Himachal Election Results 2022: హిమాచల్ ప్రదేశ్‌లో హోరాహోరీ- కాంగ్రెస్, భాజపా ఢీ అంటే ఢీ!
Himachal Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది.
Himachal Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా, కాంగ్రెస్ నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం.. కాంగ్రెస్ 33, భాజపా 32 స్థానాల్లో లీడ్‌లో ఉన్నాయి. కౌంటింగ్‌లో.. కాంగ్రెస్, భాజపా మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది.
#HimachalPradeshElections | Congress leading on 33 and BJP on 31 seats as counting continues in the state with the majority mark being 35 pic.twitter.com/QGiAySx6O8
— ANI (@ANI) December 8, 2022
నువ్వా నేనా అన్నట్లుగా అక్కడ రేస్ ఉన్నట్లు తెలుస్తోంది. హోరాహోరీగా సాగుతున్న కౌంటింగ్‌లో చివరి ఫలితం ఎవర్ని వరిస్తుందో ఇప్పుడే చెప్పలేం. హిమాచల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 35.
హిమాచల్‌లో మొత్తం 412 అభ్యర్థులు పోటీ చేశారు. దీంట్లో 24 మంది మహిళలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో మొత్తం 75.60 శాతం ఓట్లు పోలయ్యాయి. 2017లో ఆ రాష్ట్రంలో 75.57 శాతం ఓట్లు పడ్డాయి. ఒకరకంగా హిమాచల్ ఫలితాలు కాంగ్రెస్‌కు మళ్లీ ఉత్తేజాన్ని ఇవ్వనున్నాయి. ఆ పార్టీ ప్రస్తుతం రాజస్థాన్, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉంది.
ఆమ్ ఆద్మీ పార్టీ .. హిమాచల్ ప్రదేశ్‌లో ఖాతా ఓపెన్ చేయడం కష్టంగానే ఉంది. ఆ పార్టీ 62 స్థానాల నుంచి పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా ఆ పార్టీ లీడింగ్‌లో లేదు.ం