New Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, కసరత్తు మొదలు పెట్టిన కేంద్రం
Criminal Laws: జులై 1వ తేదీ నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రం ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది.
![New Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, కసరత్తు మొదలు పెట్టిన కేంద్రం government is preparing for new criminal laws set to come into effect from july 1st New Criminal Laws: జులై 1 నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు, కసరత్తు మొదలు పెట్టిన కేంద్రం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/30/739bed4bae303caef405043e263d5f321719734177272517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
New Criminal Laws: IPCలో పూర్తి స్థాయిలో సంస్కరణలు చేసి కొత్త నేర చట్టాలని తీసుకొచ్చింది మోదీ ప్రభుత్వం. బ్రిటీష్ కాలం నాటి నిబంధనల్ని పక్కన పెట్టి కొత్త రూల్స్ చేర్చింది. IPC స్థానంలో భారతీయ న్యాయ సన్హిత, భారతీయ నాగరిక్ సురక్షా సన్హిత, భారతీయ సాక్ష్య యాక్ట్‌లను రూపొందించింది. జులై 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అందుకు సంబంధించిన కసరత్తు మొదలైంది. ఈ చట్టాల్ని ఎలా అమలు చేస్తారో అవగాహన కల్పిస్తోంది ప్రభుత్వం. పలు మంత్రిత్వ శాఖలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతోనూ సమావేశం కానుంది. 2024-25 అకాడమిక్ ఇయర్‌లో అన్ని యూనివర్సిటీల్లో ఈ కొత్త చట్టాలకు సంబంధించిన సిలబస్‌ని అప్‌డేట్ చేయాలని ఇప్పటికే ఆదేశాలు అందాయి. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇప్పటికే ముసోరిలోని Lal Bahadur Shastri National Academy Of Administration 5 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించింది. IAS,IPSలతో పాటు జ్యుడీషియల్ ఆఫీసర్స్‌కి శిక్షణ అందించింది. జూన్ 21వ తేదీన మహిళా శిశు సంక్షేమ శాఖతో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్ శాఖలు ప్రత్యేకంగా వెబినార్ నిర్వహించాయి. ఆ తరవాత జూన్ 25న మరోసారి ఇంగ్లీష్‌లో వెబినార్ నిర్వహించింది. ఈ చట్టాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకూ అధికార యంత్రాంగం ప్రచారం మొదలు పెట్టింది. ప్రత్యేకంగా కొన్ని పోస్టర్‌లు తయారు చేయనుంది. ప్రెస్ రిలీజ్‌లతో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోనూ క్యాంపెయిన్ నిర్వహించనుంది.
National Crime Records Bureau కూడా కొత్త చట్టాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసింది. క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్‌ని కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా మార్చేసింది. FIRలు రిజిస్టర్ చేయడం నుంచి అన్ని అంశాల్లోనూ అప్‌గ్రేడ్ అయింది. అన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టెక్నాలజీ సాయం అందించనుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)