News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Clean Air Survey: స్వచ్ఛ వాయు సర్వేలో ఇండోర్ మొదటి స్థానం, ఆ తర్వాత స్థానాల్లో ఏ ప్రాంతాలంటే?

Clean Air Survey: ప్రతీ సంవత్సరం నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో ఇండోర్ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా, ఠాణె నిలిచాయి.

FOLLOW US: 
Share:

Clean Air Survey: కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే స్వచ్ఛ వాయు సర్వేలో పది లక్షల కంటే జనాభా ఎక్కువ గల నగరాల్లో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ మొదటి స్థానంలో నిలిచింది. అలాగే రెండో స్థానంలో ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా, మూడో స్థానంలో మహారాష్ట్రలోని ఠాణె ఉన్నాయి. ఈ సర్వే వివరాలను కేంద్ర పర్యావరణ శాఖ గురువారం రోజు వెల్లడించింది. జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం ఎన్సీఏపీ కింద 131 నగరాల్లో నగర కార్యాచరణ ప్రళాళిక, వాయు నాణ్యత కింద ఆమోదించబడిన కార్యకలాపాల అమలు ఆధారంగా నగరాలకు ర్యాంకులు కేటాయించింది. అలాగే రెండో విభాగంలో మూడు నుంచి 10 లక్షల లోపు జనాభా గల నగరాల్లో మహారాష్ట్రలోని  అమరావతి మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే ఉత్తర ప్రదేశ్ కు చెందిన మొరాబాద్ రెండో స్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు మూడో స్థానంలో నిలిచింది. 

మూడు లక్షల లోపు జనాభా గల నగరాల్లో హిమాచల్ ప్రదేశ్ కు చెందిన పర్వానూ తొలి స్థానం దక్కించుకోగా.. ఆ రాష్ట్రానికి చెందిన కాలా అంబ్ రెండో స్థానం, ఒడిశాలోని అంగుల్ మూడో స్థానాన్ని సంపాదించుకుంది. వచ్చే ఏడాది నాటికి దేశంలో పీఎం 2.5, పీఎం10 సూక్ష్మధూళి కణాల స్థాయిని 20 నుంచి 30 శాతం తగ్గించాలని ఏన్సీఏపీ లక్ష్యంగా పెట్టుకుంది.  

మరోవైపు మోస్ట్ పొల్యూటెడ్ సిటీగా ఢిల్లీ

దేశ రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా కొనసాగుతోంది. ఈ విషయాన్ని తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. ఢిల్లీ నగరంలో కాలుష్యం అత్యంత విపరీతంగా ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం ఉన్న కాలుష్యం స్థాయి ఇదే రీతిలో కొనసాగితే.. ఢిల్లీ నగరంలో నివసించే పౌరుల ఆయుర్దాయం 11.9 ఏళ్లు తగ్గుతుందని హెచ్చరించింది. యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్.. ఢిల్లీ కాలుష్యంపై ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (AQLI) నివేదికను విడుదల చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే ఢిల్లీ నగరంలో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

భారత దేశంలో 67.4 శాతం మంది ప్రజలు.. కాలుష్య స్థాయిలు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే జీవిస్తున్నారని ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా పీఎం2.5 కారణంగా దేశ ప్రజల సరాసరి జీవిత కాలం 5.3 ఏళ్లు తగ్గిపోతున్నట్లు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఢిల్లీని ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో పోల్చి చూస్తే ఇక్కడ ఉన్న 1.8 కోట్ల మంది ప్రజలు తమ జీవిత కాలంలో 11.9 ఏళ్లను ఈ కాలుష్యం కారణంగానే కోల్పోబోతున్నారని పేర్కొంది.

పంజాబ్ లోని పఠాన్ కోట్ జిల్లాను అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న ప్రాంతంగా గుర్తించిన షికాగో వర్సిటీ నివేదిక.. అక్కడ కూడా కాలుష్య స్థాయిలు డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన ప్రమాణాల ( పీఎం 2.5) కంటే 7 రెట్లు అధికంగా ఉన్నట్లు తెలిపింది. ఇదే తీవ్రమైన కాలుష్యం స్థాయిలు కొనసాగితే.. పఠాన్ కోట్ జిల్లా ప్రజల వయస్సు కూడా 3.1 ఏళ్లు తగ్గిపోతుందని ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ నివేదిక అంచనావేసింది.

Published at : 08 Sep 2023 05:36 PM (IST) Tags: Indore Clean Air Survey Ranks First Clean Air Survey Ranks Indore Agra Thane

ఇవి కూడా చూడండి

MP Danish Ali: నా అంతు చూస్తామని బీజేపీ ఎంపీలు బెదిరిస్తున్నారు - బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ

MP Danish Ali: నా అంతు చూస్తామని బీజేపీ ఎంపీలు బెదిరిస్తున్నారు - బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ

EAM Jaishankar: ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమే- పశ్చిమ దేశాల తీరుపై జైశంకర్‌ చురకలు

EAM Jaishankar: ఇప్పటికీ ఇది ద్వంద్వ ప్రమాణాల ప్రపంచమే- పశ్చిమ దేశాల తీరుపై జైశంకర్‌ చురకలు

సనాతన ధర్మాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది, ఉదయనిధిపై కాంగ్రెస్ నేత ఫైర్

సనాతన ధర్మాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది, ఉదయనిధిపై కాంగ్రెస్ నేత ఫైర్

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సర్‌ప్రైజ్ ఇస్తాం, తెలంగాణ సహా అన్నిచోట్లా గెలుస్తాం - రాహుల్ గాంధీ

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సర్‌ప్రైజ్ ఇస్తాం, తెలంగాణ సహా అన్నిచోట్లా గెలుస్తాం - రాహుల్ గాంధీ

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం

ఆ ఇంటిలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగానే భారత్‌పై కెనడా ఆరోపణలు! వెలుగులోకి సంచలన విషయం

టాప్ స్టోరీస్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nara Brahmani: హోటల్ రూంకు తాళం- వాట్సాప్ చాటింగ్ సైతం చెకింగ్ - పోలీసుల చర్యతో బ్రాహ్మణి షాక్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

Nagababu: టీడీపీ, జనసేన ఆశయాలు ఒక్కటే, ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతాం - నాగబాబు వార్నింగ్

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

వద్దంటే పెళ్లి, ఏంది భాయ్ ఈ లొల్లి - సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతోన్న పులిహోర కథలు!

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు