INS Visakhapatnam: నౌకాదళ విధుల్లో చేరిన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'.. ఇక చైనాకు దడ తప్పదు!
అత్యంత శక్తిమంతమైన 'ఐఎన్ఎస్ విశాఖపట్నం' నౌక ముంబయి విధుల్లో చేరింది. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత తొలి 'స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్' ఐఎన్ఎస్ విశాఖపట్నం నేడు ముంబయి విధుల్లో చేరింది. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు నౌకాదళ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
Defence Minister Rajnath Singh attended the commissioning of INS Visakhapatnam at Mumbai dockyard, today. pic.twitter.com/stdMPhGsBZ
— ANI (@ANI) November 21, 2021
రాజ్‌నాథ్ సింగ్ అధికారులతో కలిసి ఐఎన్ఎస్ విశాఖపట్నం ప్రత్యేకతలను గమినించారు. దీని రాకతో హిందూ మహాసముద్రంలో భారత్ బలం మరింత పెరిగిందన్నారు. భారత్‌పై ఆధిపత్యం చెలాయించాలనుకునే దేశాలకు తగిన గుణపాఠం చెబుతామని చైనాను పరోక్షంగా హెచ్చరించారు రాజ్‌నాథ్ సింగ్.
పేరు ఎలా వచ్చింది?
ప్రాజెక్టు 15బీ పేరుతో మొత్తం నాలుగు అత్యంత అధునాతన నౌకలను తయారు చేస్తున్నారు. ముంబయి మజగాన్ డాక్‌లో ఈ నౌకను నిర్మించారు. నౌకలకు ప్రముఖ నగరాల పేర్లను పెట్టడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ నౌకకు 'ఐఎన్ఎస్ విశాఖపట్నం'గా నామకరణం చేశారు.
ఇవే ప్రత్యేకతలు..
- ఈ నౌక కదలికల్ని శత్రుదేశ రాడార్లు గుర్తించలేవు. ఇందుకోసం అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు.
- రెండు మల్టీరోల్ హెలీకాప్టర్లు ఇందులో ఉంటాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలు రకాల క్షిపణులను ఈ నౌక నుంచి ప్రయోగించవచ్చు.
- జలాంతర్గాములను కూడా ఇది గుర్తించి దాడి చేయగలదు.
Also Read: Farm Laws Repeal: సాగు చట్టాలపై భాజపా షాకింగ్ కామెంట్స్.. కావాలంటే మళ్లీ తీసుకొస్తారట!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 10,488 మందికి కరోనా, 313 మంది మృతి
Also Read: సిగ్గు సిగ్గు.. స్టేజ్ మీదే అభిమాని ముఖంపై మూత్రం పోసిన లేడీ సింగర్
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..