News
News
X

Google Layoff: తెల్లవారుజాము 2 గంటలకు ఉద్యోగం ఊడిందంటూ ఈమెయిల్, స్పామ్ అనుకుని లైట్ తీసుకున్న ఉద్యోగి

Google Layoff: ఓ ఉద్యోగిని తొలగిస్తున్నట్టు తెల్లవారుజామున మెయిల్ పంపింది గూగుల్ కంపెనీ.

FOLLOW US: 
Share:

Google Layoff employee laid off at 2am, thought layoff email was spam ignored it:

లే ఆఫ్‌ల కాలంలో ఒక్కొక్కరిది ఒక్కో బాధ. ఒక్కొక్కరిది ఒక్క రకమైన స్టోరీ.  ఇటీవల గూగుల్ కు చెందిన ఓ ఉద్యోగిని ఆ సంస్థ తీసేసింది. ఆ విభాగానికి హెడ్ గా ఉన్న తనకు కూడా ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్లుగా ఈమెయిల్ వచ్చింది. చాలా కష్టపడి పని చేస్తున్నా, హెడ్ గా ఉన్నా నన్నెందుకు తీసేస్తారనుకుని ఆ ఈమెయిల్ ను స్పామ్ అనుకుని లైట్ తీసుకున్నాడు తర్వాతే తత్వం బోధపడి తమాయించు కున్నాడు. ఉద్యోగం కోల్పోయిన 12 వేల మందిలో తాను ఒకడినని తెలుసుకున్నాడు.

ఇండియన్-అమెరికన్ అయిన విశాల్ అరోరా.. కాలిఫోర్నియాలోని గూగుల్ కార్యాలయానికి (Google Office) ఇంజినీరింగ్ హెడ్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఓ రోజు విశాల్ అరోరాకు లేఆఫ్ మెయిల్ వచ్చింది. కానీ దానిని స్పామ్ కావచ్చునని భావించి లైట్ తీసుకున్నాడు. తనను గూగుల్ సంస్థ ఎంత నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగంలో నుంచి తీసేసిందో తన లింక్డ్ ఇన్ లో రాసుకొచ్చాడు. మంచి ఫలితాలు తీసుకువస్తున్నప్పటికీ తను ఉద్యోగం కోల్పోవడం పట్ల ఎంత నిరాశగా ఉందో చెప్పాడు. కొత్త ఉద్యోగాన్ని వెతుక్కోవడం ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అందులో వ్యక్తం చేశాడు. 

నోటీస్ రిగార్డింగ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్..

విశాల్ అరోరాకు చెందిన వ్యక్తిగత ఈమెయిల్ కు ఓ రోజు తెల్లవారుజామున 2 గంటలకు 'నోటీస్ రిగార్డింగ్ యువర్ ఎంప్లాయ్‌మెంట్' అని సబ్జెక్ట్ తో ఉన్న ఇమెయిల్ వచ్చింది. కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు విశాల్ అరోరా. ఉదయం 7 గంటలకు తాను హాజరు కావాల్సిన సమావేశానికి సిద్ధమవుతున్నాడు. కానీ అతను తన ఫోన్ లో తన కార్పొరేట్ క్యాలెండర్ ను చెక్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అది సిస్టమ్ నుంచి లాక్ చేసినట్లుగా గుర్తించి ఖంగు తిన్నాడు. 

మనం చేసే పని పైస్థాయి వారికి కూడా తెలిస్తేనే గుర్తింపు

'గూగుల్ లో పని చేస్తున్నప్పుడు నా యాజమాన్యం నా వెనక ఉందని అనుకున్నాను. కాబట్టి నేను వృత్తిపై దృష్టి పెట్టాను. అంచనాలు అందుకునేందుకు కష్టపడ్డాను. మీరు చేస్తున్న పని, అందుకుంటున్న అంచనాల గురించి కేవలం మీ పైనున్న మేనేజర్ కు మాత్రమే తెలిస్తే సరిపోదు. వారి పైనున్న వారికి కూడా తెలిసేలా చేయాలి. నిరంతరం కలవడం, మెసేజీలు పంపించడం లాంటివి చేస్తున్నప్పుడే వారు మన గురించి తెలుసుకోగలుగుతారు.' అని విశాల్ తన లింక్డిన్ లో రాసుకొచ్చాడు. 

16 వారాల జీతం

తొలగించిన ఉద్యోగులకు 16 వారాల జీతం సహా ఒక సెవరెన్స్ ప్యాకేజీ ఇస్తున్నట్లు గూగుల్ ఒక బ్లాగ్ పోస్టు (Google Blog Post )లో తెలిపింది. బోనస్ లు, మిగిలిపోయిన సెలవులకు వేతనాన్ని కూడా అందిస్తోంది. 6 నెలల ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగ నియామక సేవలు, ఇమ్మిగ్రేషన్ సపోర్టు కూడా అందిస్తోంది. 

Also Read: Ex-Google Employee: ఉద్యోగం పోగొట్టుకోవడం బ్రేకప్‌లాంటిదే, వైరల్ అవుతున్న గూగుల్ ఎక్స్ ఎంప్లాయ్ పోస్ట్

Published at : 03 Mar 2023 03:57 PM (IST) Tags: Google Employees Google Layoff Google Company News Indin-American Employee Google Company Latest News

సంబంధిత కథనాలు

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

Eatala Rajender: పంజాబ్ వెళ్లి డబ్బులు ఇచ్చుడు కాదు, రాష్ట్ర రైతులను ఆదుకోండి కేసీఆర్ - బీజేపీ ఎమ్మెల్యే ఈటల

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

5G మొదలైందో లేదో అప్పుడే 6G గురించి మాట్లాడుతున్నాం, భారత్ విశ్వాసానికి ఇది నిదర్శనం - ప్రధాని మోదీ

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

RRB Group D Result: రైల్వే 'గ్రూప్‌-డి' తుది ఫలితాలు విడుదల, ఉద్యోగాలకు ఎంతమంది ఎంపికయ్యారంటే?

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

Delhi Liquor Policy: సిసోడియా కస్టడీ మరోసారి పొడిగింపు,బెయిల్ పిటిషన్‌పై ఈడీ వివరణ కోరిన కోర్టు

ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

టాప్ స్టోరీస్

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

IND Vs AUS 3rd ODI: మెల్లగా బ్యాటింగ్ చేస్తున్న ఆస్ట్రేలియా - సగం ఓవర్లు ముగిసేసరికి స్కోరు ఎంతంటే?

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!

షాకింగ్ లుక్: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ హీరోయిన్!