By: ABP Desam | Updated at : 26 May 2022 07:32 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హరిద్వారా ఎస్‌డీఎం కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. తల్లిదండ్రులను పోషించకుండా వారిని వేధిస్తున్న పిల్లలకు చెంపపెట్టులాటి తీర్పు చెప్పింది. తాము కట్టించిన ఇంట్లోనే ఉంటూ.. తమను వేధిస్తున్నారని కొందరు తల్లిదండ్రులు హరిద్వార్ ఎస్‌డిఎం కోర్టును ఆశ్రయించారు. వాళ్ల వాదనలు విన్న హరిద్వార్ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెల్లడించింది. తల్లిదండ్రులు కూడబెట్టిన ఇంటి నుంచి వెళ్లిపోమని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను పాటించకుంటే పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్ల నిర్వహణ, సంక్షేమ చట్టం ప్రకారం ఏ వ్యక్తి అయినా తమను సరిగా చూసుకోని, సంరక్షించని పిల్లలపై SDM కోర్టులో ఫిర్యాదు చేయవచ్చు. చట్టంలోని సెక్షన్ ప్రకారం SDM తరపున విన్నవించిన తర్వాత వాళ్ల వాదనలో న్యాయం ఉంటే పిల్లలు ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాంటి ఓ పిటిషన్‌పై హరిద్వార్ SDM కోర్టు తీర్పు చెప్పింది.
తమను పిల్లలు వేధిస్తున్నారని ఆరుగురు సీనియర్ సిటిజన్లు హరిద్వార్ ఎస్‌డీఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం SDM న్యాయమూర్తి పురాన్ సింగ్ రాణా ఈ కేసులను విచారించారు. జ్వాలాపూర్, కంఖాల్, రావాలి మెహదూద్ తమ పిల్ల లపై పిటిషన్ వేశారు. తాము పిల్లలతో కలిసే ఉంటున్నామని కానీ తమకు ఫుడ్ పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారని కోర్టుకు తెలిపారు. అడిగితే కొట్టి హింసించారన్నారు. ఈ పరిస్థితులులో తమ వృద్ధాప్య జీవితం నరకప్రాయంగా మారిందన్నారు.
తమ పిల్లల నుంచి ఉపశమనం కలిగించాలని ఈ మూడు వృద్ద జంటలు కోర్టును ఆశ్రయించాయి. పెద్దల పిటిషన్‌ను విచారించిన పురన్ సింగ్ రాణా... మొత్తం ఆరు కేసుల్లో తల్లిదండ్రుల ఆస్తిపాస్తుల నుంచి పిల్లలకు చెందకుండా చేయాలని తీర్పు చెప్పారు. 30 రోజుల్లోగా వాళ్లు ఉంటున్న తల్లిదండ్రులకు అప్పగించి ఇల్లు ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వీళ్లెవరూ ఇళ్లు ఖాళీ చేయకుంటే సంబంధిత స్టేషన్ ఇన్‌ఛార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు.
మోసం కేసుల్లో సత్వర నిర్ణయం
మోసపూరితంగా తల్లిదండ్రుల ఆస్తిని కుమారుడు తన పేరున రాయించుకొని వేధిస్తున్నారని... ఇలాంటి కేసుల విచారణ కూడా చివరి దశలో ఉందని పురన్ సింగ్ రాణా తెలిపారు.
Same Sex Marriage: ఆ ఇద్దరు మగాళ్లు ఒక్కటయ్యారు, ఘనంగా పెళ్లి చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ వద్ద లవ్ ప్రపోజ్
Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపై యువకుడి దాడి- వీడియో వైరల్
Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!
Sidhu Moose Wala's murder Viral Video : సింగర్ సిద్దూ హత్యకు ముందు హంతకులు ఏం చేశారో తెలుసా ? ఇదిగో వైరల్ వీడియో !
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్