Cyber Fraud : 6 లక్షల ఫోన్ నెంబర్స్ , 800 యాప్స్ బ్లాక్ - సైబర్ నేరగాళ్లకు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం
Apps Block : దేశంలో సైబర్ నేరాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది. అరు లక్షల ఫోన్ నెంబర్స్, ఎనిమిది వందల యాప్స్ ను బ్లాక్ చేసేసింది.
Cyber Fraud 600 000 Phones Deactivated And 800 Apps Blocked : దేశంలో సైబర్ ఫ్రాడ్స్ లెక్కలేనన్ని జరుగుతున్నాయి. ప్రజలు వేల కోట్లు నష్టపోతున్నారు. మనలో ప్రతి ఒక్కరికి రోజూ ఒక్క ఫ్రాడ్ కాల్ అయినా వస్తుంది. వచ్చిన ఫోన్ నెంబర్ నుంచి రాకుండా.. కొత్త కొత్త నెంబర్ల నంచి కాల్ చేస్తూంటారు. ఫెడెక్స్ కొరియల్ అంటారు.. డిజిటల్ అరెస్ట్ అంటారు.. ఏదేదో చెప్పి భయపెట్టి డబ్బులు వసూలు చేస్తూంటారు. ఇక మామూలు మోసగాళ్లకు లెక్కే ఉండదు. ఇలాంటి వారి బారి నుంచి ప్రజల్ని కాపాడటానికి కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎనిమిది వందల ఫ్రాడ్ యాప్స్ తో పాటు.. అరు లక్షల ఫోన్ నెంబర్స్ ను బ్లాక్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇవన్నీ ఫ్రాడ్ చేస్తున్నాయని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నిర్దారించింది. అలాగే.. అరవై ఐదు వేల వెబ్ సైట్లను కూడా నిషేధించారు సైబర్ నేరాళ్లు తాము ఎవరో గుర్తు పట్టుకుండా మోసాలు చేస్తున్నారు.ఇందు కోసం యాప్స్, అడ్రస్ లేని వెబ్ సైట్స్ ను పెట్టుకుని స్కాములకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ప్రజలు వీటి బారిన ఎక్కువగా పడుతున్నారు. ట్రేడ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్ స్కామ్ చివరికి డేటింగ్ పేరుతో కూడా ఫోన్లు చేసి స్కామ్ చేస్తున్నారు. ఇలాంటివేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా ఇలాంటి సైబర్ మోసగాళ్ల బారిన పడిన కేసులు పదిహేడు వేలకుపైగా నమోదయ్యాయి. ఇంకా అనేక మంది పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లకుండా పరువు పోతుందని సైలెంట్ గా ఉన్నారు.
చిన్న పొరపాటుకు భారీ మూల్యం, రూ.382 కోట్ల ఐటీ నోటీస్ - మీకూ రావచ్చు!
సైబర్ నేరగాళ్లను అణచి వేయడానికి కేంద్ర ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ 2018లోనే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. సైబర్ అండ్ ఇన్ఫర్మేషన్ డివిజన్ ను ఏర్పాటు చేసి ..సైబర్ క్రైమ్ ను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంది. క్రిటికల్ కేసుల్లో కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేసి నందితుల్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో సాంకేతికంగా అత్యాధునిక శిక్షణ పొందిన వారు ఉంటారు. సైబర్ క్రైమ్స్ ను సహించేది లేదని కేంద్రం ఈ చర్యల ద్వారా స్పష్టం చేస్తున్నట్లు అయింది.
హీరో రాజ్ తరుణ్ టూ హర్షసాయి, హైప్రొఫైల్ కేసులకు అడ్డాగా నార్సింగి పోలీస్ స్టేషన్
నిజానికి ఈ కొత్త ఫోన్ నెంబర్లు, వెబ్ సైట్ల కన్నా.. ముఖ్యంగా డేటా చోరీ అనేది అత్యంత కీలకమైన సమస్యగా మారింది. మన ఫోన్ నెంబర్లు ఆ స్కామర్లు ఎలా తెలుస్తున్నాయి.. మన ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డుల వివరాలు, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న నగదు వివరాలు కూడా తెలుసుకుని ఫోన్లు చేస్తున్నారు. మన పార్శిల్ ఏదైనా రావాల్సి ఉంటే.. వెంటనే తెలుసుకుని ఆ పార్శల్ లో డ్రగ్స్ ఉన్నాయని ఆరోపణలు చేస్తూ..భయపెడుతున్నారు. ఈ డేటా చోరీని కూడా కేంద్రం నియంత్రిస్తే.. చాలా వరకూ సైబర్ క్రైమ్స్ ఆగిపోయే అవకాశం ఉంది.