జ్ఞానవాపి మసీదు కేసులో మరో కీలక మలుపు, హిందువుల పూజలకు లైన్ క్లియర్
Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదులో హిందూ పూజలు కొనసాగించవచ్చని అలహాబాద్ హైకోర్టు తేల్చి చెప్పింది.
Gyanvapi Masjid Case: జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు మరో కీలక తీర్పునిచ్చింది. మసీదు ప్రాంగణంలో హిందువుల పూజలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ని కొట్టివేసింది. ఫలితంగా...హిందూ పూజలకు లైన్ క్లియర్ అయింది. గత నెల ఇదే కోర్టు మసీదు సెల్లార్‌లో పూజలు చేసుకోవచ్చని కీలక తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ముస్లిం సంఘాలు కొన్ని దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. మసీదులో హిందువుల పూజలేంటని అసహనం వ్యక్తం చేశాయి. ఈ మేరకు మరోసారి కోర్టులో పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపేందుకు కోర్టు అంగీకరించలేదు.
Allahabad High Court dismisses plea challenging order permitting Hindu parties to offer puja in the 'vyas tehkhana' of Gyanvapi complex. pic.twitter.com/DbkADHQAIC
— ANI (@ANI) February 26, 2024
అంతకు ముందు మసీదులో Archaeological Survey of India సర్వే నిర్వహించింది. ఆ తరవాత ఓ నివేదిక వెలువరించింది. ఈ మసీదు ఒకప్పుడు హిందూ ఆలయం అని, దాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని తేల్చి చెప్పింది. మసీదులో హిందూ ఆలయ ఆనవాళ్లు కనిపించాయని స్పష్టం చేసింది.
"అంజుమన్ ఇంతెజామియా జ్ఞానవాపి మసీదులో హిందువుల పూజలు నిర్వహించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని కోర్టు కొట్టివేసింది. జనవరి 31వ తేదీన ఇచ్చిన తీర్పునే సమర్థించింది. ఆ తీర్పు మేరకు జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో వ్యాస్ తెఖానాలో హిందువుల పూజలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది. ఒకవేళ అంజుమన్ ఇంతెజామియా సుప్రీంకోర్టు వరకూ వెళ్తే అక్కడా పోరాటం చేస్తాం"
- అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్
Gyanvapi Mosque case | Advocate Vishnu Shankar Jain, representing the Hindu side says "Today, the Allahabad High Court has dismissed the first appeal from orders of Anjuman Intezamia wherein the order of 17th and 31st January passed by Varanasi District Court was under challenge… pic.twitter.com/pOf5BKWQ8f
— ANI (@ANI) February 26, 2024
బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ నేత సిద్ధిఖుల్లా చౌదురి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి వార్నింగ్ ఇచ్చారు. ఆయన బెంగాల్‌కి వస్తే చుట్టుముడతామని హెచ్చరించారు. వెంటనే హిందువులంతా జ్ఞానవాపి మసీదు నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్‌కత్తాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న సిద్దిఖుల్లా ఈ కామెంట్స్ చేశారు. మసీదులో వెంటనే పూజలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అయినా మసీదులో హిందువులు పూజలు చేసుకునేందుకు అనుమతినివ్వడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కి మతి ఉందా అంటూ మండి పడ్డారు. తాము ఆలయాలకు వెళ్లి ప్రార్థించనప్పుడు హిందువులు మాత్రం మసీదులోకి వచ్చి ఎలా పూజలు చేస్తారని ప్రశ్నించారు సిద్దిఖుల్లా. మసీదు మసీదే అని దాన్ని ఆలయంగా మార్చాలని చూస్తే ఊరికే కూర్చుని చూడమని వార్నింగ్ ఇచ్చారు. 800 ఏళ్లుగా ఉన్న మసీదుని కూల్చేస్తారా అని ప్రశ్నించారు.