Anurag Thakur on OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కేంద్రం వార్నింగ్, ఇకపై అలాంటి కంటెంట్‌కి కళ్లెం!
Anurag Thakur on OTT: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కంటెంట్ విషయంలో రూల్స్ అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది.
Anurag Thakur on OTT:
అనురాగ్ ఠాకూర్ భేటీ..
కేంద్ర ఐటీశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ OTTలపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రియేటివ్ ఫ్రీడమ్ పేరు చెప్పుకుని దేశ సంస్కృతికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. OTT సంస్థల ప్రతినిధులతో భేటీ అయిన ఆయన..ఈ హెచ్చరికలు చేశారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై పీనల్ ప్రొవిజన్స్‌పైనా చర్చలు జరిగాయి. అంతే కాదు. ఫిర్యాదులు చేసే ప్రాసెస్‌ని కూడా మార్చాలనే ఉద్దేశంతో ఉన్నారు. క్రియేటివిటీ పేరుతో వెస్టర్న్ కల్చర్‌ని చూపిస్తూ...భారత దేశ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తే సహించమని అనురాగ్ ఠాకూర్ వార్నింగ్ ఇచ్చారు. దుష్ప్రచారాలు చేయడానికి OTTని మీడియంగా వాడుకోవాలని చూడొద్దని స్పష్టం చేశారు. మరో 15 రోజుల్లో వీటిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే....కంటెంట్ విషయంలో ఎలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలో సూచించాలని OTT ప్రతినిధులు కేంద్రమంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది. కోడ్ ఆఫ్ ఎథిక్స్‌పై చర్చలు జరిగినట్టు కొందరు ప్రతినిధులు చెప్పారు.
"క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్ పేరుతో ఏది పడితే అది చూపించడానికి వల్లేదు. ఈ విషయంలో OTT ప్లాట్‌ఫామ్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతదేశంలో ఎన్నో సంస్కృతులున్నాయి. OTT సంస్థలు దీన్ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి. అన్ని ఏజ్ గ్రూప్‌ల వాళ్లనూ పరిగణనలోకి తీసుకుని అలాంటి వాటినే చూపించాలి. ఎలాంటి అసహనానికి లోనుకాకుండా వాళ్లంతా కలిసి చూసేలా ఉండాలి"
- అనురాగ్ ఠాకూర్, కేంద్ర ఐటీ మంత్రి
స్పెషల్ కమిటీ..
అయితే...దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టేందుకు ఠాకూర్ ఓ క్వాసీ జ్యుడీషియల్ బాడీ (quasi-judicial body)ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. ఈ కమిటీలో ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు జ్యుడీషియల్ మెంబర్స్‌ని కూడా నియమించనున్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ కమిటీ కీలకంగా వ్యవహరిస్తుంది. పేరెంటల్ లాక్స్, కంటెంట్ రెగ్యులేషన్, కంటెంట్ డిస్క్రిప్టర్స్ లాంటివి తీసుకురావడం ద్వారా అన్ని వయసుల వాళ్లు అసౌకర్యానికి గురి కాకుండా చూసేలా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమంత్రి OTT ప్రతినిధులకు సూచించారు.
నెట్‌ఫ్లిక్స్‌పై పన్ను..?
భారత్‌లో ఐటీ శాఖ నెట్‌ఫ్లిక్స్‌పై (Tax on Netflix in India) ట్యాక్స్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశంలో స్ట్రీమింగ్ సర్వీసెస్ ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను వేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓ రిపోర్ట్ ఇదే విషయాన్ని వెల్లడించింది. ఇదే ఆచరణలోకి వస్తే...విదేశీ డిజిటల్ కంపెనీలపై పన్ను విధించడం ఇదే తొలిసారి అవుతుంది. భారత్‌లో ఎలక్ట్రానిక్స్ కామర్స్ సర్వీసెస్ అందించే కంపెనీల్లో నెట్‌ఫ్లిక్స్ తొలిసారి ఈ ట్యాక్స్‌ను ఎదుర్కొనే అవకాశముంది. ఇందుకు ప్రధాన కారణం...నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ ( Permanent Establishment) అవ్వడమే. అమెరికాలో హెడ్‌క్వార్టర్స్ ఉన్నప్పటికీ...ఇండియాలోనూ పెద్ద ఎత్తున సర్వీసెస్ అందిస్తోంది ఈ సంస్థ. ప్రపంచంలోనే పాపులర్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ భారత్‌లోనూ బాగానే సంపాదిస్తోందన్న విషయం ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. ఓ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం...2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ రూ.55 కోట్లు ఆర్జించిందని ఐటీ అధికారులు తెలిపారు. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు ఉద్యోగులున్నారని, ఆఫీస్‌లు కూడా ఉన్నాయని చెప్పారు.
Also Read: 20 వేల కార్లు, ఒక్కో వెహికిల్‌పై 100కి పైగా చలానాలు - ట్రాఫిక్ వయలేషన్‌లో రికార్డు ఇది