వర్షాకాల సమావేశాల ముందు ఆల్‌పార్టీ మీటింగ్, పిలుపునిచ్చిన కేంద్రం
All-Party Meeting: ఈ నెల 19వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్‌కి కేంద్రం పిలుపునిచ్చింది.
All-Party Meeting:
19వ తేదీన మీటింగ్..
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. అంతకు ముందు రోజు..అంటే జులై 19వ తేదీన ఆల్ పార్టీ మీటింగ్‌కి పిలుపునిచ్చింది. ఆగస్టు 10వ తేదీ వరకూ వర్షాకాల సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నెల రోజుల్లో దాదాపు 20 సార్లు సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం ముందు వీటికి ముగింపు పలకనున్నారు. ఈ సారి సమావేశాలు సజావుగా సాగుతాయా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. ఈ సెషన్లోనే యునిఫామ్ సివిల్ కోడ్ బిల్ ప్రవేశపెట్టాలని కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో పాటు ఢిల్లీ పాలనా వ్యవహారాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌నీ పాస్ చేయాలని చూస్తోంది. ఆప్ తీవ్రంగా ఖండిస్తున్నా...బిల్ తీసుకు రావాలని గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. వీటితో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ (DPDP)ని ప్రవేశపెట్టనుంది. సమాచార భద్రత ప్రజల హక్కు అని తేల్చి చెబుతున్న కేంద్రం...వ్యక్తిగత వివరాలను సురక్షితంగా ఉంచేందుకే ఈ బిల్ తీసుకురానున్నట్టు వివరిస్తోంది. ఇంటర్నెట్ కంపెనీస్, మొబైల్ యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారానికి జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే కేబినెట్ ఈ డ్రాఫ్ట్ బిల్కి ఆమోదం తెలిపింది. మాన్సూన్ సెషన్లో పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు.
Ahead of monsoon session of Parliament, Centre calls for all-party meeting on July 19
— ANI Digital (@ani_digital) July 6, 2023
Read @ANI Story | https://t.co/bTou1twtAD#MonsoonSession #Parliament #AllPartyMeeting pic.twitter.com/nJpSKFDj0s
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలు కానున్నాయని పార్లమెంటరీ కమిటీ క్యాబినెట్ కమిటీ ఖరారు చేసింది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో క్యాబినెట్ కమిటీ సమావేశం జరిగింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అధికారికంగా ట్వీట్ చేశారు.
"పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి మొదలవుతాయి. ఆగస్టు 11వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు సభ సజావుగా సాగేలా చూస్తారని ఆశిస్తున్నాను. ఫలవంతమైన చర్చలు జరపాలని కోరుకుంటున్నాను"
- ప్రహ్లాద్ జోషి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి
"Monsoon Session, 2023 of Parliament will commence from 20th July and continue till 11th August. Urge all parties to contribute towards productive discussions on Legislative Business and other items during the Monsoon Session," tweets Parliamentary Affairs Minister Pralhad Joshi pic.twitter.com/1o5rq0odug
— ANI (@ANI) July 1, 2023
యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్‌ని ఈ వర్షాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇదే విషయం చెబుతున్నాయి. జులైలో వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. అప్పుడే దీనిపై కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. కేబినెట్ కమిటీ మీటింగ్‌లో డిసైడ్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం...Uniform Civil Code Bill ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపనుంది. దీనిపై అందరి అభిప్రాయాలూ తెలుసుకుంటుంది. ఆ తరవాతే పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. యునిఫామ్ సివిల్ కోడ్ (UCC)పై కేంద్రం స్పీడ్ పెంచిన నేపథ్యంలో కాంగ్రెస్ కూడా కసరత్తులు మొదలు పెట్టింది. సోనియా గాంధీ కీలక నేతలతో ఇప్పటికే చర్చించారు.
Also Read: రాజకీయాల్లో రిటైర్మెంట్ అనేదే ఉండదు, అజిత్ పవార్‌కి లాలూ కౌంటర్