Masked Aadhar : మీరు "మాస్క్ ఆధార్" పొందారా ? దీని గురించి వినలేదా? వెంటనే తెలుసుకోండి.. డౌన్ లోడ్ చేసుకోండి...
ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా కొత్తగా ప్రభుత్వం మాస్క్‌డ్ ఆధార్‌లను ప్రవేశపెట్టింది. ఉడాయ్ వెబ్ సైట్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మనం మాస్క్‌లు పెట్టుకోవడం కరోనా వైరస్ బయటపడినప్పటి నుండి ఉంది. కానీ మనం ఆధార్ కార్డుకు కూడా మాస్క్ వేయాలనే సంగతి ఎంత మందికి తెలుసు ? . ఎక్కువ మందికి తెలియదు. మన ఆరోగ్యానికి మాస్క్ ఎంత ముఖ్యమో..గోప్యత కోసం ఆధార్‌కు మాస్క్ వేయడం కూడా అంతే ముఖ్యం. మన ఫోన్ సిమ్ కోసమో.. మరో దాని కోసమో.. ఆధార్ జిరాక్స్‌లు ఇస్తూ ఉంటారు. అలా తీసుకున్న వారు దుర్వినియోగం చేయరని డౌట్ ఏముంది ? ఇలా తప్పుడు ఆధార్‌లు సేకరించి తప్పుడు పనులు చేస్తున్న కేసులు పెరిగిపోవడంతో ఉడాయ్ కొత్తగా మాస్క్‌డ్ ఆధార్‌లు ఇస్తోంది.
Also Read: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
మాస్క్‌డ్ ఆధార్ అంటే..మన పూర్తి సమాచారాన్ని బహిర్గతం చేయకుండా నిరోధించే అదనపు సెక్యూరిటీ అనుకోవచ్చు. మాస్క్ ఆధార్ కార్డు అంటే మొత్తం పన్నెండు నెంబర్లు కనిపించకుండా కొన్నింటిని రహస్యంగా ఉంచేలా చూసుకోవచ్చు. మామూలుగా మనం ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసినప్పుడు మొత్తం వివరాలు వస్తాయి. అలా కాకుండా ఆధార్ సంఖ్య ప్రారంభ 8-అంకెలు కనిపించకుండా చేయవచ్చు.
మనం రైలెక్కాలన్నా.. విమానం ఎక్కాలన్నా.. చివరికి హోటల్‌లో రూమ్ బుక్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు కావాలి. ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త పద్దతిలో పూర్తి ఆధార్ ఇవ్వాల్సిన అవసరం లేదు. మాస్క్‌డ్ఆధార్ ఇస్తే చాలు. దీంతో వ్యక్తిగత సమచార గోప్యత లబిస్తుంది. మాస్క్ ఈ ఆధార్ ఒక సాధారణ కార్డు కంటే వైవిధ్యమైన ప్రయోజనాలతో వస్తుంది. సాధారణ కార్డ్ మాదిరిగా కాకుండా, మాస్క్ కార్డు మీ సమాచారాన్ని పూర్తిగా వెల్లడించదు. అందుకే ఇప్పుడు ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తున్నారు.
Also Read: Housing sales: హైదరాబాద్ తగ్గేదే లే! మూడు రెట్లు పెరిగిన ఇళ్ల విక్రయాలు
మాస్క్‌డ్ ఆధార్ కార్డును మనం ఉడాయ్ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. UIDAI అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి.. గెట్ ఆధార్ విభాగం కింద డౌన్‌లోడ్ ఆధార్ ను క్లిక్ చేయాలి. ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. పిన్‌కోడ్‌ను నమోదు చేయాలి. తర్వాత ఆప్షన్ అడుగుతుంది. మాస్క్‌డ్ ఆధారా కావాలా .. సాధారణందా అని.. మాస్క్ డ్ ఆధార్ దగ్గర టిక్ చేస్తే సబ్ మిట్ చేస్తే రిజిస్టర్డ్ మోబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మాస్క్ ఆధార్ ౌన్ లోడ్ అవుతుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.