అన్వేషించండి

Hyderabad News: హీరో రాజ్ తరుణ్ టూ హర్షసాయి, హైప్రొఫైల్ కేసులకు అడ్డాగా నార్సింగి పోలీస్ స్టేషన్

Narsingi Police Station: నార్సింగ్ పోలీస్టేషన్ అంటే ఇప్పుడు హైప్రొఫైల్ కేసులకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. హీరో రాజ్ తరుణ్ కేసు మొదలు హర్షసాయి వరకూ అన్ని సంచలన కేసులే.

Narsingi Police Station: నార్సింగి పోలీస్టేషన్... హైదరాబాద్‌లోనే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పోలీస్ స్టేషన్. ఆ పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులన్నీ కూడా సెలబ్రిటీలవే కావడంతో ఈ పోలీస్ స్టేషన్ చాలా ఫేమస్ అయిపోతోంది. ఓ వెలుగు వెలిగి, భారీగా అభిమానులను సంపాదించుకున్న సెలబ్రెటీలపై ఈ నార్సింగి పోలీస్టేషన్‌లోనే కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్కరి పేరు ఒక్కో ఆరోపణతో ఎఫ్‌ఐఆర్ ఎక్కుతోంది. ఇలా కేసుల పరంపర చూస్తుంటే నార్సింగి పోలీస్టేషన్ సెలబ్రెటీ బాధితులకు అడ్డగా మారనుందా అనిపిస్తోంది. ఇంతకీ నార్సింగ్ పోలీస్టేషన్ ఈ మధ్యకాలంలో నమోదైన కేసుల గురించి ఓసారి చూస్తే మొదటి కేసు హీరో రాజ్ తరుణ్‌దే.

మొన్న రాజ్‌తరుణ్

బాధితురాలు లావణ్య  ఇచ్చిన ఫిర్యాదుతో జులై 10న హీరో రాజ్ తరుణ్‌పై కేసు నమోదైంది. రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకున్నాడని, పదేళ్లపాటు కలిసి జీవించామని, అబార్షన్ అయిందని చెప్పుకొచ్చింది. మాల్వి మల్‌హోత్రా పరిచయంతో రాజ్ తరుణ్ మారిపోయి మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ పై ఐపిసి సెక్షన్ 493,420,506 సెక్షన్‌ల కింద కేసు నమోదైంది. న్యాయవాదుల ఎంట్రీతో కేసు విచారణ ట్రైల్స్‌లో ఉంది. 

రాజ్ తరుణ్‌‌పై ఫిర్యాదు చేసిన నాటి నుంచి బాధితురాలు మీడియా వేదికగా తనకు జరిగిన అన్యాయంపై మాట్లాడటంపై శేఖర్‌ బాషా అనే ఆర్జే వ్యతిరేకించారు. ఇలా వివిధ టర్న్‌లు ట్విస్ట్‌లతో రాజ్ తరుణ్ కేసు కొద్ది రోజులుగా మీడియాకు మెయిన్‌గా సోషల్ మీడియాకు మంచి స్టఫ్ ఇచ్చింది. ఉయ్యాల ..జంపాల సినిమా నుంచి వినోదాత్మక సినిమాలతో అలరిస్తున్న హీరో రాజ్ తరుణ్ ఇలా నార్సింగ్ పోలీసుల క్రైమ్ లిస్ట్‌లో చేరిపోయాడు. 

నిన్న జానీ మాస్టర్

రాజ్ తరుణ్ కేసు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కొనసాగుతుండగానే  మరో సెలబ్రెటీ, ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్‌పై ఫిర్యాదు రిజిస్టర్ అయింది. తనపై జానీ మాస్టర్ తనను వేధించారని ఓ లేడీ కొరియోగ్రాఫర్  ఫిర్యాదులో పేర్కొంది. దీంతో జానీమాస్టర్‌పై కేసులు నమోదయ్యాయి. ఆయన్ని అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. నార్సింగి పోలీసుల ఎప్‌ఐఆర్‌లో పేరు నమోదైంది. 

ఇవాళ హర్షసాయి

ఈ రెండు కేసులు పూర్తి కాకుండానే ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి రెండు కోట్ల రూపాయలు డబ్బు తీసుకున్నాడని ఆరోపించింది. పెళ్లి చేసుకోమంటే పట్టించుకోవడంలేదంటూ నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హర్షసాయి తండ్రిపై కూడా ఆరోపణలు చేసింది బాధిత యువతి. కోట్ల రూపాయలు దానం చేసే వీడియోలతో హర్షసాయి ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు నార్సింగ్ పోలీసుల క్రైమ్‌ చిట్టాలో చేరిపోయాడు. 

ఇటీవల కాలంలో నార్సింగి పోలీసుల లిస్ట్‌లో చేరిన వీరంతా హైప్రొఫైల్ సెలబ్రెటీలు. ఒకరు పోతే మరొకరు అన్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయి. లిస్టులో చాలా మంది చేరుతున్నారు. దీంతో నార్సింగ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మాత్రం ఫిర్యాదు అంటేనే ఒత్తిడికి గురి అవుతున్నారు. 

Also Read: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget