అన్వేషించండి

Guwahati-Bikaner Express Derailed: పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. ముగ్గురు మృతి, 20 మందికి గాయాలు

గువాహటి- బికనేర్ ఎక్స్‌ప్రెస్ రైలు బంగాల్‌లో పట్టారు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

బంగాల్​ జలపాయ్‌గురి దొమోహనీ వద్ద గువాహటి-బికనేర్‌ ఎక్స్​ప్రెస్ 15633 (యూపీ)​ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. 20 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు రైల్వేశాఖ తెలిపింది.

సమాచారం అందిన వెంటనే యాక్సిడెంట్ రిలీఫ్ వ్యాన్, మెడికల్ వ్యాన్​ను ఘటనా స్థలానికి పంపినట్లు భారతీయ రైల్వే తెలిపింది. సాయంత్రం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. 12 బోగీలు పట్టాలు తప్పాయని పేర్కొంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రుల్లో చేర్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 30 అంబులెన్స్‌లను ఘటనా స్థలికి పంపించారు.

రైలు హఠాత్తుగా ప్రమాదానికి గురికావడం వల్ల అందులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. భయంతో రైలు దిగి దూరంగా పరుగులు తీశారు.

సహాయక బృందాలు..

రెస్క్యూ ట్రైన్‌ను వెంటనే సంఘటనా స్థలానికి పంపింది రైల్వేశాఖ. ఇందులో రైలు బోగీలను కట్ చేసి ప్రయాణికులను బయటకు తీసేందుకు అవసరమైన సామగ్రి ఉంది. ప్రయాణికుల సమాచారం కోసం రైల్వేశాఖ హెల్ప్ లైన్ నంబర్‌ 8134054999ను ప్రకటించింది.

పరిహారం ప్రకటన..

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటంబానికి రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష, స్వల్ప గాయాలైనవారికి రూ.25 వేలు పరిహారం ప్రకటించింది ర్వైల్వేశాఖ. ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

ప్రమాదం జరిగిన ప్రాంతానికి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెళ్లనున్నారు. ఇప్పటికే పరిహారం ప్రకటించామని ఆయన తెలిపారు.

ప్రధాని ఫోన్..

బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకున్నారు. సహాయకచర్యలను వేగంగా చేయాలని సూచించారు. ఘటనపై మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు. 

" బికనేర్- గువాహటి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగించింది. రాష్ట్రానికి చెందిన సీనియర్ అధికారులు, ఉత్తర బంగాల్‌కు చెెందిన డీఎమ్, ఎస్పీ, ఐజీ.. సహాయక చర్యలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. గాయపడినవారికి వీలైనంత త్వరగా వైద్య సాయం అందేందుకు కృషి చేస్తున్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.                                             "
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget