Queen Kubaba: ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!
First Queen: సుమేరియన్ నాగకరికతలోనే తొలిసారి ఓ మహిళ రాజ్యమేలినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
First Queen in History:
తొలి రాణి ఆమే..
బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 దాదాపు 70 ఏళ్ల పాటు బ్రిటన్‌ను పరిపాలించారు. రాచరిక పాలనలో ఆమె కొత్త చరిత్ర సృష్టించారు. ఇప్పుడామె శకం ముగిసిపోయింది. అక్కడ కొత్తగా రాజు పాలన మొదలవుతుంది. ఇదంతా వినడానికి కాస్త కొత్తగానే ఉంటుంది. ఈ కాలంలోనూ రాజులు, రాణులు పరిపాలించటమేంటి..? అనుకుంటాం. కానీ...మన చరిత్రలో ఇది ఓ అధ్యాయం. ఎన్నో నాగరికతలు దాటుకుని వస్తేనే...ఇప్పుడీ స్థాయిలో సివిలైజ్డ్ సొసైటీగా ఉంటున్నాం. పరిపాలన విషయంలో మోనార్కీల హిస్టరీ తక్కువేమీ కాదు. (Also Read: Who Are Monarchs: ప్రకాష్ రాజ్ డైలాగ్ నిజమేనా? మోనార్క్‌లను ఎవరూ మోసం చేయలేరా? అసలు ఎవరు వీళ్లు? ) వేల ఏళ్ల క్రితమే ఇది మొదలైంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. వీరిలో రాజులే కాదు. రాణులూ ఉన్నారు. మొత్తం రాజ్యాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు వారంతా. మరి...ఈ ప్రపంచంలోనే "తొలి రాణి" ఎవరు..? ఆమె ఏ రాజ్యాన్ని పరిపాలించారు..? రాణులూ రాజ్యాల్ని ఏలొచ్చని రుజువైంది ఎప్పుడు..? ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సుమేరియన్ పాలనలో..
3000 BCలో మెసొపొటేమియాలో సుమేరియన్లు పరిపాలన కొనసాగించారు. అప్పుడే సుమేరియన్ నాగరికత మొదలైంది. ఇదే మొదటి సివిలైజేషన్ అని కూడా హిస్టారియన్లు చెబుతుంటారు. దాదాపు కాంస్య యుగం మధ్య వరకూ ఇది కొనసాగింది. ఆ తరవాత క్రమంగా అంతరించిపోయింది. ఈ కాలంలో ఎంతో మంది రాజులు మెసొపొటేమియాను పరిపాలించారు. వీరిలో Alulim, Hadanish, Zizi పేర్లు బాగా వినబడతాయి. అయితే...పురుషులే రాజ్యాన్ని ఏలుతున్న సమయంలో ఉన్నట్టుండి ఓ మహిళ సింహాసనంపై కూర్చున్నారు. అందరినీ తన కనుసన్నల్తో శాసించారు. ఆమే...తొలి విమెన్ రూలర్ కుబాబా (Kubaba).ఆసక్తికర విషయం ఏంటంటే...కుబాబా ఓ "Tavern Keeper".అంటే..
బార్‌లలో కాక్‌టెయిల్, మాక్‌టెయిల్ కలిపి ఇస్తారు కదా. అప్పట్లో ఆమెది అదే వృత్తి. అదేంటి..? ఆమెకు అప్పట్లో ఓ బార్ కూడా ఉండేదట. సుమేరియన్ కల్చర్‌లో Beerకి చాలా ప్రాధాన్యత ఉంది. అక్కడి ప్రజలకు రోజువారీ రేషన్‌లోనూ బీర్ అందించేవారు. మరి..మందు కలిపి ఇచ్చే మహిళ...రాణిగా మారిందా...అని డౌట్ రావచ్చు. ఆ కథేంటో కూడా తెలుసుకుందాం.
అతీత శక్తులు..
సుమేరియన్ మైథాలజీలో... మహిళా "Tavern-keepers"కి చాలా ప్రియారిటీ ఉందని హిస్టారియన్లు చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే...ఈ టావెర్న్ కీపర్స్ వ్యభిచార వృత్తి కూడా చేసేవారట. అయినా...వాళ్లను ప్రజలంతా చాలా గౌరవంగా చూసేవారట. క్వీన్ కుబాబా (Queen Kubaba)కు ప్రత్యేకంగా ఓ "Tavern" ఉండేది. Tavern అంటే...అందరూ కలిసి కూర్చుని మద్యం సేవించే ప్లేస్. సింపుల్‌గా చెప్పాలంటే బార్ లాంటిది. సుమేరియన్ నాగరికతలో "Epic of Gilgamesh" పేరిట ఓ శిలాఫలకంపై రాసిన కవిత్వం ఉంది. అప్పటి చరిత్రనంతా ఇందులో ప్రస్తావించారు. ఇందులోనూ... మహిళా Tavern Keeprsను అందరూ ఆరాధించేవారని కోట్ చేసి ఉంది. ఇందులో Siduri అనే క్యారెక్టర్‌కు మానవాతీత శక్తులు ఉండేవని, సమస్య వచ్చిన ప్రతిసారీ ప్రజలకు ఆమె మార్గదర్శిగా నిలిచి కాపాడిందని Epic of Gilgameshలో రాసి ఉందని చరిత్రకారులు చాలా సందర్భాల్లో చెప్పారు. అదే వృత్తిలో ఉన్న కుబాబాకు అదే స్థాయిలో గౌరవం దక్కింది. అందుకే..ఆమె "రాణి" పదవిని దక్కించుకున్నారు. "కుబాబా ఎంతో పవిత్రమైన మహిళ. స్త్రీ సాధికారతకు ఆమె ప్రతీక. ఆమెకు ఎన్నో అతీత శక్తులున్నాయి. అందుకే ఆమెను అంతా ఆరాధించారు. వ్యాపారంలోనూ ఆమెను మించిన వాళ్లెవరూ లేరు" అని హిస్టారియన్ Carol R. Fontaine ఓ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. Kish సిటీని మేటిగా నిలబెట్టడంలో క్వీన్ కుబాబా కీలక పాత్ర పోషించారు. దాదాపు వంద సంవత్సరాల పాటు ఆమె పరిపాలన అద్భుతంగా కొనసాగింది. ఆ తరవాత వరుస దండయాత్రలతో Kish Kingdom కూలిపోయింది. కానీ...Kubaba చూపించిన దారి మాత్రం చరిత్రకు కొత్త మార్గం చూపించింది.
Also Read: History of Writing: రాయడం అనే ప్రక్రియ ఎప్పుడు ఎక్కడ మొదలైంది? ఆ బొమ్మలే అక్షరాలయ్యాయా?