తమిళనాడులో మూతపడ్డ 40 వేలకు పైగా షాప్‌లు, కావేరి వివాదానికి నిరసనగా బంద్
Cauvery Water Dispute: కావేరి వివాదానికి నిరసనగా తమిళనాడులోని తంజావూరులో 40 వేల షాప్‌ల బంద్‌కి పిలుపునిచ్చారు.
Cauvery Water Dispute:
కొనసాగుతున్న కావేరి వివాదం..
తమిళనాడు, కర్ణాటకల మధ్య కావేరి జలాల వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడుకి రోజుకి 3 వేల TMCల నీళ్లు విడుదల చేయాలని కావేరి బోర్డ్ ఆదేశాలను కర్ణాటక తీవ్రంగా ఖండిస్తోంది. ఈ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో ఇటీవలే ఓ రోజు బంద్ పాటించారు. ఇప్పుడు తమిళనాడులోనూ బంద్‌కి పిలుపునిచ్చారు. తంజావూరులో 40 వేలకుపైగా దుకాణాలు మూసేశారు. కావేరి జల వివాదానికి మద్దతుగా ఈ షాప్స్ అన్నీ బంద్ చేశారు. Cauvery Basin Protection Coalition తరపున కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్‌కి పిలుపునిచ్చారు. అటు కేంద్ర ప్రభుత్వంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో విఫలమైందని తమిళనాడు మద్దతుదారులు మండి పడుతున్నారు. రెండ్రోజుల క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి MK స్టాలిన్ (MK Stalin) ఓ తీర్మానం చేశారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదీ జలాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. Cauvery Water Management Authority ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలని అసెంబ్లీలోనే తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపైనా కర్ణాటకలో అలజడి మొదలైంది. నీళ్లు విడుదల చేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేదు కర్ణాటక.
VIDEO | More than 40,000 shops are closed in Tamil Nadu's Thanjavur district today as a sign of protest over Cauvery water dispute today. The full blockade protest is being held on behalf of the Cauvery Basin Protection Coalition against the Karnataka government for refusing to… pic.twitter.com/9o9EFbBFwi
— Press Trust of India (@PTI_News) October 11, 2023
నీళ్లు ఇచ్చేదే లేదంటున్న కర్ణాటక..
ఈ సారి తక్కువ వర్షపాతం నమోదవడం వల్ల ఆ స్థాయిలో నీళ్లు విడుదల చేయడం కుదరదని తేల్చి చెబుతోంది. ఉన్న నీళ్లు వ్యవసాయానికి, బెంగళూరు తాగు నీటి అవసరాలకే సరిపోతుందని...అందులో కూడా వాటా అడిగితే ఎలా అని ప్రశ్నిస్తోంది కర్ణాటక. కర్ణాటకలో మాండ్య ప్రాంతంలో ఎక్కువగా వ్యవసాయ భూములున్నాయి. ఇక్కడ సాగుకి పెద్ద ఎత్తున నీరు అవసరం. ఇక్కడ పండే పంటలే రాష్ట్రానికి ఆధారం. అందుకే...నీళ్లు ఇవ్వడానికి ఆలోచిస్తోంది కర్ణాటక. సెప్టెంబర్ 30వ తేదీన తమిళనాడు రైతులు ఆందోళనలు నిర్వహించారు. KSRTC బస్‌లను అడ్డుకున్నారు. గత నెల రెండు రాష్ట్రాల్లోనూ నిరసనలు జరిగాయి. తమిళనాడులోని డెల్టా రైతులు తమను తామే కొరడాలతో కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.