Aadhar : మీ "ఆధార్" డీటైల్స్ ప్రభుత్వానికి ఇస్తారా? లేదా ? త్వరలో మీకో ఫామ్ రాబోతోంది..! ఇవ్వకపోతే ఏం జరుగుతుందో తెలుసా ?
ప్రభుత్వ పథకాల లబ్దిదారుల వివరాల కోసం ఆధార్ కన్సెంట్ ఫామ్ తీసుకునే యోచనలో ప్రభుత్వాలు ఉన్నాయి. ఇందు కోసం త్వరలోనే మెయిల్, మెసెజ్ రూపంలో ఓ ఫామ్ పంపి అనుమతి ఇవ్వాలని ప్రజల్ని కోరనున్నాయి.
ఆధార్ కార్డు ఇప్పుడు ప్రతి ఒక్క చోటా అవసరం అవుతోంది. అది ఉంటేనే చివరికి రైల్లో కూడా ప్రయాణించగలిగిన పరిస్థితి. ఇక ప్రభుత్వ పథకాల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఏ చిన్న ప్రభుత్వ పథకంలో లబ్ది పొందాలన్నా ముందుగా ఆధార్ వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ ఆధార్ నెంబర్‌తో లబ్దిదారుల వివరాలన్నింటినీ చూస్తుంది. అర్హుడా కాదా అన్నది డిసైడ్ చేసుకుంటుంది. అయితే ప్రభుత్వం ఇలా అనుమతి లేకుండా ఆధార్ డీటైల్స్ చూడొచ్చా అన్న విమర్శలు ఉన్నాయి. అందుకే ఇప్పుడా ఇబ్బందిని అధిగమించాడానికి ప్రభుత్వాలు ఓ ముందస్తుగా అనుమతి తీసుకోవాలని నిర్ణయించాయి.
ఆధార్ కార్డు ఉన్న వారందరికీ త్వరలో ఓ మెయిల్ లేదా మెసెజ్ వస్తుంది. అందులో ప్రభుత్వ పథకాల కోసం మీ ఆధార్ కార్డును ప్రాస్పెక్టివ్ షేరింగ్ కోసం ఉపయోగించడం.. భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాల కోసం మీ ఆధార్ వివరాలను ఓ డేటాబేస్‌గా ఉంచడం కోసం పర్మిషన్ అడుగుతూ ఈ మెయిల్... మెసెజ్ వస్తుంది. దానికి అంగీకరిస్తే ఆటోమేటిక్‌గా ప్రభుత్వం మీ ఆధార్‌ను పరిశీలించానికి .. మీ వివరాలను ప్రభుత్వం ప్రత్యేకంగా డేటాబేస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిటన్లవుతుంది. లేకపోతే ప్రభుత్వం కూడా ఈ ఆధార్ వివరాలు యాక్సెస్ చేయడం సాధ్యం కాదు.
Also Read: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
ఆధార్ వివరాలు అత్యంత సున్నితం. ప్రజలు ఎక్కువ మంది ఆ విషయాన్ని గుర్తించలేరు. ఆధార్‌ను యాక్సెస్ చేయడం అందరికీ సాధ్యం కాదు. ఓ ప్రత్యేకమైన పద్దతిలో మాత్రం కొంత మందికి అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వానికైనా అంతే. మీ ఆధార్ యాక్సెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా అనుమతి ఉండాలి. అందుకే ప్రభుత్వ పథకాల పేరుతో.. లబ్దిదారులందరి డేటా బేస్‌ను ప్రభుత్వం.. కన్సెంట‌్ ఫామ్‌ను తీసుకుని భద్రపరిచే ప్రయత్నం చేయబోతోంది.
Also Read: OnePlus RT: వన్‌ప్లస్ ఆర్‌టీ ధర లీక్.. 9 సిరీస్ కంటే తక్కువే.. ఎంతంటే?
అయితే సాధారణంగా ఇలాంటి మెసెజులు వస్తే జనం ఫేక్ అని డిసైడవుతున్నారు. ఎందుకంటే ఫ్రాడ్స్ అన్నీ ఇలాంటి మెసెజ్‌లు.. మెయిల్స్ రూపంలోనే జరుగుతున్నాయి. మరి దీన్ని ప్రజలు ఎంత మంది నిజమే అని నమ్ముతారో.. ప్రభుత్వానికి కన్సెంట్ ఫామ్ ఇస్తారో చూడాలి.
Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!