వధువును అలా చూసి బోరున ఏడ్చిన వరుడు.. వీడియో వైరల్
వధువును అలా చూసిన వరుడు బోరున ఏడ్చేశాడు. ఇంతకీ అతడి కన్నీటి కారణం ఏమిటీ?
పెళ్లంటే.. ఎంత పెద్ద పండగో మనకు తెలిసిందే. అందుకే, ఈ పెళ్లిని జీవితంలో మరపురాని విధంగా చేసుకోవాలని చాలామంది భావిస్తారు. ఇందుకు భారీగానే ఖర్చుపెడతారు. సంపన్నుల ఇళ్లల్లో పెళ్లిలైతే.. సంజయ్ లీలా బన్సాలీ సెట్టింగుల్లో భారీతనం ఉట్టిపడేలా ఉంటాయి. సామాన్యుడికైనా.. సంపన్నుడికైనా సరే పెళ్లంటే పండగే. రెండు జీవితాలను ఒక్కటి చేసే వేడుకలో సరదాలు, సంతోషాలే కాదు.. భావోద్వేగాలు కూడా కనిపిస్తాయి.
ఈ పెళ్లిలో కూడా అంతే.. వధువును చూసి ఆ వరుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, బాధతో కాదండోయ్. చెప్పలేనంత సంతోషం.. అతడి కంటి నుంచి ఆనందభాష్పాలుగా బయటకు వచ్చింది. ఇంతకీ అతడు కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నాడనేగా సందేహం? పెళ్లి దుస్తుల్లో దేవకన్యలా మెరిసిపోతున్న వధువును చూసి.. ఆ వరుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడనేది అతడు తన కళ్లతోనే చెప్పేశాడు. అతడిని చూసి వధువు కూడా ఏడ్చేసింది. అతడి కన్నీటిని తుడిచేందుకు ప్రయత్నించింది. మొత్తానికి ఇదంతా కెమేరాలకు చిక్కింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వీడియో:
ఇటీవల మరో పెళ్లిలో కూడా ఇలాంటి సీనే కనిపించింది. వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు ముందుగా మోకాలిపై కూర్చున్నాడు. దీంతో వధువు అతడి మెడలో మాల వేసింది. ఆ తర్వాత ఆమె మోకాలిపై కూర్చోగా వరుడు దండవేశాడు. ఆ తర్వాత అతడు భావోద్వేగానికి గురయ్యాడు. అతడి కళ్ల నుంచి వస్తున్న ఆనంద భాష్పాలను చూసి.. వధువు సైతం ఎమోషనల్ అయ్యింది. వారిద్దరినీ చూసి కుటుంబ సభ్యులు కళ్లు కూడా చెమ్మగిల్లాయి. మొత్తానికి ఆ పెళ్లి.. అందరి గుండెలను బరువెక్కించింది. అంతేకాదు.. ఈ వీడియో చూస్తే మీ కళ్లు కూడా చెమ్మగిల్లుతాయి.
కొద్ది రోజుల కిందట ఓ వధువు తొలిరాత్రి వీడియో కూడా వైరల్‌గా మారింది. తొలిరాత్రి సందర్భంగా మంచాన్ని అందంగా ముస్తాబు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, మరి ఆ వధువు అమాయకత్వమో.. చిలిపితనమో గానీ.. ఆ మంచాన్ని చూసి ఓ డైలాగ్ వేసింది. పూలన్నీ మంచం మీద వేస్తే.. ఎక్కడ పడుకోవాలని అనడంతో నవ్వులు విరిశాయి. ఈ వీడియో నెటిజనులకు బాగా నచ్చేసింది. దీంతో చాలామంది షేర్లు కూడా చేసుకున్నారు. ఈ వీడియో చూసి చాలామంది జోకులు కూడా పేలుస్తున్నారు.
Also Read: జిమ్‌లో మెగాస్టార్‌తో ప్రకాష్ రాజ్ ‘చిరు’ మంతనాలు.. ‘మా’లో కాకరేపుతున్న ట్వీట్
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?
Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!