By: Khagesh | Updated at : 31 Jan 2023 10:31 AM (IST)
ఏంటీ ఆర్థిక సర్వే? ఎందుకు సభలో ప్రవేశ పెడతారు? దాని వల్ల వచ్చే ప్రయోజనం ఏంటీ
Economic survey: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. అనంతరం సభలో ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెడతారు.
ప్రతి సంవత్సరం బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందుక ఆర్థిక సర్వేను కేంద్రం ప్రవేశ పెడుతుంది. దేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తుంది.
సీఈఏ (చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్) వీ అనంత నాగేశ్వరన్ పర్యవేక్షణలో రూపొందించిన ఆర్థిక సర్వేను ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో పెట్టనున్నారు. సాయంత్రానికి వి అనంత నాగేశ్వరన్ దీన్ని మీడియాకు, దేశ ప్రజలకు వివరిస్తారు.
ఏటా రాష్ట్రపతి ప్రసంగం తర్వాత దీన్ని సభ ముందు ఉంచనున్నారు. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమై ఫిబ్రవరి 23 వరకు రెండు దశల్లో కొనసాగుతాయి.
ఆర్థిక సర్వే అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వార్షిక నివేదిక. ఇది గత సంవత్సరంలో దేశ ఆర్థిక పనితీరును వివరిస్తుంది. స్థూల ఆర్థిక గణాంకాలు, దేశ ఆర్థిక పురోగతిని ప్రజలకు విశ్లేషిస్తుంది. ఆర్థిక సర్వే ద్రవ్యోల్బణం రేటు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, విదేశీ మారక నిల్వలు వంటి కీలక విభాగాల్లో ఉన్న పరిస్థితిని తెలియజేస్తుంది. భవిష్యత్తులో దేశం ఎదుర్కోబోయే ఆర్థిక సవాళ్లను కూడా ప్రస్తావిస్తుంది. వాటిని అధిగమించడానికి చేపట్టాల్సిన చర్యలను సూచిస్తుంది.
ఆర్థికంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలను, సానుకూలం అంశాలను, ప్రతికూల ప్రభావాలను పిన్‌టు పిన్ వివరిస్తుంది. దేశంలోని వివిధ రంగాలు సాధించిన పురోగతి డేటాతో అందిస్తుంది. ఆర్థిక వ్యవస్థను మరింత వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను సూచించడానికి కొన్ని సూచనలు చేస్తుంది. ఆర్థిక సర్వే ఇచ్చే డేటాను ఉపయోగించే విధాన రూపకర్తల జరుగుతుందని ఆర్థిక విశ్లేషకులు చెబుతుంటారు.
అంచనా వేసిన స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి వంటి ఆర్థిక అంచనాలు కూడా ఆర్థిక సర్వేలో భాగంగానే ఉంటాయి. వివిధ రంగాల్లో భవిష్యత్‌లో సాధించబోయే వృద్ధిని కూడా ఈ సర్వే అంచనా వేసి చెబుతుంది. వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి ద్వారా సాధించిన ఫలితాలను కూడా సర్వేలో హైలైట్ చేస్తారు. కొన్ని పథకాలు కొనసాగించాలా లేదా ఇంకా మార్పులు ఏమైనా చేయాలా అనే విషయాలను తెలుసుకోవడంలో సహాయపడుతుంది. కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపును ఆర్థిక సర్వే సులభతరం చేస్తుంది.
ఆర్థిక సర్వే చరిత్ర
మొదటి ఆర్థిక సర్వే 1950-51లో సభ ముందు ప్రవేశపెట్టారు. మొదట్లో బడ్జెట్ పత్రాలలో భాగంగా ఆర్థిక సర్వే ఉండేది. 1964లో ఆర్థిక సర్వేను, బడ్జెట్‌ను వేరు చేశారు. అప్పటి నుంచి ఈ రెండు వేర్వేరు రోజుల్లో అంటే.. బడ్జెట్‌కు ఒక రోజు ముందు ఆర్థిక సర్వేను సభలో ప్రవేశ పెట్టడం స్టార్ట్ చేశారు.
ఆర్థిక సర్వే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ A పార్ట్ Bగా ప్రచురిస్తారు. పార్ట్ ఏలో దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సమగ్ర సమీక్ష ఉంటుంది. రెండో భాగంలో ఆరోగ్య సంరక్షణ, పేదరికం, వాతావరణ మార్పు, మానవ అభివృద్ధి సూచిక వంటి విభిన్న సమస్యలపై దృష్టి పెడతారు.
PM SHRI scheme: పీఎం శ్రీ పథకానికి 9 వేల స్కూల్స్ ఎంపిక, త్వరలోనే జాబితా వెల్లడి!
BJP MLA: త్రిపుర అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాడుపని, అశ్లీల వీడియోలు చూస్తూ అడ్డంగా బుక్
తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ
The Elephant Whisperers Film: దేశం గర్వపడేలా చేశారు, 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' బృందానికి ప్రధాని కితాబు
ఇండోర్‌లోని రామనవమి ఆలయంలో అపశృతి- మెట్లబావిలో పడి 12 మంది మృతి
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు