India General Elections 2024: ఓటు వేసిన వాళ్లకి ఉచితంగా టిఫిన్, ఐస్‌క్రీమ్ - షాప్ ముందు క్యూ కట్టిన ఓటర్లు
Indore Voting: ఇండోర్‌లో ఉదయమే వచ్చి ఓటు వేసిన వారికి వ్యాపారులు ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఐస్‌క్రీమ్ అందించారు.
Free Breakfast to Voters: మధ్యప్రదేశ్‌లో కొంత మంది షాప్ ఓనర్స్ ఓటర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చారు. ఉదయమే వచ్చి ఓటు వేసిన వాళ్లకి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు ఐస్‌క్రీమ్‌లు అందజేశారు. ఇండోర్‌లో 56 Dukaan అసోసియేషన్ ఈ ఆఫర్ ఇచ్చింది. పోలింగ్ శాతం పెంచేందుకు ఇలా వినూత్నంగా ఆలోచించింది. ఈ ఆఫర్ గురించి తెలుసుకున్న ఓటర్లు షాప్‌ల వద్ద క్యూ కట్టారు. వచ్చిన వాళ్లందరికీ ఉచితంగా టిఫిన్, ఐస్‌క్రీమ్ పెట్టి పంపించారు షాప్ ఓనర్లు.
"ఇండోర్‌లో ఎప్పుడూ పోలింగ్ శాతం సంతృప్తికర స్థాయిలో ఉంటుంది. ఈ సారి కూడా ఆశించిన స్థాయిలో నమోదు కావాలని భావించాం. అందుకే ఉదయమే వచ్చి ఓటు వేసిన వారికి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ అందించాం. ఉదయం 7-9 గంటల మధ్యలో ఈ ఆఫర్ అందించాం. ఇండోర్‌లో ఫేమస్ అయిన పోహా, జిలేబీ అందరికీ సర్వ్ చేశాం"
- షాప్ ఓనర్
#WATCH | Indore, Madhya Pradesh: Free breakfast and ice cream are being distributed to early voters at the city's famous 56 Dukan restaurant. pic.twitter.com/KTos1zpi79
— ANI (@ANI) May 13, 2024
ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, వాళ్లు ఓటు వేసేలా ప్రోత్సహించేందుకు ఈ ఆఫర్ పెట్టినట్టు ఓనర్లు వెల్లడించారు. గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ దాదాపు 5-6 వేల మందికి ఉచితంగా బ్రేక్‌ఫాస్ట్ పెట్టామని చెప్పారు. ఈసారి ఏకంగా 11-12 వేల మందికి అందించామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 29 లోక్‌సభ స్థానాలున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్‌లో కొన్ని స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ తరవాత ఏప్రిల్ 26న రెండో దశ, మే 7 మూడో దశ పోలింగ్ ముగిసింది. ఇవాళ్టితో (మే 13) ఇక్కడ మొత్తం 29 స్థానాలకు ఎన్నికలు పూర్తవుతాయి.
#WATCH | Indore, Madhya Pradesh: Owner of 56 Dukan, Shyamlal Sharma says, "Indore has always stood out, and we will stand out in voting also. We have offered free breakfast to people so that they come out early and vote... This free service is available from 7-9 AM and we are… pic.twitter.com/IkG17ipsdC
— ANI (@ANI) May 13, 2024