అన్వేషించండి

Gwalior News: నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు, కారణమదేనంటున్న వైద్యులు

Gwalior News: గ్వాలియర్‌లోని ఓ ఆసుపత్రిలో శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది.

Baby Girl With Four Legs:

మధ్యప్రదేశ్‌లో..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ శిశువు నాలుగు కాళ్లతో జన్మించింది. సోషల్ మీడియాలో ఈ శిశువు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కమలా రాజా విమెన్స్ అండ్ చైల్డ్ పీడియాట్రిక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఈ శిశువు జన్మించింది. క్షణాల్లోనే ఈ వార్త వైరల్ అయిపోయింది. సికందర్ కాంపు ప్రాంతానికి చెందిన ఆర్తి కుశ్వాహా అనే మహిళకు...ఆడ శిశువు జన్మించినట్టు వైద్యులు చెప్పారు. బిడ్డ ఆరోగ్యంగా ఉందని వెల్లడించారు. 2.3 కిలోల బరువుతో జన్మించినట్టు తెలిపారు. ప్రసవం జరిగిన వెంటనే ప్రత్యేక వైద్యుల బృందం శిశువుని పరీక్షించింది. "పుట్టుకతోనే శిశువుకు నాలుగు కాళ్లున్నాయి. శారీరక వైకల్యం వల్లే ఇలా జరిగింది. సాధారణంగా...పిండం రెండుగా విడిపోయినప్పుడు కవలలు  పుడతారు. కానీ...ఇక్కడ ఒకే  పిండానికి అదనపు శరీర భాగాలు పెరిగాయి. అప్పుడప్పుడూ ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే మెడికల్ సైన్స్‌లో ఇస్కియోపాగస్ అంటారు. నడుము కింది భాగంలో మరో రెండు కాళ్లు అదనంగా పుట్టుకొచ్చాయి. కానీ...అవి ప్రస్తుతానికి ఎట కదలడం లేదు" అని వైద్యులు స్పష్టం చేశారు. పిల్లల వైద్య నిపుణులు శిశువుని పూర్తి స్థాయిలో పరీక్షిస్తున్నారు. ఆరోగ్యంగానే ఉందా లేదా అని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఇది కాకుండా శరీరంలో ఇంకేదైనా వైకల్యం ఉందా అన్నదీ గమనిస్తున్నారు. కొన్ని టెస్ట్‌లు చేసిన తరవాత బిడ్డ ఆరోగ్యంగా ఉందని తేలితే...ఆ రెండు కాళ్లకు శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. ఆ తరవాత శిశువు సాధారణ జీవితాన్ని గడిపే అవకాశముంటుందని వైద్యులు స్పష్టం చేశారు. 

మెక్సికోలోనూ..

వైద్య చరిత్రలో మరో వింత నమోదైంది. ఈశాన్య మెక్సికోలోని ఒక గ్రామీణ ఆసుపత్రిలో 2 అంగుళాల పొడవు గల తోకతో ఒక ఆడ శిశువు జన్మించింది. తోకతో పుట్టిన శిశువును చూసి డాక్టర్లు, నర్సులు, తల్లిదండ్రులు ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే శిశువు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ముప్పై ఏళ్ల లోపే ఉన్న ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గర్భం దాల్చిన సమయం నుంచి అంతా సాధారణంగానే ఉందని ఎలాంటి సమస్యలు లేవన్నారు వైద్యులు. ప్రసవం జరిగాక తోకతో పుట్టిన శిశువును చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 5.7 సెంటి మీటర్ల పొడవు, వెంట్రుకలతో కప్పబడి, చివరన కొద్దిగా ఎడమ వైపునకు వంగి ఉన్న తోకను చూసి డాక్టర్లు ఎక్స్ రే తీశారు.2 నెలల తర్వాత చిన్న శస్త్ర చికిత్స చేసి వైద్యులు ఆ తోకను తొలగించారు. ఎలాంటి సమస్యలు లేకుండా శస్త్ర చికిత్స పూర్తవడంతో అదే రోజు శిశువును డిశ్చార్జ్ కూడా చేశారు. డైలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం 2017 వరకు ప్రపంచంలో 195 మంది నిజమైన తోకతో జన్మించారు. వీటిలో అతి పెద్ద తోక పొడవు 20 సెంటీ మీటర్లు. ఈ అసాధారణ ఘటనలు అబ్బాయిల్లో ఎక్కువ జరిగాయి. ఇలా జన్మించిన ప్రతి 17 మందిలో ఒకరు మెదడు,  పుర్రె ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటారు. 2021లో బ్రెజిల్‌కు చెందిన ఓ శిశువు 12 సెంటిమీటర్ల పొడవు, తోక చివర్లో బంతి వంటి నిర్మాణంతో జన్మించింది.

Also Read: Jaishankar on PAK: మీరు పెంచుకున్న పాములే మిమ్మల్ని కాటేస్తాయ్ - పాక్ ఉగ్రవాదంపై జైశంకర్ కౌంటర్

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?ఇళయరాజాకు ఘోర అవమానం!నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
Group 2 Exams: ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
ఓ వైపు లక్ష్యం, మరోవైపు మాతృత్వం - పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థి, కలెక్టర్ ఆదేశాలతో..
Beggars: ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
ఆ నగరంలో భిక్షాటన పూర్తిగా నిషేధం - యాచకులకు డబ్బులిస్తే కేసులు, జనవరి 1 నుంచి అమలు
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Gukesh:  గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
గుకేష్‌కు నిర్మలా సీతారామన్ చెక్ మేట్ - సోషల్ మీడియాలో హిలేరియస్ మీమ్స్
Royal Enfield Bikes: త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
త్వరలో మార్కెట్లోకి మూడు కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్స్ - అన్నీ 650 సీసీ పవర్ ఫుల్ ఇంజిన్లతోనే!
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Perni Nani: ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
ఆజ్ఞాతం నుంచి బయటకు పేర్ని నాని - మచిలీపట్నం ఇంట్లో పార్టీ నేతలతో భేటీ
Embed widget