Beating Retreat: విజయ్ చౌక్‌లో అదిరిపోయేలా బీటింగ్ రిట్రీట్.. 1000 డ్రోన్‌లతో వెలిగిపోయిన ఆకాశం...
Beating Retreat Ceremony: బీటింగ్ రీట్రీట్‌తో రిపబ్లిక్‌డే వేడుకలు ముగిశాయి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాల చీఫ్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
రిపబ్లిక్ డే వేడుకల ముగింపు సందర్భంగా బీటింగ్ ద రీట్రీట్ శనివారం నిర్వహించారు. దిల్లీలోని విజయ్ చౌక్‌లో జరిగిన కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నారవాణె, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ వీఆర్ చౌదరి పాల్గొన్నారు
బీటింగ్ ద రీట్రీట్‌లో భాగంగా ఏ మేరే వతన్ కే లోగో పాటను ఈ కింది లింక్‌లో వినొచ్చు...
#WATCH | Military bands play 'Aey Mere Watan ke Logo' as part of the Beating the Retreat ceremony being held at Vijay Chowk, Delhi pic.twitter.com/MvA32kzbSK
— ANI (@ANI) January 29, 2022
కేరళ, హింద్ కీ సేనతో పాటు ఖదం ఖదం బధయే జా, సారే జహాన్ సే అచ్చా పాటలను కూడా ప్లే చేశారు. ఖదం ఖదం బధయే జా వంశీధర్ శుక్లా రాసిన గీతం. దీనికి స్వరాలు రాసింది రామ్ సింగ్ ఠాకూరి . ఈ పాటఆజాద్ హింద్ ఫౌజ్ కు సంబంధించినదిగా ప్రసిద్ధి. సారే జహాన్ సే అచ్చా ముహమ్మద్ ఇక్బాల్ రచించారు.
70 ఏళ్లలో తొలిసారిగా మహాత్మా గాంధీకి ఇష్టమైన ఏబైడ్ విత్‌మి పాట విజయ్ చౌక్‌లో ప్రతిధ్వనించలేదు. 1962 ఇండియా-చైనా యుద్ధంలో భారత సైనికులు చేసిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకోవడానికి కవి ప్రదీప్ రాసిన ఏ మేరే వతన్ కే లోగోన్ ఈ సంవత్సరం ఆ పాట ప్లేస్‌లో ప్లే చేశారు.
ప్రత్యేక ఆకర్షణగా డ్రోన్, లేజర్ షోలు
వెయ్యికి పైగా డ్రోన్లు ఈ బీటింగ్ ద రీట్రీట్ వేడుకను అందంగా చూపించాయి. ఈ డ్రోన్లు మొత్తం భారత్‌లోనే తయారయ్యాయి.
ఈ డ్రోన్ ప్రదర్శనను బోట్‌లాబ్ డైనమిక్స్ నిర్వహించింది. దీనికి దిల్లీకి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT),డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ ద్వారా సహకారం అందించాయి.
భారత దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటాన్ని కళ్లకు కట్టినట్టు లేజర్ షో ద్వారా చూపించారు.
పూర్వకాలంలో సూర్యాస్తమయం తర్వాత యుద్దాలు చేసే వారు. ఆ సంప్రదాయానికి గుర్తుగా ఈ బీటింగ్ ద రీట్రీట్ నిర్వహిస్తుంటారు.
బీటింగ్ రిట్రీట్ వేడుక శతాబ్దాల నాటి సైనిక సంప్రదాయం. సూర్యాస్తమయం సమయంలో సైనికులు యుద్ధం నుంచి వైదొలిగిన రోజుల గుర్తుగా సాగేది. సైరన్ మోత వినిపించినప్పుడు దళాలు పోరాటాన్ని నిలిపివేసి, తమ ఆయుధాలను దాచి పెట్టి యుద్ధభూమి నుంచి నిష్క్రమించి విశ్రాంతి మందిరాలకు వెళ్లేవారు.