Gujarat Election 2022: దూకుడు పెంచిన గుజరాత్ కాంగ్రెస్, తీర్మానాల జాబితా విడుదల చేసిన ఖర్గే
Gujarat Election 2022: గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ సన్నద్ధమవుతోంది.
Gujarat Assembly Election 2022:
ఖర్గేకు సవాల్..
గుజరాత్ ఎన్నికల తేదీలు వెలువడ్డాయి. మొత్తం రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. డిసెంబర్ 1న తొలి విడత, డిసెంబర్ 5న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు విడుదల చేస్తారు. ఈ తేదీలు ప్రకటించటంలో ఆలస్యం అయినప్పటికీ...పార్టీల ప్రచారం మాత్రం ముందే మొదలైంది. భాజపా, ఆప్, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గెలిచేది మేమేనని భాజపా, ఆప్ ధీమాగా ఉన్నా...గట్టి పోటీ ఇస్తామని కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ఇటీవలే ఆ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున్ ఖర్గే...పూర్తి స్థాయిలో గుజరాత్ ఎన్నికలపై దృష్టి సారించారు. నిజం చెప్పాలంటే...ఆయన అధ్యక్షుడిగాఎన్నికయ్యాక ఎదురవుతున్న మొదటి సవాలు ఇది. అందుకే...కాస్త ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేశారు. అంతే కాదు. ట్విటర్ వేదికగా గుజరాత్ కాంగ్రెస్ తీర్మానాలనూ వెల్లడించారు. మొత్తం 8 తీర్మానాలు చేసినట్టు వెల్లడించారు. 7 కోట్ల మంది గుజరాతీలకు మేలు చేసేది కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ 8 తీర్మానాల జాబితానూ ట్విటర్‌లో పంచుకున్నారు ఖర్గే. అందులో ఎన్నో కీలక అంశాలున్నాయి. ఎన్నికలను ప్రభావితం చేసే సమస్యలపైనే కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి పెట్టినట్టు...ఈ జాబితాను చూస్తే అర్థమవుతోంది.
తీర్మానాలివే..
1. రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్
2. 300 యూనిట్ల వరకూ అందరికీ ఉచిత విద్యుత్
3. రూ.10 లక్షల వరకూ ఉచిత వైద్యం, మందులు
4. రూ.3 లక్షల వరకూ రైతుల రుణమాఫీ
5. ప్రభుత్వ ఉద్యోగాల్లో కాంట్రాక్ట్ సిస్టమ్‌ని తొలగించడం, రూ.300 నిరుద్యోగ భృతి అందించడం
6. 3 వేల ప్రభుత్వ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలు నెలకొల్పడం
7. కోఆపరేటివ్ సొసైటీలో లీటర్ పాలకు రూ.5 సబ్సిడీ
8. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన 3 లక్షల మంది కుటుంబాలకు రూ.4 లక్షల ఆర్థిక సాయం.
7 करोड़ गुजराती बहन-भाई परिवर्तन के लिए केवल कांग्रेस को विकल्प मानते हैं।@INCGujarat के 8 संकल्प -
— Mallikarjun Kharge (@kharge) November 3, 2022
1⃣ ₹500 में LPG सिलेंडर
2⃣ 300 यूनिट तक बिजली फ्री
3⃣ ₹10 लाख तक का इलाज व दवाइयां मुफ्त
4⃣ किसानों का ₹3 लाख तक कर्ज माफ
1/2
5⃣ सरकारी नौकरियों में कॉन्ट्रैक्ट सिस्टम बंद और ₹300 बेरोजगारी भत्ता
— Mallikarjun Kharge (@kharge) November 3, 2022
6⃣ 3 हजार सरकारी इंग्लिश मीडियम स्कूल
7⃣ को-ऑपरेटिव सोसायटी में दूध पर ₹5/लीटर सब्सिडी
8⃣ कोरोना से जान गंवाने वाले 3 लाख लोगों के परिवार को ₹4 लाख मुआवजा
પરિવર્તન આવશે, ગુજરાતના નાગરિકોના જીવન ખુશહાલ બનશે
కాంగ్రెస్ గత వైభవం..
2017 ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపించింది. బీజేపీ 49.05% ఓట్లు సాధించి 99 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ 77 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 182 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో 40 స్థానాలు రిజర్వ్‌డ్. వీటిలో 27 స్థానాలు STలకు, మరో ఎస్‌సీలకు కేటాయించారు.
చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...భాజపాలో చేరారు. ఫలితంగా...గుజరాత్‌లో కాంగ్రెస్ బలం 62కు తగ్గిపోయింది. అయినా...ఈ సారి బలంగా నిలబడాలని చూస్తోంది హస్తం పార్టీ. కానీ...భాజపా, ఆప్ మధ్యే ప్రధాన పోటీ నెలకొలనుంది. 1985లో కాంగ్రెస్ 185 సీట్లు సాధించి రికార్డు సృష్టించింది. అప్పటి నుంచి ఈ రికార్డ్‌ను మళ్లీ ఎవరూ తిరగరాయలేదు. ఈ ఎన్నికల్లో తాము ఈ రికార్డ్‌ను అధిగమి స్తామని భాజపా చాలా ధీమాగా చెబుతోంది.
Also Read: Gujarat Election 2022 Date: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- రెండు విడతల్లో పోలింగ్!