Agnipath Protests: అగ్నిపథ్ సెగలు- బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లో హింసాత్మక ఆందోళనలు
Agnipath Protests: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ తీవ్ర ఆందోళనలు జరుగుతున్నాయి. బిహార్, యూపీలో పలు రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు.
Agnipath Protests: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌పై మూడో రోజూ ఆందోళనలు ఉద్ధృతంగా సాగుతున్నాయి. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలో శుక్రవారం ఉదయం పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి.
యూపీలో
UP: Crowd gathered at Ballia Railway Station in protest against #AgnipathScheme
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 17, 2022
Forces have been deployed at station since morning. A few hooligans reached there but they were stopped from damaging much; they attempted stone-pelting. Action being taken: Ballia DM Saumya Agarwal pic.twitter.com/lSmW74l6tk
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాలియా రైల్వే స్టేషన్ ముందు నిరసన చేపట్టారు ఆందోళనకారులు. కొందరు దుండగులు రైల్వే స్టేషన్లోకి చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీరిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
బిహార్‌లో
#WATCH | Bihar: The residence of Deputy CM Renu Devi, in Bettiah, attacked by agitators during their protest against #AgnipathScheme
— ANI (@ANI) June 17, 2022
Her son tells ANI, "Our residence in Bettiah was attacked. We suffered a lot of damage. She (Renu Devi) is in Patna." pic.twitter.com/Ow5vhQI5NQ
బిహార్‌లోని లఖీసరాయ్ రైల్వే స్టేషన్‌లో ఓ రైలుకు కొంతమంది దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మొత్తం ఐదు కంపార్ట్‌మెంట్లు కాలిపోయాయి. ఆందోళనకారులు నిప్పుపెట్టడం వల్ల రైల్లోని ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు తీశారు. లఖ్మీనియా రైల్వే స్టేషన్‌కు కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు. రైల్వే ట్రాక్‌పై టైర్లు పెట్టి నిప్పుపెట్టారు.
అగ్నిపథ్ విధానాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు ఆందోళనలు చేపడతామని, వెనక్కి తగ్గబోమని ఆందోళనకారులు తేల్చి చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Agneepath Recruitment Scheme: అగ్నిపథ్‌తో సైన్యానికి లాభమా, నష్టమా- ప్రభుత్వం ఏం చెబుతోంది