Air India Plane Crash Live Updates: మెడికల్ కాలేజీ వద్ద కూలిన విమానం, 20 మందికి పైగా మెడికోలు సైతం మృతి
గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 242 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

Background
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం సర్దార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని మేఘనీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఈ విమానం అహ్మదాబాద్ నుండి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్. టేకాఫ్ సమయంలో విమానం రన్‌వే నుండి జారిపడి సమీపంలోని రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలినట్లు తెలుస్తోంది. విమానంలో 242 మంది ప్రయాణీకులు ఉన్నట్లు అంచనా.
విమానం క్రాష్ సైట్ నుండి దట్టమైన నల్లని పొగలు లేచాయి, స్థానిక నివాసులు భారీ శబ్దం విన్నట్లు, ఆ తర్వాత మంటలు చెలరేగినట్లు తెలిపారు. అగ్నిమాపక దళం, అత్యవసర సహాయ బృందాలు, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైర్ టెండర్లు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. కొన్ని నివేదికలు విమానం బౌండరీ వాల్‌ను ఢీకొన్నట్లు సూచిస్తున్నాయి, మరికొన్ని టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్యలను పేర్కొంటున్నాయి.
Three National Disaster Response Force (NDRF) teams, comprising 90 personnel, have been moved from Gandhinagar to the plane crash site. A total of three more teams are being moved from Vadodara: NDRF https://t.co/vfq9ALKvAi pic.twitter.com/aeuVO8GaYS
— ANI (@ANI) June 12, 2025
మెడికల్ కాలేజీ వద్ద కూలిన విమానం, 20 మందికి పైగా మెడికోలు సైతం మృతి
అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే AI171 Boeing 787 Dreamliner ఇండిగో విమానం క్రాష్ అయింది. అయితే జేబీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ మీద కూలడంతో 20 మందికి పైగా మెడికోలు మృతిచెందారని అధికారులు చెబుతున్నారు.
Air India Plane Crash:సేవలు పునరుద్ధరించిన అహ్మదాబాద్ విమానాశ్రయం
AI171 Boeing 787 Dreamliner విమాన ప్రమాదం కారణంగా తాత్కాలికంగా నిలిపివేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమాన సేవల్ని పునురుద్ధరించారు. అహ్మదాబాద్ లోని విమానాశ్రయం సేవలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.





















