అన్వేషించండి

పెరోల్‌పై వ‌చ్చాడు, పెళ్లి చేసుకున్నాడు, మ‌ళ్లీ జైలుకెళ్లాడు - అంతా 4 గంట‌ల్లోనే

అత్యాచార ఆరోపణలతో జైలులో ఉన్న ఓ యువకుడు.. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్​పై విడుదయ్యాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇక్కడ బాధితురాలే పెళ్లికూతురు. బిహార్​లో ఈ ఘటన జరిగింది.

అత్యాచార ఆరోపణలతో జైలులో ఉన్న ఓ యువకుడు.. పెళ్లి కోసం నాలుగు గంటల పాటు పెరోల్​పై విడుదయ్యాడు. 20 రోజుల క్రితం అత్యాచారం కేసులో జైలుకెళ్లిన యువకుడు.. బాధితురాలినే పెళ్లి చేసుకుంటాన‌ని న్యాయ‌స్థానానికి తెలిపి, ఆమెతో కలిసి పెళ్లిపీటలెక్కాడు. ప్రస్తుతం ఈ పెళ్లి చుట్టుపక్కల‌ ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన బిహార్​లోని గోపాల్‌గంజ్ జిల్లాలో జరిగింది.

బగాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని మాచర్‌గావ్ గ్రామానికి చెందిన రాహుల్​ కుమార్ హజీపుర్​లో ఇంజనీరింగ్​ చదివాడు. ఆ సమయంలో ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన బాధిత యువతితో ఏర్పడిన స్నేహం ప్రేమ‌గా మారింది. దీంతో ఇద్దరు కలిసి పెళ్లి  చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్ర‌మంలో ఈ నెల‌ 4వ తేదీన ప్రేమికులిద్ద‌రూ గోపాల్​ గంజ్​లోని ఓ గుడికి వెళ్లారు. రోజంతా స‌ర‌దాగా గ‌డిపి, రాత్రి రాహుల్​ కుమార్​ స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆ రాత్రి జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షీణించింది.

మరుసటి రోజు ఉదయం రాహుల్ కుమార్‌.. బాధితురాలిని గోపాల్​ గంజ్​లోని సదర్​ ఆసుపత్రికి తీసుకెళ్లాడు​. ఆమెను పరీక్షించిన అక్కడి వైద్యులు అత్యాచారం జ‌రిగింద‌ని నిర్థారించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి వచ్చిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. రాహుల్​పై అత్యాచార ఆరోపణలతో అరెస్ట్​ చేసి జైలుకు పంపించారు.

అయితే జైలులో ఉన్న రాహుల్​.. పెరోల్​ కోసం కోర్టుకు వెళ్లాడు. తాను యువతిపై అత్యాచారం చేయలేదని.. ఇద్దరం ఇష్టపడే లైంగిక చర్యలో పాల్గొన్నామని తెలిపాడు. ఆమెను వివాహం చేసుకోడానికి జైలు నుంచి విడుదల చేయాలని కోరాడు. రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో పెరోల్ కోసం గోపాల్‌గంజ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్‌ను ఆశ్రయించాయి. నాలుగు రోజుల పెరోల్ కోరగా.. కోర్టు మాత్రం నాలుగు గంటలు మాత్రమే అనుమ‌తించింది. దీంతో శుక్రవారం జైలు నుంచి వచ్చిన రాహుల్.. యువ‌తిని స్థానిక దుర్గాదేవి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహతంతు ముగిసిన తర్వాత గడువు ముగిసేలోపు జైలుకు వెళ్లిన రాహుల్ కుమార్ అధికారుల ముందు లొంగిపోయాడు.

పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే రాహుల్ కుమార్, బాధిత యువతి మార్చి 4వ తేదీ రాత్రి స్నేహితుడి ఇంట్లో గడిపారని గోపాల్‌గంజ్ ట్రైనీ డీఎస్పీ సాక్షి రాయ్ చెప్పారు. అయితే, ఆమె ఆరోగ్యం క్షీణించడంతో బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా రాహుల్ కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని అన్నారు. మరోవైపు, రాహుల్‌ను విడుదల చేయాలని అతని కుటుంబ సభ్యుల కోరుతున్నారు. యువతిపై అత్యాచారం చేయలేదని.. వారిద్దరు ప్రేమించుకున్నారని చెబుతున్నారు. రాహుల్ శిక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారిద్దరు మేజర్లని, వారికి ప్రేమించుకునే హక్కు, పెళ్లి చేసుకునే అర్హత ఉన్నాయని అన్నారు. ఇప్పుడు బాధితురాలిని రాహుల్ పెళ్లి చేసుకున్నాడని.. అందుకైనా అతన్ని విడుదల చేయాలని కోరుతున్నారు. మరి న్యాయస్థానం రాహుల్ కుమార్ కుటుంబ స‌భ్యుల విజ్ఞ‌ప్తిపై ఏ విధంగా స్పందిస్తుంద‌నేది ఆస‌క్తికరంగా మారింది. రెండువైపులా కుటుంబ‌స‌భ్యుల అంగీకారంతోనే పెళ్లి జ‌ర‌గిన నేప‌థ్యంలో రాహుల్‌ను విడుద‌ల చేయాల‌ని కోరుతున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manmohan Singh Death: పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
పసిడి తాకట్టు పెట్టిన మన్మోహన్ సంస్కరణవాది ఎలా అయ్యారు? దేశాన్ని బంగారు బాతులా ఎలా మార్చారు?
Manmohan Singh Death:మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
మానవతావాదిని కోల్పోయాం- తెలుగు రాష్ట్రాల సీఎంలు సహా పలువురి సంతాపం 
Google Security Update: యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
యూజర్ల సమస్యలను పెంచుతున్న గూగుల్ - కొత్త అప్‌డేట్ చేశాక ఏం అవుతోంది?
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
SBI PO Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 600 పీవో పోస్టులు, ప్రిలిమ్స్ పరీక్ష ఎప్పుడంటే?
Embed widget