Manmohan Singh Hospitalised: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స!
మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఆసుపత్రిలో చేరారు. దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ అగ్రనేత మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Former Prime Minister Dr. Manmohan Singh admitted to All India Institute of Medical Sciences, Delhi
— ANI (@ANI) October 13, 2021
(file photo) pic.twitter.com/SAm5NOpeiF
తీవ్రమైన జ్వరం, నీరసంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. నిన్న రాత్రి నుంచి మన్మోహన్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. డాక్టర్ రణ్ దీప్ గులేరియా, ఎయిమ్స్ నేతృత్వంలో వైద్య బృందం ప్రస్తుతం ఆయనకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు కాంగ్రెస్ కానీ వారి కుటుంబసభ్యులు గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కరోనాతో పోరాటం..
మన్మోహన్ సింగ్ ఈ ఏడాది ఏప్రిల్ 19న కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా ఆయననను ఎయిమ్స్‌లో చేర్చారు. స్వల్పంగా జ్వరం వచ్చిన తర్వాత మన్మోహన్‌కు కరోనా వైరస్ సోకినట్లు తేలింది. 2009లో మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. మన్మోహన్ సింగ్ 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధాన మంత్రిగా ఉన్నారు.
Get Well Soon Dr ManMohan Singh ji
— Supriya Bhardwaj (@Supriya23bh) October 13, 2021
Sources:
Former Prime Minister Dr Manmohan Singh ji was having some difficulty in breathing and was complaining of chest congestion
He has been admitted to AIIMS pic.twitter.com/nTGCZ7XAaG
Also Read: Malabar Maritime Exercise Pics: చైనాకు భారత్ చెక్.. 'ఆపరేషన్ మలబార్'తో డ్రాగన్ గుండెల్లో గుబులు
Also Read: Corona Cases: గత 19 రోజులుగా 30 వేలకు దిగువనే కరోనా కేసులు
Also Read:Lakhimpur Violence: రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ బృందం.. ఇదే ప్రధాన డిమాండ్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి