Bangalore Traffic Alert: బెంగళూరు వాసులకు బిగ్ అలర్ట్- ఈ రూట్‌లో వెళ్తే ఇబ్బందే!
Bangalore Traffic Alert: మెట్రోల పనులు కారణంగా కొన్నిప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని సహకరించాలని బెంగళూరు ప్రజలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. ట్రాఫిక్ రద్దీ ఉండే ప్రాంతాలను ప్రకటించారు.

Bangalore Traffic Alert: బెంగళూరు ప్రజలకు బిగ్ అలర్ట్. కొన్ని ప్రాంతాల్లో దాదాపు నెలన్నరపాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అధికారులు తెలిపారు. మెట్రో ప్రాజెక్టు రెండో దశలో పనులు జోరుగా సాగుతున్నాయి. ఆ పనుల కారణంగా కొన్ని రూట్‌లో వెళ్లే వాళ్లకు ఇబ్బందులు తప్పవని ప్రకటించింది.
బెంగళూరు మెట్రో ప్రాజెక్ట్ రెండో దశ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మెట్రో పనులు వల్ల కొన్ని మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని బెంగళూరు ట్రాఫిక్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. మెట్రో రైలు స్తంభాల నిర్మాం చేస్తున్నారు. అందుకే ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు వెంబడి ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పిల్లర్ నంబర్ 163 నుంచి 167 వరకు, సర్జాపూర్ వైపున పనులు జరుగుతున్నాయి.
Traffic Advisory. @DCPSouthTrBCP @Jointcptraffic @CPBlr @blrcitytraffic @BlrCityPolice @acphsrtrps @acpwfieldtrf @halairporttrfps @DCPTrEastBCP @hsrltrafficps @madivalatrfps @wftrps @0RRCA pic.twitter.com/RLJiI9TWn4
— BELLANDURU TRAFFIC BTP (@bellandurutrfps) February 19, 2025
ఈ పనులు దాదాపు 45 రోజులపాటు కొనసాగుతాయి. అందుకే ఔటర్ రింగ్ రోడ్ 27వ మెయిన్ రోడ్ ఫ్లైఓవర్ ర్యాంప్ దిగువన ఉన్న సర్వీస్ రోడ్డు, ఇబ్బలూరు ప్రభుత్వ పాఠశాల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సర్వీస్ రోడ్డు, మెయిన్‌రోడ్డు వెంబడి బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. దీని వల్ల ట్రాఫిక్ నెమ్మది కదులుతుంది. అందుకే పనులు పూర్తి అయ్యే వరకు ప్రజలు సహకరించాలని రిక్వస్ట్ చేశారు.
Also Read: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు రిలీఫ్ - క్లీన్ చిట్ ఇచ్చిన లోకాయుక్త - పదవీ గండం లేనట్లే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

