అన్వేషించండి

New Parliament: కొత్త పార్లమెంట్‌ చూడాలనుకుంటున్నారా, అయితే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే

New Parliament: కొత్త పార్లమెంట్‌ భవనాన్ని చూడాలనుకుంటే సెక్రటేరియట్ నుంచి తప్పకుండా పాస్‌లు తీసుకోవాలి.

New Parliament Visit: 

సాధారణ ప్రజలకు విజిట్ 

ఎన్నో రోజులుగా ఎదురు చూసిన కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం ఘనంగా పూర్తైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ నిర్మాణంపై ప్రధాని ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రతి అణువులోనూ దేశ సంస్కృతి ఉట్టిపడేలా నిర్మించారు. మరి ఈ కొత్త పార్లమెంట్‌ని సాధారణ ప్రజలు చూసే అవకాశముందా..? అయితే..దానికి ప్రాసెస్ ఏంటి..? విజిటింగ్‌కి అవకాశం ఎప్పుడిస్తారు..? దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. ఎంట్రీ పాస్‌ గురించీ సమాచారమిచ్చారు. అయితే..ఇదేమంత సింపుల్ కాదు. వెంటనే లోపలకు వెళ్లిపోయి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఫొటోలు తీసుకోవడం కుదరదు. పార్లమెంట్‌ని విజిట్ చేయాలంటే పక్కాగా వాళ్లు చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి. నిజానికి ఇందుకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ రాకపోయినా..విశ్వసనీయ వర్గాల ద్వారా కొన్ని వివరాలు తెలిశాయి. 
 
స్పెషల్ పాస్ తప్పనిసరి..

సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగేటప్పుడు ఆ ప్రొసీడింగ్స్‌ చూడటానికి సాధారణ ప్రజలకు అవకాశముంటుంది. ఇందుకోసం హౌజ్‌లో ఓ స్పెషల్ ఆడియెన్స్ గ్యాలరీ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ప్రొసీడింగ్స్‌ని చూడొచ్చు. ఇప్పుడు కొత్త పార్లమెంట్‌లోనూ ఇదే ప్రాసెస్ ఫాలో అవనున్నారు. ఇలా చూడాలంటే మాత్రం స్పెషల్ పాస్ తీసుకోవాల్సిందే. గ్రూప్‌ పాస్‌లతో పాటు పర్సనల్‌ పాస్‌లు కూడా ఉంటాయి. స్కూల్ పిల్లల్నీ తీసుకెళ్లేందుకు అవకాశముంటుంది. పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ పాస్‌లు తయారు చేస్తుంది. ఎవరైనా ఎంపీని కలిసి కూడా ఈ పాస్‌ తీసుకోవచ్చు. ఎంపీ రికమండేషన్ లేకుండా పార్లమెంట్‌లోకి వెళ్లే అవకాశం ఉండదు. ఆయన రికమెండ్ చేస్తే పార్లమెంట్ సెక్రటేరియట్ పాస్‌ని జారీ చేస్తుంది. అయితే...ప్రొసీడింగ్స్ చూడాలంటే ఈ ప్రాసెస్ ఉంటుంది. కానీ...పార్లమెంట్ మ్యూజియం అయితే నేరుగా చూడొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా పాస్ అవసరం లేదు. పార్లమెంట్‌కి సంబంధించిన కీలకమైన వస్తువులు అక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్పటి వరకూ ప్రధానమంత్రులు వినియోగించిన వస్తువులూ అక్కడ చూడొచ్చు. 

సాంస్కృతిక వైవిధ్యానికి ప్రతీకగా పార్లమెంట్ ఇంటీరియర్‌ని డిజైన్ చేశారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తెప్పించారు. మీర్జాపూర్‌ నుంచి కార్పెట్‌లు తీసుకొచ్చారు. ఫ్లోరింగ్‌ కోసం త్రిపుర నుంచి కర్ర పట్టుకొచ్చారు. రాజస్థాన్ నుంచి రాళ్లు వచ్చాయి. ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి మెటీరియల్ తీసుకొచ్చి లోపల అందంగా తీర్చి దిద్దారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కి ఇది ప్రతీక అని కేంద్రం చెబుతోంది. ఎరుపు, తెలుపు శాండ్‌స్టోన్స్‌ని రాజస్థాన్‌లోని సర్మతుర నుంచి తెప్పించారు. అప్పట్లో ఢిల్లీలోని ఎర్రకోట నిర్మాణానికీ ఇక్కడి రాళ్లనే వాడారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నుంచి టేకుని తీసుకొచ్చారు. కేసరియా గ్రీన్ స్టోన్‌ని ఉదయ్‌పూర్‌ నుంచి తెప్పించారు. అజ్మేర్‌ నుంచి రెడ్ గ్రనైట్, రాజస్థాన్‌లోని అంబాజీ నుంచి మార్బుల్‌ను పట్టుకొచ్చారు. ఫర్నిచర్ అంతా ముంబయిలోనే తయారైంది. కేంద్ర పాలిత ప్రాంతమైన దమన్ అండ్ దియు నుంచి ఫాల్‌ సీలింగ్ స్టీల్ స్ట్రక్చర్‌ని తీసుకొచ్చారు. వీటినే రాజ్యసభ, లోక్‌సభ సీలింగ్‌ కోసం వినియోగించారు. అశోక చిహ్నాన్ని తయారు చేసేందుకు ఔరంగాబాద్, జైపూర్‌ నుంచి మెటీరియల్ తెప్పించారు. 

Also Read: New Parliament Opening: కొత్త పార్లమెంట్‌పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం

టాప్ హెడ్ లైన్స్

జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. ఏపీటీడీసీ ఎండీ బాధ్యతల నుంచి అమ్రపాలి కాటా రిలీవ్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Jasprit Bumrah News: బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
బుమ్రా లేకపోవడం శ్రీలంకకు బిగ్ అడ్వాంటేజ్.. కానీ టీమిండియాను తక్కువ అంచనా వేయద్దు.. మాజీ క్రికెట‌ర్ వార్నింగ్
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
Embed widget