Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల హామీలు వెల్లడించిన కాంగ్రెస్, ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ
Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది.
Gujarat Election 2022:
8 అంశాలతో మేనిఫెస్టో
గుజరాత్ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. 8 అంశాలతో కూడిన మేనిఫెస్టోని రాహుల్ గాంధీ ప్రకటించారు. ట్విటర్ వేదికగా ఈ జాబితాను వెల్లడించిన రాహుల్..భాజపాపై విరుచుకుపడ్డారు. "భాజపా డబుల్ ఇంజిన్ సర్కార్ వంచన నుంచి మనల్ని కాపాడుకుందాం. రాష్ట్రంలో సరికొత్త మార్పులను తీసుకొద్దాం" అని స్పష్టం చేశారు. రూ.500 కే ఎల్‌పీజీ సిలిండర్, యువతకు 10 లక్షల ఉద్యోగాలు, రూ.3 లక్షల వరకూ రైతులకు రుణమాఫీ లాంటి హామీలను ట్వీట్ చేశారు రాహుల్.
₹500 में LPG सिलेंडर,
— Rahul Gandhi (@RahulGandhi) November 6, 2022
युवाओं को 10 लाख नौकरियां,
किसानों का 3 लाख तक क़र्ज़ा माफ़ -
हम, गुजरात के लोगों से किए सारे #CongressNa8Vachan निभाएंगे।
भाजपा के ‘डबल इंजन’ के धोखे से बचाएंगे, प्रदेश में परिवर्तन का उत्सव मनाएंगे। pic.twitter.com/v1GtVP183L
ఇవీ ఆ హామీలు..
1. గృహ వినియోగ సిలిండర్‌ను రూ.500కే అందించటం, 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్
2. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పథకం అమలు
3. కేజీ నుంచి పీజీ వరకూ బాలికలందరికీ ఉచిత విద్య, రాష్ట్రంలో 3 వేల ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు
4. యువతకు 10 లక్షల ఉద్యోగాలు, రూ.3000 నిరుద్యోగ భృతి
5. కరోనాతో మృతి చెందిన వాళ్ల కుటుంబానికి రూ.4 లక్షల ఆర్థిక సహకారం
6. అత్యాధునిక వసతులతో కొత్త ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం.
7. రైతులకు రూ.3 లక్షల వరకూ రుణమాఫీతో పాటు, విద్యుత్ బిల్లుల మాఫీ
8. డ్రగ్ మాఫియాపై కఠిన చర్యలు
9. ఇందిరా రసోయ్ యోజన కింద పేద ప్రజలకు రూ.8కే భోజనం
2017 ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపించింది. బీజేపీ 49.05% ఓట్లు సాధించి 99 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 40 స్థానాలు రిజర్వ్‌డ్. వీటిలో 27 స్థానాలు STలకు, మరో ఎస్‌సీలకు కేటాయించారు.
చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...భాజపాలో చేరారు. ఫలితంగా...గుజరాత్‌లో కాంగ్రెస్ బలం 62కు తగ్గిపోయింది. అయినా...ఈ సారి బలంగా నిలబడాలని చూస్తోంది హస్తం పార్టీ. కానీ...భాజపా, ఆప్ మధ్యే ప్రధాన పోటీ నెలకొలనుంది. 1985లో కాంగ్రెస్ 185 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను మళ్లీ ఎవరూ తిరగరాయలేదు. ఈ ఎన్నికల్లో తాము ఈ రికార్డ్‌ను అధిగమి స్తామని భాజపా చాలా ధీమాగా చెబుతోంది. ఇటీవలే కాంగ్రెస్ హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది. లక్ష మందికి ఉద్యోగాలు, పాత పెన్షన్ స్కీమ్‌ని మళ్లీ అమలు చేయడం, హర్ ఘర్ లక్ష్మి పథకంలో భాగంగా ప్రతి ఇంట్లోని మహిళకు నెలనెలా రూ.1500 నగదు బదిలీ లాంటి కీలక అంశాలు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 4 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఏర్పాటు చేస్తామనీ హామీ ఇచ్చింది కాంగ్రెస్.
మొత్తం 10 అంశాలు ఇందులో చేర్చింది.
Also Read: Gujarat Elections 2022: ఆపరేషన్ గుజరాత్‌లో బిజీబిజీగా పార్టీలు, ఎవరి వ్యూహాలు వాళ్లవి