Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బులెట్ ప్రూఫ్ టెక్నాలజీ చూశారా? అమెరికా కూడా ఇంత అప్‌డేట్ అవ్వలేదు! - వైరల్ వీడియో
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బులెట్ ప్రూఫ్ వీడియో వైరల్ అవుతోంది.
Imran Khan Bullet Proof Video:
కోర్టుకు వచ్చిన ఇమ్రాన్..
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టులో హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఆయన వెరైటీ బుల్లెట్ ప్రూఫ్‌తో వచ్చారు. తలకు పెట్టుకున్న బులెట్ ప్రూఫ్ హెల్మెట్‌ను చూస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సాధారణంగా ఎవరికైనా థ్రెట్ ఉంటే బులెట్ ప్రూఫ్ జాకెట్‌లు వేసుకుంటారు. కానీ...ఇమ్రాన్ ఖాన్‌కు మాత్రం ఓ నలుగురు గార్డ్‌లు షీల్డ్‌లు పట్టుకుని ముందు నడుస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఓ కేసులో అరెస్ట్ అయిన ఇమ్రాన్...బెయిల్ పిటిషన్ వేసేందుకు కోర్టుకు వచ్చారు. అప్పుడే ఈ వింత బులెట్ ప్రూఫ్ టెక్నాలజీతో కనిపించారు. దీన్ని చూసిన నెటిజన్లు ఆయనపై సెటైర్లు వేస్తున్నారు. "ఇదెక్కడి టెక్నాలజీరా బాబు" అంటూ కామెంట్‌లు పెడుతున్నారు. ఈ టెక్నాలజీని చూసి అమెరికా అసూయ పడుతుందేమో అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.
Ex Paxtan PM Imran Khan brought to anti-terrorism court in Lahore with bullet proof shield covers.
— Major Surendra Poonia (@MajorPoonia) April 4, 2023
See a bullet proof bucket 🪣 on top of Imran’s head !
How Pakis will save their nuclear arsenal from terrorists 🤔? pic.twitter.com/Y00orHzVsY
Ex Paxtan PM Imran Khan brought to anti-terrorism court in Lahore with bullet proof shield covers.
— Major Surendra Poonia (@MajorPoonia) April 4, 2023
See a bullet proof bucket 🪣 on top of Imran’s head !
How Pakis will save their nuclear arsenal from terrorists 🤔? pic.twitter.com/Y00orHzVsY
But they want India to play cricket in Pakistan! @TheRealPCB U must be joking, PCB!
— R2D2 (@aar2dee299) April 4, 2023
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంటిని గత నెల ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో PTI కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. భద్రతా సిబ్బందిపై ఇమ్రాన్ మద్దతుదారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో దాదాపు 25 మంది సిబ్బంది గాయపడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ఇమ్రాన్ ఖాన్ సహా 12 మంది కార్యకర్తలపై ఉగ్రవాద కేసు నమోదు చేశారు. ఇస్లామాబాద్ కోర్టు ఎదుట కూడా అల్లర్లకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ లాహోర్ నుంచి విచారణకు ఇస్లామాబాద్ కోర్టుకు వచ్చిన సమయంలో పెద్ద ఎత్తున అలజడి రేగింది. పోలీస్ చెక్‌పోస్ట్‌లను ధ్వంసం చేశారు. రెండు పోలీసు వాహనాలు, 7 బైక్‌లకు నిప్పంటించారు. స్టేషన్ హౌజ్ ఆఫీసర్ వాహనాన్నీ ధ్వంసం చేశారు. అప్పటికప్పుడు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ కోర్టులో విచారణకు ఇమ్రాన్ బయల్దేరిన వెంటనే వేలాది మంది పోలీసులు ఆయన ఇంటిని చుట్టు ముట్టారు. బారికేడ్లు, టెంట్లను తొలగించారు. వందలాది మంది మద్దతుదారులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాడులకు దిగారు. వారందరినీ చెదరగొట్టిన పోలీసులు ఇమ్రాన్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అటు పీటీఐ కార్యకర్తలు పోలీసులపై కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అనవసరంగా రెచ్చగొట్టి హింసకు ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు.
Also Read: Kichcha Sudeep Threat: కిచ్చ సుదీప్‌కు బెదిరింపు లేఖ, ప్రైవేట్ వీడియోలు బయట పెడతామంటూ వార్నింగ్