అన్వేషించండి

ABP-CVoter Opinion Poll: రాహుల్ గాంధీ, ఖర్గే పనితీరు ఎలా ఉంది? జనాలు ఏమనుకుంటున్నారు?

2024 Elections Opinion Polls: ఏబీపీ సీఓటర్ చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే తీరు పట్ల జనాలు కాస్త సంతృప్తికరంగానే ఉన్నట్లుగా తేలింది.

ABP CVoter Survey: ఎంతో ఉత్కంఠ నడుమ జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముగియడంతో.. ఇప్పుడు దేశ ప్రజల కన్ను సార్వత్రిక ఎన్నికలపై పడింది. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోపు జరుగుతాయని భావిస్తున్న ఈ లోక్ సభ ఎన్నికల్లో జాతీయంగా ఏ పార్టీ సత్తాచాటుతుందా? అనే ఆసక్తి అప్పుడే మొదలైపోయింది. ఇంకో మూడు నెలల్లో జరగబోయే ఎన్నికల కోసం అప్పుడే జాతీయ పార్టీలతో పాటు, ప్రాంతీయ పార్టీలు కూడా తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 

ఇటీవల న్యూదిల్లీలో జరిగిన I.N.D.I.A కూటమి నాలుగో సమావేశంలో తమ ప్రధాని అభ్యర్థిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పేరును త్రుణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు. 

ఇలాంటి రాజకీయ పరిస్థితుల మధ్య ఏబీపీ సంస్థ సీఓటర్ తో కలిసి చేసిన సర్వేలో ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. దేశ వ్యాప్తంగా ఏబీపీ సీఓటర్ చేపట్టిన సర్వేలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే తీరు పట్ల జనాలు కాస్త సంతృప్తికరంగానే ఉన్నట్లుగా తేలింది. ఈ సర్వే ప్రకారం.. దాదాపు 39 శాతం మంది ఓటర్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పని తీరు పట్ల అసంతృప్తికరంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. మరో 26 శాతం మంది చాలా బాగుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 21 శాతం మంది మాత్రం తాము తక్కువ సంతృప్తికరంగా ఉన్నామని చెప్పారు. 14 శాతం మంది తమకు దీని గురించి తెలియదని అన్నారు.

మల్లిఖార్జున ఖర్గేపై ప్రజాభిప్రాయం ఇదీ..
ఏబీపీ సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. చాలా మంది ఖర్గే పనితీరు పట్ల అసంతృప్తికరంగానే ఉన్నారు. దాదాపు 35 శాతం మంది ఖర్గే పనితీరు పట్ల అసంతృప్తికరంగా ఉండగా.. 20 శాతం మంది తక్కువ సంతృప్తికరంగా ఉన్నారు. 15 శాతం మంది మాత్రం సంతృప్తికరంగా ఉన్నారు. మరో 30 శాతం మంది తమకు తెలియదని చెప్పారు.

I.N.D.I.A కూటమిపై ప్రజాభిప్రాయం ఏంటి?
సీఓటర్ ఒపీనియన్ పోల్ ప్రకారం.. I.N.D.I.A కూటమిలో ఐకమత్యం ఉంటుందని చాలా మంది విశ్వసించడం లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకైనా I.N.D.I.A కూటమిలో ఉన్న పార్టీ మధ్య ఐకమత్యం ఉంటుందా అని 50 శాతం మంది అనుమానం వ్యక్తం చేశారు. I.N.D.I.A కూటమి నిలకడగా ఉంటుందనే విషయంలో చాలా మంది ఈ సర్వేలో పాల్గొన్న పౌరులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

[Disclaimer: This Opinion poll was conducted by CVoter. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding off. The margin of error is +/- 3% at the macro level and +/- 5% at the micro level.]

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget