అన్వేషించండి

Chandrayaan-3: చంద్రయాన్ 3 చివరి కక్ష తగ్గింపు పూర్తి, త్వరలోనే ల్యాండర్ సపరేషన్

చంద్రయాన్-3 ను 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట.

Chandrayaan-3 Mission: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసుకుంది. ఇవాళ మరోసారి ఫైరింగ్ ను విజయవంతంగా చేయడం ద్వారా.. చంద్రయాన్-3 ను 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అంటే దీని ద్వారా చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు, అదే తిరగడం ఇక అయిపోయిందన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే చంద్రయాన్-3 అనే సినిమాకు ఇవాళ పూర్తి చేసుకున్న ఘట్టం ప్రీ-క్లైమాక్స్. ఇక క్లైమాక్స్ కు రంగం సిద్ధమైంది. 

అదేంటంటే రేపు అంటే ఆగస్ట్ 17వ తేదీన ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ వేరు పడుతుందన్నమాట. ఇలా సెపరేట్ అయిన ల్యాండర్ మాడ్యూల్ ఆగస్ట్ 23వ తేదీన స్మూత్ గా ల్యాండ్ అయితే చంద్రయాన్-3 మిషన్ విజయవంతం అయినట్టు అన్నమాట. ఇవాళ చంద్రయాన్-3 153 బై 163 కిలోమీటర్ల ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టారు అని చెప్పుకున్నాం కదా. ఇక్కడి నుంచి 100 కిలోమీటర్ల దూరం చేరేదాకా ప్రయాణించి అక్కడి నుంచి ల్యాండర్ జంప్ చేస్తుందన్నమాట. మన ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆగస్ట్ 23వ తేదీన అది ల్యాండ్ అవుతుంది. అంటే సరిగ్గా ఇంకో వారమే ఉందన్నమాట.. ప్రయోగం విజయవంతమో కాదో తేలడానికి.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జూలై 14న చంద్రయాన్-3ని విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ అంతరిక్ష నౌక ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవనుంది. ఇప్పటికే అంతరిక్ష నౌక ఇటీవల చంద్రుడి దూరంలో మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసింది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై చంద్రయాన్ ల్యాండింగ్ అయితే చరిత్ర సృష్టించినట్లే.

చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్‌ను నిర్ధారించడానికి వివిధ ఎలక్ట్రానిక్, మెకానికల్ సబ్‌సిస్టమ్‌లతో కూడిన నావిగేషన్ సెన్సార్లు, ప్రొపల్షన్ సిస్టమ్‌లు ఉన్నాయి. వాటితో పాటుగా రోవర్‌ను సురక్షితంగా దించడానికి టూ-వే కమ్యూనికేషన్-సంబంధిత యాంటెనాలు, ఇతర ఆన్‌బోర్డ్ ఎలక్ట్రానిక్స్ యంత్రాంగాలు ఉన్నాయి. చంద్రయాన్ ప్రధాన లక్షాలు మొదటగా సురక్షిత ల్యాండింగ్ చేయడం, చంద్రుడిపై రోవర్‌ను దించడం, ఇన్-సిటు శాస్త్రీయ ప్రయోగాలు చేయడమే. 

చంద్రయాన్-3 అభివృద్ధి దశ జనవరి 2020లో ప్రారంభమైంది. 2021లో ప్రయోగించాల్సి ఉంది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మిషన్ కొంత కాలం వాయిదా పడుతూ వచ్చింది. 2019లో చంద్రయాన్-2 చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో సవాళ్లను ఎదుర్కొన్న సవాళ్లు, ప్రధాన మిషన్ విఫలమడంతో శాష్త్రవేత్తలు చంద్రయాన-3కి శ్రీకారం చుట్టారు.

చంద్రయాన్-1 మిషన్ సమయంలో ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3400 కంటే ఎక్కువ సార్లు తిరిగింది.  ఆగష్టు 29, 2009న అంతరిక్ష నౌకతో కమ్యూనికేషన్ కోల్పోవడంతో మిషన్ ముగిసింది. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ గత వారం చంద్రయాన్ 3 పురోగతిపై విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నాయని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అంతా సవ్యంగా జరుగుతోందని, ఆగస్ట్ 23న చంద్రునిపై ల్యాండింగ్ చేసేందుకు వరకు వరుసగా కక్ష్య విన్యాసాలు చేస్తున్నామన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
2027లో నాసిక్ కుంభమేళాకు వెళ్లాలి అనుకుంటే ఈ వివరాలు, సింహస్థ రాజస్నాన తేదీలు తెలుసుకోండి!
Rahul Gandhi: దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
దేశంలో ఫాసిస్టులు ఆగడాలు పెరిగిపోయాయ్.. భారత్ సమ్మిట్‌లో కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
PM Kisan Yojana Rules: పీఎం కిసాన్ రూల్స్.. ఒకే ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే రూ. 6,000 ఎవరికి వస్తాయి?
పీఎం కిసాన్ రూల్స్.. ఒకే ఇంట్లో నలుగురు అన్నదమ్ములు ఉంటే రూ. 6,000 ఎవరికి వస్తాయి?
UP Elections 2027 : అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?
అఖిలేష్ మొండిచేయితో ఒవైసీ-ఆజాద్ నయా కూటమి.. ఓట్లు చీల్చి యోగిని మరోసారి గెలిపించే ప్లానా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Gig Workers Scheme Bebefits: గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
గిగ్ వర్కర్ల పథకాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి.. వారికి వచ్చే బెనిఫిట్స్ ఇవే
Fastest Charging Electric Cars: భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
భారత్‌లో అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే Electric Vehicles ఇవే.. లిస్ట్ చూసి కొనేయండి
Embed widget