అన్వేషించండి

Assam CM: వచ్చే 10 ఏళ్ల పాటు బీజేపీకి ముస్లింల ఓట్లు అవసరంలేదు: హిమంత బిస్వా శర్మ

Assam CM: బెంగాలీ మాట్లాడే ముస్లింల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ అన్నారు.

Assam CM: బాల్య వివాహాల వంటి పద్ధతులను పక్కనబెట్టి తమను తాము సంస్కరించుకునేంత వరకు రాబోయే పదేళ్ల పాటు మియా ప్రజల ఓట్లు బీజేపీకి అవసరం లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు నదీతీర ప్రాంతాల్లోని బెంగాలీ మాట్లాడే ముస్లిం ప్రజల ఓట్లు అక్కర్లేదని చెప్పుకొచ్చారు. మియా ప్రజల మద్దతు తనకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి ఉందని పేర్కొన్నారు. తమకు ఓటు వేయకుండానే, తమకు అనుకూలంగా నినాదాలం చేయవచ్చని చెప్పారు. 

'బీజేపీ ప్రజా సంక్షేమం చేస్తుంది. అలాంటి బీజేపీకి మియా ప్రజలు మద్దతు ఇస్తారు. కానీ, వారు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు. మాకు మద్దతు ఇవ్వడం వల్ల ఎలాంటి నష్టం లేదు. మియా ప్రజలు హిమంత బిస్వా శర్మకు, నరేంద్ర మోదీకి, బీజేపీకి అనుకూలంగా నినాదాలు చేయనివ్వండి' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు. మియా అనే పదాన్ని.. బెంగాలీ మాట్లాడే ముస్లింల యాసను సూచించడానికి ఉపయోగిస్తారు. 

ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీకి ఓటు వేయవద్దని తానే మియా కమ్యూనిటీ ప్రజలను అభ్యర్థిస్తున్నట్లు అస్సాం సీఎం పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ, బాల్య వివాహాలు, ఛాందసవాదాన్ని అరికట్టేంత వరకు మియా ప్రజలు బీజేపీకి ఓటు వేయవద్దని హిమంత తెలిపారు. ఈ దురాచారాలను నిర్మూలించడానికి దాదాపు 10 ఏళ్ల సమయం పడుతుందని, అప్పటి వరకు మియా ప్రజలను ఓట్లు అడగబోమని చెప్పారు.

బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా నివసించే చాలా ప్రాంతాల్లో పాఠశాలలు లేవని విలేకరులు అస్సాం సీఎం దృష్టికి తీసుకెళ్లగా.. ఆయా ప్రాంతాల్లో విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని హిమంత బిస్వా శర్మ హామీ ఇచ్చారు. మైనారిటీ విద్యార్థులకు చదువుకునే అవకాశం రాదని, రాబోయే రోజుల్లో మైనారిటీ ప్రాంతాల్లో 7 కళాశాలలను ప్రారంభిస్తామని హిమంత చెప్పుకొచ్చారు.

ముస్లిం ఓట్లు అక్కర్లేదని ఎన్నికల వేళ చెప్పిన హిమంత

అస్సాం శాసనసభ ఎన్నికల వేళ 2021 లోనూ హిమంత బిస్వా శర్మ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. బెంగాల్ నుంచి వలస వచ్చిన మియా ముస్లింల ఓట్లు బీజేపీకి అక్కర్లేదని ఎన్నికల వేళ హిమంత వ్యాఖ్యానించారు. మియా ప్రజలను ముస్లింలలో అతివాదులుగా పేర్కొన్న హిమంత బిస్వా శర్మ.. అలాంటి వ్యక్తుల ఓట్లు అవసరం లేదని అన్నారు. మియా ముస్లింలు అస్సాం సంస్కృతిని, భాషను, భిన్నత్వంలో ఏకత్వాన్ని వారు బహిరంగంగానే సవాల్ చేస్తుంటారని అప్పుడు హిమంత ఆరోపించారు. తమను తాము మియాలుగా చెప్పుకునే వారంతా.. అస్సాం సంస్కృతి, భాషకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని హిమంత విమర్శించారు.

అందుకే మియా ముస్లింల ఓట్లతో తాను ఎమ్మెల్యే గెలవాలని కోరుకోవడం లేదని చెప్పారు. వారు వేసిన ఓట్లతో అసెంబ్లీలో కూర్చోలేనంటూ అప్పుడు హిమంత వ్యాఖ్యానించారు. మియాలుగా చెప్పుకునే ముస్లింలకు అస్సాం రాష్ట్రంలో బీజేపీ ఎక్కడా టికెట్లు ఇవ్వబోదని, కాంగ్రెస్ కూడా టికెట్లు ఇవ్వొద్దని హిమంత 2021 లో ఎన్నికల ముందు సూచించారు. అయితే ఆ ఎన్నికల్లో మియా ముస్లింలకు మద్దతునిచ్చే ఏఐయూడీఎఫ్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీ హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Abhishek Banerjee Attack Sonarpur: గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
గుడ్లతో దాడి - హెల్మెట్ పెట్టుకుని వెళ్లిపోయిన మమతా బెనర్జీ మేనల్లుడు - బెంగాల్‌లో కలకలం
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ
విశ్వ గురువు అంటారు.. ఒక్క ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించడం చేతకాదు: UET UG జాప్యంపై రాహుల్ గాంధీ

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget