(Source: ECI/ABP News/ABP Majha)
Aadhaar Data Leak: దేశ చరిత్రలో అతిపెద్ద లీక్, అమ్మకానికి 81.5 కోట్ల మంది ఆధార్ డేటా
Aadhaar Data Leak: దేశ చరిత్రలో అతి పెద్ద డేటా లీక్ బయటపడింది. ICMR వద్ద అందుబాటులో ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల డేటా డార్క్ వెబ్సై్ట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది.
Aadhaar Data Leak: దేశ చరిత్రలో అతి పెద్ద డేటా లీక్ బయటపడింది. 81.5 కోట్ల మంది భారతీయుల ఆధార్ సమాచారం డార్క్ వెబ్‌లో అమ్మకానికి ఉంచారు. ICMR వద్ద అందుబాటులో ఉన్న 81.5 కోట్ల మంది భారతీయుల డేటా డార్క్ వెబ్‌సైట్‌లో విక్రయానికి అందుబాటులో ఉంది. ఇందులో ఆధార్, పాస్‌పోర్ట్ వివరాలతోపాటు పేరు, ఫోన్ నంబర్, చిరునామా వంటి ముఖ్యమైన సమాచారాన్ని హ్యాకర్లు ‘బ్రీచ్ ఫోరమ్స్’పై పోస్ట్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆధార్‌లో నిక్షిప్తమైన భారతీయుల బయోమెట్రిక్ వివరాల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది.
భారతీయుల డాటా చోరీ విషయాన్ని ముందుగా అమెరికాకు చెందిన సైబర్ సెక్యూరిటీ, నిఘా విభాగమైన ‘రీసెక్యూరిటీ’ సంస్థ బయటపెట్టింది. అక్టోబర్ 9 న PWN0001 అనే మారుపేరుతో పిలిచే ఒక వ్యక్తి 81.5 కోట్ల మంది భారతీయ పౌరుల ఆధార్, ఆధార్ వివరాలను ఉల్లంఘన ఫోరమ్‌లో పోస్ట్ చేసినట్లు రీ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. తమ వద్దనున్న డాటాకు రుజువుగా నాలుగు శాంపిల్స్‌ను కూడా సదరు అజ్ఞాత వ్యక్తి బయటపెట్టారు. ఒక్కో శాంపిల్‌లో లక్ష మందికి సంబంధించిన ‘గుర్తించదగిన వ్యక్తిగత సమాచారం (పీఐఐ)’ ఉన్నట్టు చెప్తున్నారు.
భారత ఆరోగ్య వ్యవస్థపై హ్యాకర్లు దాడులు చేయటం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది ఢిల్లీలోని ఎయిమ్స్‌పై సైబర్ దాడులు జరిగాయి. సర్వర్లన్నింటినీ తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న హ్యాకర్లు ఔట్‌పేషెంట్ విభాగంలోని రోగుల రికార్డులన్నీ ప్రభావితం చేశారు. తాజా కొవిడ్ పరీక్షలు జరిపిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయా వైద్య సంస్థలు సేకరించిన పౌరుల వివరాలు ఐసీఎంఆర్‌కు, జాతీయ సమాచార కేంద్రానికి (ఎన్‌ఐసీ), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు అందించారు. ఈ మూడు ప్రదేశాలలో ఎక్కడి నుంచి డాటా చోరీ అయిందో తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
లీక్ అయిన డేటాలో భారతీయ పౌరుల వ్యక్తిగత వివరాలతో కూడిన 1,00,000 ఫైల్స్ ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. హంటర్ అనలిస్ట్ ఈ డేటా జెన్యూన్ అని, ఆధార్ కార్డు డేటాను ప్రభుత్వ వెబ్ సైట్‌లోని వెరిఫై ఆధార్ ఫీచర్ ద్వారా సరిపోల్చి చూశాడని తెలిపింది. డాటా చోరీ విషయం తెలిసిన వెంటనే వివిధ ప్రభుత్వ సంస్థలు, మంత్రిత్వశాఖలకు చెందిన ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా (CERT-In) డేలా లీక్ గురించి ICMRని అప్రమత్తం చేసింది. అమ్మకానికి కోసం విడుదల చేసిన డేటాను ICMR ప్రధాన డేటాతో సరిపోల్చాలని ఏజెన్సీ కోరింది.
భారతదేశంలోని ఒక పెద్ద వైద్య సంస్థ ఉల్లంఘనను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, సైబర్ నేరగాళ్లు AIIMS సర్వర్‌లను హ్యాక్ చేశారు. 1TB కంటే ఎక్కువ డేటాను స్వాధీనం చోరీ చేశారు. 2022 డిసెంబర్‌లో, ఢిల్లీలోని AIIMS డేటాను చైనీయులు హ్యాక్ చేసి రూ. 200 కోట్ల క్రిప్టో కరెన్సీని డిమాండ్ చేశారు. గత నెలలో జార్ఖండ్‌లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ నుంచి డేటా చోరీకి గురైంది. 3.2 లక్షల మందికి పైగా రోగుల రికార్డులను డార్క్ వెబ్‌లో విక్రయానికి ఉంచారు.