అన్వేషించండి

Chandrayaan 3: చైనాను అధికమించిన భారత్, అరుదైన ఘనత

Chandrayaan 3: భారతదేశం అరుదైన ఘనత సాధించింది. చైనాను అధిగమించి భారత్‌కు చెందిన అంతరిక్ష నౌకలు మూడు చంద్రుని చుట్టూ తిరుగుతున్నాయి.

Chandrayaan 3: భారతదేశం అరుదైన ఘనత సాధించింది. ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ ప్రయోగం సరికొత్త మైలురాయిని చేరుకుంది. చైనాను అధిగమించి భారత్‌కు చెందిన అంతరిక్ష నౌకలు మూడు చంద్రుని చుట్టూ తిరుగుతున్నాయి.  చంద్రయాన్‌-2కు కొనసాగింపుగా చేపట్టిన చంద్రయాన్-3 జులైన 14 నింగిలోకి ఎగసింది. తాజాగా చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో తిరుగుతోంది. చంద్రయాన్-3 మిషన్ ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో విజయవంతంగా వేరు చేసింది. ఆగస్టు 23 చంద్రుని ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. 

విక్రమ్ ల్యాండర్‌లో రోవర్‌ ఉంటుంది. గతంలో మాదిరి చంద్రయాన్-3కి ఆర్బిటర్‌ ఉండదు. దానికి బదులుగా ప్రొపల్షన్ మాడ్యూల్ కమ్యూనికేషన్ రిలే ఉపగ్రహంగా పనిచేస్తుంది. ఇది ల్యాండర్ సందేశాలను డీకోడ్ చేసి ఇస్రోకు పంపుతుంది. వ్యోమనౌక 100-కిలోమీటర్ల చంద్ర కక్ష్యకు చేరుకునే వరకు ల్యాండర్, రోవర్ ప్రొపల్షన్ మాడ్యూల్‌తోనే కాన్ఫిగర్ అయ్యి ఉంటాయి. దీనితో పాటు స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ పేలోడ్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం చంద్ర కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేస్తుంది. ఇది ఇతర గ్రహాల గురించి అధ్యయనం చేయడానికి  దోహద పడుతుంది. 

భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు విక్రమ్ సారాభాయ్ గుర్తుగా ల్యాండర్‌కు విక్రం పేరు పెట్టారు. దీనిని చంద్రుడిపై (భూమిపై 14 రోజులు) ఒక రోజు పనిచేసేలా రూపొందించబడింది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని, సాఫ్ట్ ల్యాండింగ్ చేసే వరకు దాని స్వంత పనులను నిర్వహిస్తుంది. ఈ రెండూ కాకుండా, చంద్రుని చుట్టూ ఇప్పటికీ పనిచేస్తున్న చంద్రయాన్-2 చంద్రునిపై ప్రయోగంలో భారత్ స్థాయిని పెంచుతుంది. ఈ క్రాఫ్ట్, 2,379 కిలోల కక్ష్య ద్రవ్యరాశి, 1000W శక్తిని ఉత్పత్తి చేయగల సోలార్ ప్లేట్లతో తిరుగుతూ ఉంటుంది. ఇండియన్ డీప్ స్పేస్ నెట్‌వర్క్, ల్యాండర్‌తో కమ్యూనికేట్ చేస్తుంది. 

ఈ మూడు అంతరిక్ష నౌకలు అంతరిక్ష పరిశోధనలో భారతదేశం ప్రగతిని, గొప్పదనానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. విక్రమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేయగలిగితే ఇస్రోకు చరిత్ర సృష్టించినట్లే. నాలుగు సంవత్సరాల క్రితం చంద్రయాన్-2 సాధించలేని ఎండ్-టు-ఎండ్ సామర్థ్యాన్ని చంద్రయాన్‌-3 ప్రదర్శిస్తుంది. ఇండియా కంటే ముందుగానే చైనా, యుఎస్, కొరియా చంద్రుడిపైన ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే ప్రపంచం మొత్తం ఇప్పుడు చంద్రయాన్-3 విజయవంతంపై ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రయోగం ద్వారా ఇండియా చంద్రుడిపై కొత్త అన్వేషణలు, శాస్త్రీయ ఆవిష్కరణలు చేయడానికి దోహదం చేయనుంది.

చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో
ఈ నెల 17న గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ విడిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంటకు స్పేస్ క్రాఫ్ట్ నుంచి విక్రమ్ ల్యాండర్ సపరేషన్ జరిగింది. దీంతో చంద్రుడి చుట్టూ పరిభ్రమించడం పూర్తి అయిపోయింది. ఇకపై చంద్రుడిపై దిగే ప్రక్రియ మొదలైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని బట్టి క్రమంగా చంద్రుని ఉపరితలానికి దగ్గరవుతుంది. ఆగస్టు 23వ తేదీన జాబిలిపై సాఫ్ట్ ల్యాండ్ అవుతుంది. అలా స్మూత్ ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్లే.  అన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగితే చంద్రయాన్-3 విజయవంతం అవుతుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఒకరోజు ముందుగానే రైతుల ఖాతాల్లో డబ్బులు, సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Embed widget