అన్వేషించండి

CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!

సీబీఎస్ 12వ తరగతి రీవ్యాల్యుయేషన్ గడువును జూన్ 7 వరకు పొడిగించింది. వివాదాస్పద ఆన్‌ స్క్రీన్ మార్కిగ్ విధానం, సాంకేతిక లోపాలు, భారీగా తగ్గించిన ఫీజుల వివరాలు పూర్తి సమాచారం ఇక్కడ చూడొచ్చు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సీబీఎస్‌ఈ 12వ ఫలితాలపై ఆందోళన, రీవాల్యుయేషన్ గడువు పొడిగింపు.
  • ఆన్‌స్క్రీన్ మార్కింగ్ లోపాలు, తప్పుడు జవాబు పత్రాలతో వివాదం.
  • పోర్టల్‌పై సైబర్ దాడి, అధికారుల తొలగింపు, విచారణ మొదలు.

CBSE Verification Last Date Extended:దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను నిర్మయించే సిబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు చుట్టూ ముసురుకున్న వివాదం సద్దుమణగడం లేదు. కొత్తగా ప్రవేశ పెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానం తెచ్చిన తంటాలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  విద్యార్థుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకున్న బోర్డు రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ దరఖాస్తు గడువును జూన్ 7 అర్థరాత్రి వరకు పొడిగించింది. 

రేపటి వరకు గడువు

గతంలో ఈ గడువు జూన్ 6వ తేదీతో ముగియాల్సి ఉండగా పోర్టల్ స్లో అవ్వడం, పేమెంట్ ఫెయిల్యూర్స్ వంటి సమస్యల కారణంగా విద్యార్థులకు అదనపు సమయం కల్పిస్తున్నట్టు బోర్డు ప్రకటించింది. 

2026 బోర్డు పరీక్షల కోసం సీబీఎస్‌ఈ తొలిసారిగా ఆన్‌స్క్రీన్‌ మార్కింగ్ విధానాన్ని అమలు చేసింది. ఇందులో విద్యార్థుల ఫిజిక్ ఆన్స్ షీట్‌లను స్కాన్ చేసి డిజిటల్ మూల్యాంకనం చేస్తున్నారు. అయితే మే 13న ఫలితాలు విడుదలైన తర్వాత అసలు కథ మొదలైంది. గత ేడాది 88.39 శాతంగా ఉన్న ఉత్తీర్ణత ఈసారి 85.2 శాతానికి పడిపోయింది. ఇది విద్యార్థుల్లో అలజడికి కారణమైంది. 

స్కాన్ చేసిన కాపీలు లేకపోవడం, జవాబు పత్రాలు కొన్ని పేజీలు కనిపించకపోవడం, ఒక విద్యార్థి రోల్ నెంబర్‌పై మరొకరి జవాబు పత్ర అప్‌లోడ్ అవ్వడం, రాసిన సమాధానాలకు మార్కులు వేయకపోవడం లేదా తక్కువ మార్కులు రావడం జరిగింది. ఢిల్లీకి చెందిన వేదాంత్ శ్రీవాస్తవ అనే విద్యార్థి తన ఫిజిక్స్ పేపర్‌లో తనది కాని హ్యాండ్ రైటింగ్ ఉందని సోషల్ మీడియాలో ఆధారాలతో నిరూపించడంతో ఈ వివాదం పతాక స్థాయికి చేరుకుంది. దీనిపై స్పందించిన బోర్డు , అది సాంకేతిక తప్పిదమని అంగీకరిస్తూ అతనికి సరైన పేపర్‌ను కేటాయించింది. 

ఫీజులు తగ్గింపు 

విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించేందుకు సీబీఎస్‌ఈ ఫీజులను గణనీయంగా తగ్గించింది. గతంలో వెరిఫికేషన్ కోసం 500 వసూలుచేయగా, ఇప్పడు దానిని వంద రూపాయలకు తగ్గించారు. అలాగే రీ వ్యాల్యుయేషన్ కోసం ఒక్కో ప్రశ్నలు 100 రూపాయలుగా ఉన్న ఫీజును కేవలం 25 రూపాయలకు తగ్గించారు. 

ఎవరు దరఖాస్తు చేయాలి?

మీకు ఆశించిన మార్కులు రాలేదని భావిస్తే, మూల్యాంకనంలో తప్పులు జరిగాయని అనుమాన ఉంటే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అయితే కేవలం స్కాన్ చేసిన ఆన్సర్ షీట్ కాపీలను పొందిన విద్యార్థులు మాత్రమే రీ వాల్యుయేషన్‌, వెరిఫికేషన‌కు అర్హులు. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  • అధికారిక పోస్టర్ postresult.cbseit.in/pvr/ను సందర్శించాలి. మీ లోన్ నెంబర్‌, అడ్మిట్ కార్డు ఐడీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి. భద్రతా కారణాల దృష్ట్యా ఈసారి ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేశారు. 
  • డాష్ బోర్డులో వెరిఫికేషన్ ఇష్యూస్ పై క్లిక్ చేయాలి. మీకు ఏ సబ్జెక్ట్‌లో సమస్య ఉందో దానిని ఎంచుకోండి. 
  • ఒక వేళ పేజీలు మిస్ అయినా, స్కాన్ సరిగా లేకోయినా, లేదా వేరే విద్యార్థి పేపర్ వచ్చినా స్పష్టంగా చెప్పాలి. 
  • యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించి, అప్లికేషన్ కన్ఫర్మేషన్ డౌన్ లోడ్ చేసుకోండి. 

రీ వాల్యుయేషన్ vs వెరిఫికేషన్ తేడా 

చాలా మంది విద్యార్థులు ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. జవాబు పత్రంలో పేజీలు తగ్గినా, టోటలింగ్ తప్పుగా ఉన్నా, లేదా ఏదైనా సమాధానం దిద్దకుండా వదిలేసినా వెరిఫికేన్‌ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ సమాధానం సరిగా ఉన్నప్పటికీ, మార్కింగ్ స్కీమ్ ప్రకారం మార్కులు తక్కువ వేశారని మీరు భావిస్తే, ఒక్కో ప్రశ్న వారీగా మళ్లీ దిద్దమని కోరవచ్చు. దీనికి రీవాల్యుయేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. దీని కోసం మీరు సీబీఎస్‌ఈ అఫీషియల్ మార్కింగ్ స్కీమ్‌తో మీ సమాధానాలు సరిపోల్చుకోవడం మంచిది. 

సైబర్ దాలులు 

ఈ ప్రక్రియ జరుగుతుండగానే సీబీఎస్‌ఈ వెబ్‌సైట్‌పై జూన్ 3న భారీ స్థాయిలో డినైయల్ ఆఫ్ సర్వీస్ దాడి జరిగింది. సుమారు 38 లక్షల ప్యాకెట్లతో జరిగిన ీ దాడి వల్ల వెబ్‌సైట్ స్లో అయ్యింది. అయినప్పటికీ బోర్డు తన టెక్నికల్ టీమ్‌తో పరిస్థితిని చక్కదిద్దింది. మరోవైపు నిసర్గ అధికారి అనే విద్యార్థి ఈ పోర్టల్‌లో చాలా లోపాలు ఉన్నాయని, ఎవరైనా సులభంగా ఇంతరుల డేటాను యాక్సెస్ చేయవచ్చని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. 

ప్రభుత్వం చర్యల 

ఈ మొత్తం గందరగోళానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. సీబీఎస్‌ఈ ఛైర్మన్‌ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాను తొలగించారు. ఈ లోపాలపై న్యాయవిచారణ జరిపించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, పార్లమెంటరీ కమిటీ కూడా దీనిపై విచారణ చేపట్టింది. 

Frequently Asked Questions

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల వివాదం ఏమిటి?

కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్‌స్క్రీన్ మార్కింగ్ విధానం వల్ల పలు లోపాలు తలెత్తాయి. ఉత్తీర్ణత శాతం తగ్గడం, జవాబు పత్రాల్లో తప్పులు ఉండటం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.

రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ గడువు ఎందుకు పొడిగించారు?

పోర్టల్ స్లో అవ్వడం, పేమెంట్ ఫెయిల్యూర్స్ వంటి సాంకేతిక సమస్యల కారణంగా విద్యార్థులకు అదనపు సమయం కల్పించడానికి ఈ గడువును జూన్ 7 వరకు పొడిగించారు.

రీ వాల్యుయేషన్, వెరిఫికేషన్ ఫీజులలో మార్పులు ఏమిటి?

వెరిఫికేషన్ ఫీజును రూ.500 నుండి రూ.100కి తగ్గించారు. అలాగే, రీ వాల్యుయేషన్ కోసం ఒక్కో ప్రశ్నకు రూ.100 నుండి రూ.25కి తగ్గించారు.

రీ వాల్యుయేషన్ మరియు వెరిఫికేషన్ మధ్య తేడా ఏమిటి?

పేజీలు మిస్ అవ్వడం, టోటలింగ్ తప్పులు లేదా సమాధానాలు దిద్దకుండా ఉంటే వెరిఫికేషన్ ఎంచుకోవాలి. మార్కింగ్ స్కీమ్ ప్రకారం మార్కులు తక్కువ వేశారని భావిస్తే రీ వాల్యుయేషన్ ఎంచుకోవాలి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Ram Charan Irumudi: రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
రవితేజ 'ఇరుముడి'లో అతిథిగా రామ్ చరణ్... అసలు నిజం ఏమిటంటే?
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Embed widget