By: ABP Desam | Updated at : 14 Dec 2022 01:26 PM (IST)
బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేసీఆర్, అఖిలేష్ యాదవ్
ఢిల్లీలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. వేదపండితుల మంత్రాల నడుమ సాంప్రదాయబద్ధంగా కార్యక్రమం జరుగుతోంది. దివ్య ముహూర్తం అనే నమ్మకంతో నేడు (డిసెంబరు 14) 12.37 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభించాలని ముందుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం వేదపండితులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, సతీమణి శోభారాణితో కలిసి పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ తో పాటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, జేడీఎస్ అధినేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, తమిళనాడుకు చెందిన విడుతలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఎంపీ చిదంబరం, పలు రాష్ట్రాల రైతు సంఘం నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, గుర్నాం సింగ్ సహా తదితర జాతీయ రైతు నంఘం నేతలు, మంత్రులు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
అనంతరం బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించి, కేసీఆర్ ఆశీనులయ్యారు. తన ఛాంబర్‌లో కూర్చొన్నారు. శృంగేరి పీఠం గోపీకృష్ణ శర్మ, ఫణిశశాంక శర్మ ఆధ్వర్యంలో ఈ యాగాలు జరిగాయి. మొత్తంగా ఈ యాగాల్లో 12 మంది రుత్వికులు పాల్గొన్నారు.
Adani FPO: రూ.20 వేల కోట్లు వెనక్కి - అదానీ గ్రూపు కీలక నిర్ణయం!
UPSC IFS Notification: ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ వెల్లడి, పోస్టులెన్నంటే?
UPSC 2023: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్-2023 నోటిఫికేషన్ విడుదల, 1105 ఉద్యోగాల భర్తీ! ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
Union Budget 2023: ఇది బ్యాలెన్స్డ్ బడ్జెట్, పన్ను విధానాన్ని సింప్లిఫై చేశాం - నిర్మలా సీతారామన్
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ
Telangana Budget : ఎన్నికలున్న కర్ణాటకకు ప్రత్యేక నిధులు - తెలంగాణకు మాత్రం నిల్ ! బీఆర్ఎస్కు మరో అస్త్రం
Mekapati Chandrashekar Reddy : నెల్లూరులో మరో వైసీపీ ఎమ్మెల్యే అసంతృప్తి స్వరం, నియోజకవర్గ పరిశీలకుడిపై ఆగ్రహం
Rajagopal Reddy: ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలి - కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి