AWS Infrastructure: అమెజాన్ ఇన్‌ఫ్రా రీజైన్‌గా హైదరాబాద్- ఏటా 48 వేల ఉద్యోగాలకు అవకాశం!
AWS Infrastructure: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) దేశంలో తన రెండో మౌలిక సదుపాయాల ప్రాంతాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది.
AWS Infrastructure: అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భారత్‌లో తన రెండవ మౌలిక సదుపాయాల ప్రాంతాన్ని (infrastructure region) ప్రారంభించింది. AWS ఆసియా పసిఫిక్ (హైదరాబాద్) రీజియన్‌గా ఇది ఉండనుంది.
48 వేల ఉద్యోగాలు
దీని ద్వారా 2030 నాటికి దేశంలో $4.4 బిలియన్ల (సుమారు రూ. 36,300 కోట్లు) కంటే ఎక్కువ పెట్టుబడులు రానున్నట్లు అమెజాన్ తెలిపింది. దీని ద్వారా ఏటా 48,000 కంటే ఎక్కువ ఫుల్ టైమ్ ఉద్యోగాలకు అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
నేటి నుంచి డెవలపర్‌లు, స్టార్టప్‌లు, వ్యవస్థాపకులు, సంస్థలు, అలాగే ప్రభుత్వం, విద్య, లాభాపేక్షలేని సంస్థలు తమ అప్లికేషన్‌లను ప్రాసెస్ చేయొచ్చని పేర్కొంది. దీని ద్వారా దేశంలోని డేటా సెంటర్‌ల నుంచి తుది వినియోగదారులకు (end users) సేవలను అందించవచ్చని వెల్లడించింది.
ఆర్థిక వ్యవస్థకు బూస్ట్
అకో జనరల్ ఇన్సూరెన్స్, యాక్సిస్ బ్యాంక్, క్లెవెర్టాప్, డిజిటల్ ఇండియా కార్పొరేషన్ (MeitY), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, తెలంగాణ ప్రభుత్వం, HDFC బ్యాంక్, జూపిటర్, లెండింగ్‌కార్ట్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఫిజిక్స్ వాల్లా, టాటా ఎల్క్సీతో సహా ఏడబ్ల్యూఎస్‌కు భారత్‌లో లక్షలాది మంది కస్టమర్‌లు ఉన్నారు.
కేటీఆర్
హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన ఏడబ్ల్యూఎస్‌కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Shraddha Murder Case: ఆ క్షణం అలా జరిగిపోయింది- నాకు సరిగా గుర్తులేదు: అఫ్తాబ్