలో రూ.70 వేల కోట్లు, ఇటలీతో హెలికాప్టర్ కొనుగోలు ఒప్పందంలో రూ.362 కోట్లు లంచం, రైల్వే బోర్డు ఛైర్మన్.. రూ.12 కోట్లు లంచం తీసుకున్నారు" అంటూ బీజేపీ ఆ వీడియోలో తీవ్ర ఆరోపణలు చేసింది.
కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఉన్న మూడు నిమిషాల వీడియో క్లిప్‌లో, యూపీఏ హయాంలో జరిగిందని ఆరోపించిన రూ.48,20,69,00,00,000 విలువైన కుంభకోణాల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన వీడియో జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా ఇంకా ముందుందని తెలిపింది.
Congress Files के पहले एपिसोड में देखिए, कैसे कांग्रेस राज में एक के बाद एक भ्रष्टाचार और घोटाले हुए… pic.twitter.com/vAZ7BDZtFi
— BJP (@BJP4India) April 2, 2023
కాగా.. ప్రతిపక్ష పార్టీలు "భ్రష్టాచారి బచావో ఆందోళన" ప్రారంభించాయని ప్రధాని నరేంద్ర మోదీ గత వారం ఆరోపించిన తర్వాత బీజేపీ ఈ వీడియో విడుదల చేయడం విశేషం. సీబీఐ, ఈడీ కేవలం బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేశారంటూ 14 పార్టీలు సుప్రీంకోర్టుకు వెళ్లనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలను టార్గెట్ చేశారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటే దాడులు చేస్తున్నారు, కోర్టుల్లో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.. కొన్ని పార్టీలు ‘భ్రష్టాచారి బచావో అభియాన్’ ప్రారంభించాయని ఆయన ఆరోపించారు.
Bihar Bridge Collapse: బిహార్‌లో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి, ఇది మొదటిసారి కాదు
Army Publice School: గోల్కొండ ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో టీచింగ్ పోస్టులు, వివరాలు ఇలా!
CBI Probe Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు రైల్వే బోర్డు సిఫారసు, వెల్లడించిన రైల్వే మంత్రి
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్
Odisha Train Accident: కవచ్ ఉన్నా లాభం లేకపోయేది, కొన్ని ప్రమాదాల్ని ఏ టెక్నాలజీ అడ్డుకోలేదు - రైల్వే బోర్డ్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Bhola Mania Song : వన్ అండ్ ఓన్లీ బిందాస్ భోళా, మెగాస్టార్ వస్తే స్విచ్ఛాన్ గోల - ఫస్ట్ సాంగ్ విన్నారా?
Telangana Rains: ఒక్కసారిగా మారిన వాతావరణం, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షం - 3 రోజులపాటు ఎల్లో అలర్ట్