(Source: ECI/ABP News/ABP Majha)
2023కు వీడ్కోలు చెప్పి 2024ను గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ప్రపంచం- తెలుగు రాష్ట్రాల్లో సంబరాలు
యావత్ దేశమే కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబరాలు హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరుగా సెలబ్రేషన్స్ జరిగాయి.
Happy News Year: యావత్ దేశమే కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సంబరాలు హోరెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లో మరింత జోరుగా సెలబ్రేషన్స్ జరిగాయి.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏ గల్లీలో చూసిన న్యూయర్ ఈవెంట్స్ కలర్‌ఫుల్‌గా సాగాయి. హైదరాబాద్ బేగంపేటలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. అందర్నీ కాసేపు అక్కడ సెలబ్రేషన్స్‌లో పాల్గొని అందరికీ విష్ చేసి వెళ్లిపోయారు.
Vijayawada roads meedha new year celebrations💥💥#HappyNewYear2024 pic.twitter.com/kukBc8UxAU
— G3 (@gayatri008_16) December 31, 2023
ట్యాంక్‌బండ్, చార్మినార్ వద్ద జరిగిన వేడుకల్లో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తన సిబ్బంది, అక్కడకు వచ్చిన ప్రజలతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్ ప్రజలందరికీ కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని, తాగి వాహనాలు నడపొద్దని ప్రజలకు సూచించారు. అందరం కలిసి హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీగా మార్చేద్దామని పిలుపునిచ్చారు.
సెలబ్రేషన్స్‌లో విజయవాడ సీపీ
విజయవాడ సీపీ కాంతిరతన్ టాటా కూడా న్యూఇయర్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి అందరికీ విషెష్ చెప్పారు.
#WATCH | Andhra Pradesh: Vijayawada Police Commissioner Kanthi Rana Tata welcomes the new year by cutting a cake pic.twitter.com/CZGiupqhmz
— ANI (@ANI) December 31, 2023
హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలు ఏపీలోని గుంటూరు, వైజాగ్, విజయవాడలో అన్ని ప్రాంతాల్లో రాత్రి 12 గంటలు దాటిన తర్వాత భారీగా జనం రోడ్లపైకి వచ్చారు. కనిపించిన వారందరికీ విష్ చేస్తూ యువకులు సందడి చేశారు. దీంతో అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బాణసంచ కాలుస్తూ కొత్త సంవత్సరానికి భారీగా స్వాగతం పలికారు కొన్ని చోట్ల.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశంలో జరిగిన సెలబ్రేషన్స్‌తో మారుమోగిపోయింది. జమ్మకశ్మీర్‌లోని లాల్‌చౌక్ డీజే పాటలతో హోరెత్తింది. క్రాకర్స్ వెలుగుల జిలుగులో సరికొత్త ఆవిష్కృతమైందని నెటిజన్లు ట్వీట్‌లు చేస్తున్నారు.
#WATCH | J&K: People dance and sing as they celebrate New Year's Eve at Lal Chowk in Srinagar. pic.twitter.com/ndkv6sWpFY
— ANI (@ANI) December 31, 2023
షెల్టర్ హోమ్స్‌ను రాజస్థాన్ సీఎం పరిశీలించారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ జైపూర్‌లోని షెల్టర్ హోమ్‌లను పరిశీలించి నిరాశ్రయులకు దుస్తులు పంపిణీ చేశారు.
బీర్ భూమ్‌లో అదిరిపోయే బాణాసంచా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్‌లో భారీ బాణసంచా కాల్చారు.
చండీగడ్‌లో సింగర్ హర్భజన్ ప్రదర్శన
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎక్కడికక్కడ పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గాయకుడు హర్భజన్ సింగ్ చండీగఢ్ లో ప్రదర్శన ఇచ్చాడు. ఈ సందర్భంగా ప్రజలు నృత్యాలు చేస్తూ కనిపించారు.
నోయిడాలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
ఢిల్లీకి ఆనుకుని ఉన్న నోయిడాలో కూడా చాలా సందడి కనిపించింది. నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు మునిగితేలారు.
ఒడిశాలోని భువనేశ్వర్‌లో బాణాసంచా కాల్చి నూతన సంవత్సర వేడుకలు
గోవా తరహాలోనే ఒడిశాలోని భువనేశ్వర్‌లోనూ బాణసంచా కాల్చి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద జై శ్రీరామ్ నినాదాలు
కోట్లాది మంది విశ్వాసానికి కేంద్ర బిందువైన అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి మహత్తర ఆలయాన్ని ప్రతిష్ఠించనుండటంతో ఈసారి కొత్త సంవత్సరం ప్రత్యేకం. ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద గుమిగూడిన ప్రజలు జై శ్రీరామ్ నినాదంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
గోవాలో బాణసంచా వేడుకలు
2024 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గోవాలో బాణసంచా కాల్చారు.
శ్రీరాముడి నినాదాలతో అయోధ్య మారుమోగింది
శ్రీరాముడి నగరమైన అయోధ్యలో కూడా కొత్త సంవత్సర ఉత్సాహం కనిపించింది. ఇక్కడి లతా మంగేష్కర్ చౌరస్తాలో భక్తులు శ్రీరామ జపం చేస్తూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు.
బీజేపీ ఎంపీ రవికిషన్ సందడి
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్‌లో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్ తన ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించారు.
తిరుమలకు భారీగా చేరుకున్న భక్తులు
ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. జనవరి 1న స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భావించి ప్రజలకు రెండు రోజుల నుంచి భారీగా దర్శనాలు చేసుకుంటున్నారు. భక్తులను రద్దీని దృష్టిలో పెట్టుకొని టీటీడీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
#WATCH | Tirupati, Andhra Pradesh: Tirumala Tirupati Devasthanams (TTD) decorated Tirupati Balaji Temple on the occasion of New Year 2024 pic.twitter.com/TSA98i93fT
— ANI (@ANI) December 31, 2023
స్వర్ణదేవాలయానికి పోటెత్తిన భక్తులు
అమృత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
శబరిమలకు భారీగా వచ్చిన భక్తులు
కేరళలోని పతనంతిట్టలోని శబరిమల శ్రీ ధర్మ సంస్థ ఆలయాన్ని ఈ ఏడాది చివరి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఉండే వైష్ణవి దేవి ఆలయానికి కూడా భారీగా భక్తులు తరలి వస్తున్నారు. మొదటి సంవత్సరం తొలి రోజు పూజ చేసేందుకు బారులు తీరుతున్నారు.
#WATCH | Reasi, J&K: Devotees throng the Holy Cave Shrine of Shri Mata Vaishno Devi temple in Katra pic.twitter.com/Z0R1fYy3Zj
— ANI (@ANI) January 1, 2024
#WATCH | Haridwar, Uttar Pradesh: On the first morning of New Year 2024, people take a holy dip in River Ganga at Har Ki Pauri pic.twitter.com/GVMtXICJJ3
— ANI (@ANI) January 1, 2024