News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Harsh Mahajan Joins BJP: కాంగ్రెస్‌కు భారీ షాక్- పార్టీకి గుడ్‌బై చెప్పిన మరో సీనియర్ నేత!

Harsh Mahajan Joins BJP: హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత హర్ష్ మహాజన్‌ భాజపాలో చేరారు.

FOLLOW US: 
Share:

Harsh Mahajan Joins BJP: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హర్ష్ మహాజన్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మహాజన్ ఎన్నికల వేళ పార్టీ మారడం చర్చనీయాంశమైంది. పార్టీ మారిన తర్వాత మహాజన్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

" కాంగ్రెస్ పార్టీకి సరైన దిశానిర్దేశం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీకి సరైన నాయకుడే లేడు. రాహుల్ గాంధీ కారణంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది.                                         "
-హర్ష్ మహాజన్, కాంగ్రెస్ మాజీ నేత

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. పార్టీలో చేరిన తర్వాత హర్ష్ మహాజన్.. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. హర్ష్ మహాజన్ గతంలో మంత్రిగా పనిచేశారు. మాజీ సీఎం వీరభద్రసింగ్‌కు ఆయన ప్రధాన అనుచరుడు. 

వరుసగా

భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ.. ఓ వైపు కాంగ్రెస్ కార్యకర్తల్లో పునరుత్తేజం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలంతా పార్టీకి దూరమవుతున్నారు. ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన గులాం నబీ ఆజాద్ సొంత పార్టీ పెట్టుకున్నారు.

గోవాలో 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. మరోపక్క రాజస్థాన్‌లోనూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్ మధ్య కుమ్ములాటలు పార్టీని మరింత బలహీన పరుస్తున్నాయని కార్యకర్తలు అంటున్నారు. 

త్వరలో

హిమాచల్ ప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భాజపా ఎన్నికలకు సిద్ధమవుతుండగా కాంగ్రెస్‌లో కీలక నేతలు పార్టీకి బైబై చెబుతున్నారు. 

జోడో యాత్ర

మొత్తం 3,570 కిలోమీటర్ల మేర జోడో యాత్ర చేస్తున్నారు రాహుల్ గాంధీ. 118 మంది శాశ్వత సభ్యులు ఇందులో పాల్గొంటారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. పార్టీకి ఇది టర్నింగ్ పాయింట్ అవుతుందని చెబుతున్నారు. ఇటీవలే వరుసగా పలువురు సీనియర్ నేతలు రాజీనామా చేయటం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో కాంగ్రెస్ ఈ పాదయాత్ర చేపట్టింది. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల ఎన్నికలతో పాటు 2024 ఎలక్షన్స్‌ని టార్గెట్‌గా పెట్టుకుంది.

కన్యాకుమారిలో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 150 రోజుల పాటు 3,570 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. జమ్ముకశ్మీర్‌లో ముగుస్తుంది. ప్రస్తుతం జోడో యాత్ర కేరళకు చేరుకుంది. ఈ యాత్రలో పాల్గొనే వారెవరూ..హోటళ్లలో బస చేయరు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంటెయినర్లలోనే బస చేస్తారు. దేశవ్యాప్తంగా ఇలాంటి కంటెయినర్లను 60 వరకూ అరేంజ్ చేశారు. వీటిలోనే నిద్రించేందుకు బెడ్స్ ఉంటాయి. టాయిలెట్స్, ఏసీలనూ ఏర్పాటు చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా, రాహుల్ గాంధీ ఓ కంటెయినర్‌లో ఉంటారు. మిగతా యాత్రికులంతా ఇతర కంటెయినర్లలో బస చేయనున్నారు.

Also Read: Bihar Politics: తేజస్వీ యాదవ్‌ను బిహార్ సీఎం చేసిన నితీశ్ కుమార్!

Also Read: Dailyhunt - AMG Media: ముగిసిన 'స్టోరీ ఫర్ గ్లోరీ' టాలెంట్ హంట్- విజేతలుగా నిలిచిన 12 మంది

Published at : 28 Sep 2022 05:00 PM (IST) Tags: Himachal Pradesh No leader no vision Senior Congress leader Harsh Mahajan joins BJP HP Elections 2022

ఇవి కూడా చూడండి

RRC SER: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

RRC SER: సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వేలో 1,785 యాక్ట్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today 30 November 2023: కొద్దిగా మెత్తబడ్డ పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Telangana Election Day Live News: కొద్దిసేపట్లోనే తెలంగాణలో పోలింగ్‌ మొదలు - అర్ధరాత్రి రఘునందన్ ఆందోళన

Telangana Election Day Live News: కొద్దిసేపట్లోనే తెలంగాణలో పోలింగ్‌ మొదలు - అర్ధరాత్రి రఘునందన్ ఆందోళన

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

SSC JE Exams: ఎస్‌ఎస్‌సీ జూనియర్ ఇంజినీర్ రాతపరీక్ష ఫైనల్ 'కీ' విడుదల

Telangana Assembly Elections: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం, బరిలో 2290 మంది అభ్యర్థులు

Telangana Assembly Elections: మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభం, బరిలో 2290 మంది అభ్యర్థులు

టాప్ స్టోరీస్

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023 : ఎన్నికల సమరానికి సర్వం సిద్ధం - 7 గంటల నుంచి పోలింగ్ !

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో ప్రముఖ నేతలు ఓటు వేసేది ఈ బూత్‌లలోనే

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి

Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి