అన్వేషించండి

Maoist Encounters: ఈ ఏడాది వరుస ఎన్‌కౌంటర్లు - 37 రోజుల్లో 81 మంది మావోయిస్టుల మృతి

Encounter News | 2025 లో వరుస ఎన్‌కౌంటర్లతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేత చర్యను ముమ్మరం చేసింది. కేవలం 5 వారాల వ్యవధిలో జరిగిన ఎన్ కౌంటర్లలో 81 మంది మావోయిస్టులు మృతిచెందారు.

వరుస ఎన్‌ కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఏరివేత లో భాగంగా ఎన్ కౌంటర్ లు నిత్యకృతయమయ్యాయి. ఒక ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. నిన్న ఆదివారం ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా. మృతుల్లో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటనలో తెలిపారు. 

పక్కా సమాచారం.. విరుచుకుపడ్డ బలగాలు..

పక్కా సంచారంతో పోలీస్ బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టుల ఏరివేత లో భాగంగా DRG, STF తో పాటు కేంద్ర బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు బస్తర్ ఐజీ తెలిపారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఎన్‌ కౌంటర్ స్థలం నుండి AK 47, SLR, INSAS రైఫిల్, 303 ఆయుధాలతో పాటు మావోయిస్టులు తయారు చేసిన రాకెట్ లాంచర్, బిజిఎల్ లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు. 

ఫిబ్రవరి నెలలో రెండు ఎన్ కౌంటర్లు.

ఫిబ్రవరి 1వ తేదీన ఛత్తీస్‌ ఘఢ్‌ బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. 

మరో ఒకటి నిన్న ఫిబ్రవరి 9వ తేదీన ఛత్తీస్ ఘడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ భారీ సంఖ్యలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.

జనవరి నెలలో ఆరు ఎన్ కౌంటర్లు..

- జనవరి 29 న జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసా, సోమావా పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.

- జనవరి 19 వ తేదీన ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ బలగాలకు, మావోయిస్టుల మధ్య మొదలైన ఎదురుకాల్పులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయింది. కేంద్రకమిటీ సభ్యులు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి మృతి చెందారు.

- జనవరి 16 వ తేదీన ఛత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో పోలీస్ లకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ లు వెల్లడించారు. 16 వ తేదీన నుండి 17 వ తేది రెండు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ తప్పించుకున్నారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ రెండు రోజులకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు లేఖ లో పేర్కొన్నారు.

- జనవరి 12 వ తేదీన ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా నేపనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీస్ తెలిపారు. ఘటన స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు వెల్లడించారు.

- జనవరి 5 వ తేదీన నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన లో ఒక జవాన్ మృతి చెందినట్లు పోలీస్ లు ప్రకటించారు.

2025 కొత్త సంవత్సరం ప్రారంభమైన మూడు రోజులకే 3 వ తేదీన ఒడిశా సరిహద్దుల్లో బలగాలకు, మావోల కు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గారియాబాద్ పోలీస్ లు వెల్లడించారు. 

వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ఏరివేత..

మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్ర పోలీసులు, మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ ను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాన్ని పోలీస్ బలగాలు దండకారణ్యాన్ని జల్లడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టు దళాలు ఎదురు పడడం లేదా పక్క సమాచారంతో బలగాలు మావోయిస్టులను మట్టుపెడుతున్నారు. ఈ సంవత్సరం 2025 జనవరి 3 తేదీన నుండి మొదలైన ఎన్ కౌంటర్లు వరుసగా కొనసాగుతున్నాయి.

అమిత్ షా స్పందన..

నిన్న ఛత్తీస్ ఘడ్ లో జరిగిన ఎన్ కౌంటర్ తరువాత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. భారత్ మావోయిస్టు రహిత దేశంగా చేస్తామని చెప్పారు. నిన్న ఛత్తీస్ ఘడ్ లో మావోయిస్టు లు భారీ విజయాన్ని సాధించాయనీ చెప్పారు. అయితే మావోయిస్టు లకు సంబంధించి మాట్లాడిన ప్రతి సారి 2026 కల్లా మావోయిజం లేకుండా చేసామని అమిత్ షా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వరుస ఎన్ కౌంటర్లు జరుగుతున్నట్లు భావించాలి.

టాప్ హెడ్ లైన్స్

GenZ Politics India: నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న జెన్జీ ట్రెండ్ !
నాయకుల్లారా జాగ్రత్త! భారత రాజకీయాన్ని రీ-రైట్ చేస్తున్న GenZ ట్రెండ్ !
Abhijeet Dipke Typhoid: టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
టైఫాయిడ్ బారిన పడిన అభిజిత్ దీప్కే.. ఈ వ్యాధి లక్షణాలు ఏంటీ? ఎప్పుడు ప్రమాదకరంగా మారుతుంది
Breaking News: భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
భోగాపురం పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ షెడ్యూల్ వచ్చేసింది
Task Force for Exam Reforms: పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ
పరీక్షా విధానంలో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్: ప్రధాని మోదీ

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget