Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, శాస్త్రిలకు రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల నివాళులు
Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులు నివాళులర్పించారు.
Gandhi Jayanti 2022: మహాత్మా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రిలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ.. రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీకి పుష్పాంజలి ఘటించారు.
ప్రముఖుల నివాళులు
గాంధీజీ 153వ జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి 118వ జయంతి సందర్భంగా వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తదితరులు రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు.
లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా విజయ్ ఘాట్‌లో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పుష్పాంజలి ఘటించారు.
మోదీ ట్వీట్
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
Paying homage to Mahatma Gandhi on #GandhiJayanti . This Gandhi Jayanti is even more special because India is marking Azadi Ka Amrit Mahotsav. May we always live up to Bapu’s ideals. I also urge you all to purchase Khadi and handicrafts products as a tribute to Gandhi Ji. pic.twitter.com/pkU3BJHcsm
— Narendra Modi (@narendramodi) October 2, 2022
Today, on Shastri Ji’s Jayanti I am also sharing some glimpses from his gallery in the Pradhanmantri Sangrahalaya in Delhi, which showcases his life journey and accomplishments as PM. Do visit the Museum… pic.twitter.com/09yi9FWQSs
— Narendra Modi (@narendramodi) October 2, 2022
Also Read: Gandhi Jayanti 2022: మృత్యువు వచ్చినా వెనక్కి తగ్గేదేలే! ఆయన జగత్ ప్రేమికుడు!
Also Read: UNSC Vote on Ukraine: రష్యా రిఫరెండంపై భద్రతా మండలిలో ఓటింగ్- దూరంగా భారత్!