Elizabeth II: బ్రిటన్‌లో రాజుల పాలన ఉన్నట్టుండి రాణి చేతిలోకి ఎలా వెళ్లింది?
Elizabeth II: విక్టోరియా రాణి తరవాత ఎన్నో దశాబ్దాల పాటు రాజుల పాలనే కొనసాగింది. అనూహ్యంగా ఎలిజబెత్-2 రాణిగా మారారు.
Elizabeth II Death:
ఎలిజబెత్-2కి ఇలా అధికారం వచ్చింది..
విక్టోరియా రాణి తరవాత ఎన్నో దశాబ్దాల పాటు బ్రిటన్‌ను రాజులే పరిపాలించారు. కానీ...ఉన్నట్టుండి ఎలిజబెత్ రాణి తెరపైకి ఎందుకు వచ్చారు..? రాజుల పరిపాలన కాస్తా...రాణి చేతిలోకి ఎందుకు వచ్చింది..? ఇది తెలియాలంటే...మనం బ్రిటన్ కింగ్‌డమ్ గురించి చెప్పుకోవాలి.
యూకే కింగ్‌డమ్ చరిత్ర చెప్పుకోవాలంటే...ముందుగా విక్టోరియా మహారాణి నుంచి మొదలు పెట్టాలి. దాదాపు 63 ఏళ్ల పాటు క్వీన్‌గా కొనసాగిన ఆమె 1901లో మృతి చెందారు. తరవాత ఆమె కొడుకు Edward VII కింగ్ అయ్యారు. ఆయన 1910లో తుదిశ్వాస విడిచాక..ఆయన పెద్ద కొడుకు George V సింహాసనం అధిష్ఠించారు. 1936 వరకూ కింగ్ జార్జ్ -V పరిపాలించారు. ఈయన మరణం తరవాత Edward VIII అధికారంలోకి వచ్చారు. 1936లో అధికారంలోకి వచ్చిన Edward VIII కేవలం 326 రోజుల పాటు మాత్రమే కింగ్‌గా కొనసాగారు. నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవటం, కొందరు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం సహా...ఓ విడోని పెళ్లి చేసుకోవటం లాంటివి అప్పట్లో వివాదాస్ప దమయ్యాయి. అందుకే...ఆయనను కింగ్ పదవి నుంచి తొలగించారు. ఆ తరవాతే ఆయన తమ్ముడు కింగ్ జార్జ్ -VIకి పట్టం కట్టారు. ఈయనకు ఇద్దరూ కూతుళ్లే. వారిలో ఒకరే క్వీన్ ఎలిజబెత్ -2 (Elizabeth II). మరొకరు ప్రిన్స్ మార్గరెట్. 70 ఏళ్ల క్రితం అంటే 1952లో కింగ్ జార్జ్ VI నిద్రలోనే మృతి చెందాడు. తరవాత ఆయన పెద్ద కూతురు ఎలిజబెత్-2కి కిరీటం దక్కింది. అప్పటికి ఆమె వయసు 26 ఏళ్లు. ఆమెకు ప్రిన్స్ ఫిలిప్ (Prince Phillip)తో వివాహం కూడా అయింది. సో...ఇలా రాజుల చేతుల నుంచి రాణి చేతికి మారింది కిరీటం. విక్టోరియా మహారాణి 63 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే...ఆ రికార్డుని బ్రేక్ చేసి మరీ...క్వీన్ ఎలిజబెత్-2 సింహాసనంలో కూర్చున్నారు.
బ్రిటిష్ పార్లమెంటరీ లా..
ఈ క్రమంలోనే...మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి. ఎలిజబెత్ -2 క్వీన్‌గా బాధ్యతలు చేపట్టేనాటికే ఆమెకు పెళ్లైంది. ప్రిన్స్ ఫిలిప్ (Prince Philip)ను వివాహం చేసుకున్నారు. అయితే...ఎలిజబెత్‌ను క్వీన్‌గా గుర్తించిన యూకే...ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌ను మాత్రం కింగ్‌గా పరిగణించలేదు. ఎందుకిలా..? ఇది తెలియాలంటే బ్రిటిష్ పార్లమెంటరీ లా గురించి తెలుసుకోవాలి. రాయల్ ఫ్యామిలీలో పురుషులకు, స్త్రీలకు వేరు వేరు నియమ నిబంధనలు ఉంటాయి. వారికి దక్కే రాయల్టీ (King or Queen) విషయంలోనూ ఇంతే. ఉదాహరణకు..రాయల్ ఫ్యామిలీకి చెందిన పురుషుడు పెళ్లి చేసుకున్నాడనుకుంటే...ఆయన భార్యకు అదే స్థాయిలో గౌరవం దక్కుతుంది. ప్రిన్స్ విలియమ్ పెళ్లి చేసుకు న్నప్పుడు ఆమె భార్య కేట్ మిడిల్టన్‌ను అంతా డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ అని పిలిచేవారు. ఎప్పుడైతే ప్రిన్స్ విలియం కింగ్ అయ్యాడో...కేట్‌కూ అదే స్థాయి విలువ దక్కింది. ఎప్పుడైతే...జార్జ్ -VI కింగ్ అయ్యారో...ఆయన భార్యను అంతా క్వీన్ కన్సార్ట్ (Queen Consort) అని పిలిచేవారు. ఆమె మృతి చెందేంత వరకూ ఇదే పేరుతో అందరూ పిలిచారు. అదే...రాయల్ ఫ్యామిలీకి చెందిన ఓ మహిళ పెళ్లి చేసుకుంటే...ఈ నిబంధనలన్నీ వేరుగా ఉంటాయి. ఆమె భర్తకు ఆ స్థాయి హోదా ఉండదు. అంటే...కింగ్ హోదా దక్కదన్నమాట. అందుకే...క్వీన్ ఎలిజబెత్ -2 భర్త కేవలం ప్రిన్స్ ఫిలిప్‌గానే ఉండిపోయారు. ప్రస్తుతానికి క్వీన్ ఎలిజబెత్ -2 కొడుకు ప్రిన్స్ చార్ల్స్ కింగ్ కానున్నారు. ఈ ఫ్యామిలీలో అత్యంత యంగెస్ట్ అయిన ప్రిన్స్ హ్యారీ (Prince Harry) రాజకుటుంబం నుంచి బయటకు వచ్చేశారు. తన తల్లి ప్రిన్సెస్ డయానా తన కోసం వదిలి వెళ్లిన డబ్బుతోనే తాము ప్రస్తుతం జీవిస్తున్నామని ఎన్నోసందర్భాల్లో చెప్పారు హ్యారీ.
Also Read: Queen Kubaba: ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!