IAF Chief VR Chaudhari: 'పాక్, చైనా ఒక్కొక్కటిగా కాదు.. కలిసొచ్చినా భారత్‌ను ఏం చేయలేవు'
పాకిస్థాన్, చైనాకు భారత వాయుసేన అధిపతి వీఆర్ చౌదరీ పరోక్ష హెచ్చరికలు చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
భారత్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరీ అన్నారు. అక్టోబర్ 8 'ఎయిర్ ఫోర్స్ డే'కు ముందు.. చైనా, పాకిస్థాన్‌ను పరోక్షంగా హెచ్చరించారు వాయుసేన అధిపతి.
The situation on the Line of Actual Control is that the Chinese Air Force is still present on three air bases on their side of the LAC. We are fully deployed and prepared on our side: IAF Chief Air Chief Marshal VR Chaudhari on 89th anniversary of IAF pic.twitter.com/SgHNym26yd
— ANI (@ANI) October 5, 2021
The induction of Rafale, Apaches have significantly added to our combat potential. Our offensive strike capability has become even more potent with the integration of new weapons on our fleets: IAF Chief Air Chief Marshal VR Chaudhari pic.twitter.com/LasDUQs4Ty
— ANI (@ANI) October 5, 2021
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ఉన్న ఎయిర్ ఫీల్డ్స్ గురించి ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని చౌదరీ అన్నారు. ఎందుకంటే అవి ప్రత్యక్ష యుద్ధంలో ఉపయోగపడేంత పెద్దవి కాదన్నారు.
చైనా, పాకిస్థాన్ కలిసి వచ్చినా భారత్‌ను ఏం చేయలేవని ఐఏఎఫ్ చీఫ్ అన్నారు. వారి భాగస్వామ్యం గురించి ఆందోళన అవసరం లేదన్నారు.
Also Read:Shiba Inu Coin Price Rise: రాకెట్‌లా దూసుకుపోయిన 'షిబా ఇను'.. 24 గంటల్లో 45 శాతం!