News
News
X

'అమూల్' వార్షికోత్సవం గిఫ్ట్ లింక్ వచ్చిందా? ఏం ఆలోచించకుండా క్లిక్ చేశారా ఏంటి?

'అమూల్' వార్షికోత్సవం డబ్బులు గెలుచుకోవచ్చు. ఈ లింక్ పై క్లిక్ చేయండి. ఆ డబ్బులు మీ సొంతం అని మెసేజ్ వచ్చిందా? ఆగండి.. ఆగండి..  క్లిక్ చేయోద్దు.

FOLLOW US: 
Share:

మీరు వాట్సాప్ చాలా వాట్సాప్ గ్రూపులో ఉండే ఉంటారు. చాలా ఫార్వర్ట్ మెసేజ్ లు వస్తూనే ఉంటాయి. ఈ మధ్య అమూల్ 75వ వార్షికోత్సవం.. గురించి మీకు సందేశం వచ్చే.. అవకాశం ఉంది. ఈ వాట్సాప్ మెసేజ్ లో మీరు సర్వేలో పాల్గొంటే.. రూ.6000 గెలుచుకోవచ్చు అంటూ.. ఓ లింక్ వస్తుంది. మీకు రివార్డు వస్తుందని చెబుతారు. కానీ ఓపెన్ చేయకండి.

అమూల్ 75వ వార్షికోత్సవం పేరుతో వచ్చే సర్వేలో పాల్గొనకపోవడమే మంచిది. అది నకిలీ. రూ.6000 కాదు కదా.. ఒక్క రూపాయి కూడా ఎవరూ ఇవ్వరు. ఇంకో విషయం ఏంటంటే.. అది అమూల్ సంస్థ చేస్తున్న సర్వే కాదు.  అయితే ఈ విషయంపై కొంతమంది నెటిజన్లు ట్విట్టర్లోకి వెళ్లారు. తమకు వచ్చిన వాట్సప్ సందేశంపై ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ స్కామ్ గురించి ఇతరులను హెచ్చరించారు. రూ .6,000 ఆఫర్ చేస్తామని చెప్పిన స్కామ్ లింక్ పై క్లిక్ చేయోద్దని తెలిపారు.

అయితే.. ఈలింక్‌పై ట్యాప్ చేయమని "www.amuldairy.com" పంపుతారు. కానీ ఈ లింక్‌ని తెరిచినప్పుడు యూజర్ అనుమానాస్పద లింక్‌కి "నాలెడ్జ్‌.సిజ్" వెళ్తుంది. ఇది అమూల్ కార్పొరేషన్‌కి సంబంధించినది కాదు. మనకు ముందు వచ్చినది అమూల్ పేరుతో వచ్చినా.. ఓపెన్ చేయగా.. బాడీ టెక్స్ట్‌లో ఉన్నదానికి భిన్నంగా ఉంటుంది. సందేశంలో లింక్ ఇలా ఉంది: "http://palacefault.top/amul/tb.php?_t=16339198711633920036488".  కాబట్టి ఆ లింక్ ని క్లిక్ చేయకపోవడమే మంచిది. మన వ్యక్తిగత సమాచారం చోరీ చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మీ వ్యక్తిగత, బ్యాంక్ డేటాను దొంగిలించగల మాల్వేర్‌లను కలిగి ఉండొచ్చని చెబుతున్నారు నిపుణులు. అలాంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దని వినియోగదారులకు సూచిస్తున్నారు. 

ఆ లింక్‌ను క్లిక్‌ చేయగానే ఓ విండో ఓపెన్‌ అవుతోంది. అందులో హోమ్‌పేజీలో అమూల్‌ లోగోతో ఓ ఇమేజ్‌ ప్రత్యక్షమవుతోంది. అందులో అమూల్‌ 75వ వార్షికోత్సవం జరుపుకుంటోందని, నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే.. 6వేల రూపాయలు గెలుచుకుంటారని పేర్కొంటోంది. దీనిని గమనించిన వాళ్లు.. ఆశతో నాలుగు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. అవన్నీ చాలా సులువైన ప్రశ్నలే కావడంతో అందరూ చివరి దాకా చేరుకుంటున్నారు. ఆ తర్వాత.. ఈ లింక్‌ను పది వాట్సప్‌ కాంటాక్ట్స్‌కు, నాలుగు వాట్సప్‌ గ్రూపులకు పంపించాలని సూచిస్తోంది. ఆ తర్వాత తిరిగి హోమ్‌పేజీ ఓపెన్‌ అవుతోంది. అంటే.. అందరికీ ఆ లింక్‌ను షేర్‌ చేసిన తర్వాత గానీ, అది తప్పుడు లింక్‌ అని తెలుసుకోలేకపోతున్నారు. అప్పటికి గానీ రియలైజ్‌ అవుతున్న వారు.. కొందరు తిరిగి వాట్సప్‌గ్రూపుల్లో ఇది తప్పుడు లింక్‌ అని, ఎవరూ ఓపెన్‌ చేయొద్దని పోస్ట్‌ చేస్తున్నారు కూడా.

Also Read: 'రాత్రికి రాత్రి ఏంజరుగుంటుందబ్బా..' రిజల్ట్ పై అనసూయ పోస్ట్..
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: 'రెచ్చగొట్టాలని చూశారు.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు..' మోహన్ బాబు ఫైర్..
Also Read:ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 12 Oct 2021 08:41 AM (IST) Tags: Amul anniversary Amul anniversary gift link amul gift link scam Amul 75th anniversary

సంబంధిత కథనాలు

Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!

Agniveer Recruitment Process: 'అగ్నివీరుల' నియామక ప్రక్రియలో కీలక మార్పులు, ఈ ఏడాది నుంచే అమలు!

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

JEE Main Session 1 Result: జేఈఈ మెయిన్‌ సెషన్-1 ఫలితాలు వచ్చేస్తున్నాయ్! ఎప్పుడంటే?

Rajkot News: బస్‌ నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ అటాక్, స్టీరింగ్ పట్టుకుని కంట్రోల్ చేసిన బాలిక

Rajkot News: బస్‌ నడుపుతుండగా డ్రైవర్‌కు హార్ట్ అటాక్, స్టీరింగ్ పట్టుకుని కంట్రోల్ చేసిన బాలిక

US Visa: వీసా అపాయింట్‌మెంట్‌ దొరకట్లేదా? ఏం టెన్షన్ లేదు, నేరుగా ఎంబసీకి వెళ్లి తీసుకోవచ్చు

US Visa: వీసా అపాయింట్‌మెంట్‌ దొరకట్లేదా? ఏం టెన్షన్ లేదు, నేరుగా ఎంబసీకి వెళ్లి తీసుకోవచ్చు

BITSAT Notification 2023: బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

BITSAT Notification 2023: బిట్‌శాట్‌- 2023 నోటిఫికేషన్ విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!

టాప్ స్టోరీస్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్

BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్

BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు  - కేసీఆర్

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Jr NTR: అప్‌డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్

Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్