Gujarat Election Results 2022: గుజరాత్‌లో పూర్తిగా చతికిలపడిన కాంగ్రెస్, 1990 తరవాత ఇదే దారుణమైన ఓటమి
Gujarat Election Results 2022: గుజరాత్‌లో కాంగ్రెస్ పూర్తిగా వెనకబడిపోయింది.
Gujarat Election Results 2022:
వెనకబడిన కాంగ్రెస్..
చరిత్ర సంగతి పక్కన పెడితే...కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగానే ఉంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా...అక్కడ లోకల్ పార్టీల కంటే వెనకబడిపోతోంది. ఒకరిద్దరు అభ్యర్థులు గెలవడం కూడాగగనమైపోతోంది. అంతర్గత సమస్యల్ని పరిష్కరిస్తానని పార్టీ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేస్తున్నప్పటికీ...క్షేత్రస్థాయిలో ఇంకా ఆ పని మొదలు కానట్టే కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లో 2017లో బీజేపీతో కాస్తో కూస్తో పోటీ పడి చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలిచింది. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే...కాంగ్రెస్ ఈ సారి కేవలం 32 స్థానాలకు పరిమితమైనట్టు కనిపిస్తోంది. 1990 తరవాత కాంగ్రెస్ అత్యంత దారుణంగా చతికిలపడింది మళ్లీ ఇప్పుడే. 1990లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33 సీట్లు దక్కాయి. 2002లో గుజరాత్ అల్లర్ల తరవాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 51 సీట్లు సాధించుకుంది. బీజేపీ 127 సీట్ల ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు అధికారం దక్కలేదు. కానీ...మధ్యలో 2007లో జరిగిన ఎన్నికల్లో మాత్రం అంతకు ముందుకన్నా 8 సీట్లు ఎక్కువగా గెలుచుకుంది. బీజేపీ 117 స్థానాల్లో గెలవగా...కాంగ్రెస్ 59 సీట్లు గెలుచుకుంది. 2012లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత వచ్చింది. ఇదే బీజేపీకి బూస్టింగ్ ఇచ్చింది. కానీ...అలాంటి సమయంలో కూడా కాంగ్రెస్ 61 సీట్లు సాధించుకుంది. 2017లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది కాంగ్రెస్. 77 స్థానాల్లో విజయం సాధించింది. ఈ సారి మాత్రం పూర్తిగా చతికిలపడిపోయింది.
ఢిల్లీలోనూ..
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్‌కు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. కేవలం 9 వార్డులకే పరిమితమైంది ఆ పార్టీ. అంతే కాదు. ఓటు షేర్ కూడా దారుణంగా పడిపోయింది. 2017 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 30 వార్డుల్లో విజయం సాధించింది. 21% ఓటు షేర్‌ని రాబట్టుకుంది. ఈసారి ఈ ఓటు షేర్ 11.68%కి పడిపోయింది. ఆప్ అభ్యర్థులతో పోటీ పడలేక చాలా వార్డుల్లో వెనకబడిపోయింది. 2017 ఎన్నికల్లో విజయం సాధించి...కాంగ్రెస్‌కు కంచుకోటలు అనిపించుకున్న స్థానాలనూ చేజార్చుకుంది. ఓల్డ్ ఢిల్లీ లాంటి స్ట్రాంగ్ బేస్‌లోనూ ఓటమి పాలైంది. సీతారాం బజార్ వార్డ్‌లో 2007,2012,2017లో వరుసగా కాంగ్రెస్ అభ్యర్థి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. కానీ...ఈసారి ఈ వార్డులోని
ప్రజలు ఆప్‌వైపు మళ్లారు. ఢిల్లీ గేట్, జామా మసీద్, దర్యగంజ్ వార్డుల్లోనూ 2017లో విజయం సాధించిన కాంగ్రెస్...ఈ సారి ఈ మూడు వార్డులనూ కోల్పోవాల్సి వచ్చింది. ఈ ప్రాంతాల్లో ఆప్ విజయం సాధించింది. ఈశాన్య ఢిల్లీలోని ముస్తఫాబాద్, నైరుతి ఢిల్లీలోని ఆయా నగర్‌తో పాటు ఆగ్నేయ ఢిల్లీలోని జకీర్ నగర్‌లో మాత్రమే మరోసారి విజయం సాధించింది. బ్రిజ్‌పురిలోనూ మళ్లీ గెలిచింది. ఈ ప్రాంతాల్లో మాత్రం 60% ఓటు షేర్‌ని రాబట్టుకుంది. నిజానికి...కాంగ్రెస్ పార్టీకి చెందిన షీలా దీక్షిత్ ఢిల్లీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎప్పుడైతే ఆప్ ప్రభంజనం మొదలైందో... అప్పటి నుంచి ఆమెను పార్టీ నుంచి పక్కకు పెట్టడం మొదలు పెట్టింది అధిష్ఠానం. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కాంగ్రెస్‌కు నాయకత్వ లేమి కొనసాగుతూనే ఉంది.
Also Read: Himachal Election Results 2022: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ- కాంగ్రెస్, భాజపా ఢీ అంటే ఢీ!