అన్వేషించండి

EWS Reservation: ఈడబ్ల్యూఎస్ కోటాను సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్

EWS Reservation: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది.

EWS Reservation: ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS)కు రిజర్వేషన్లపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలైంది. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు సుప్రీం కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్య, ఉద్యోగాల్లో కల్పించే ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత ఉంటుందని తీర్పు ఇచ్చింది. అప్పటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్ సహా నలుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. 

3:2

న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించగా ఇద్దరు మాత్రం తీర్పుతో విభేధించారు. అప్పటి సీజేఐ యూయూ లలిత్.. జస్టిస్ రవీంద్ర భట్‌తో ఏకీభవించారు. అయితే జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జేబీ పార్దివాలా మాత్రం #EWS సవరణను సమర్థించారు.

సమర్థిస్తూ

సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం కోటా (రిజర్వేషన్లు) కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ ఈ పిటిషన్లను కొట్టివేసింది.

అప్పటి సీజేఐ జస్టిస్​ యూయూ లలిత్‌, జస్టిస్​ దినేశ్​ మహేశ్వరి, జస్టిస్ రవీంద్ర భట్​, జస్టిస్ త్రివేది, జస్టిస్ పార్దీవాలాతో కూడిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసును విచారించింది. రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక మంది సీనియర్​ న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఈ పిటిషన్లపై జస్టిస్​ యూయూ లలిత్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆరున్నర రోజల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఆర్థికంగా బలహీనమైన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) విద్య, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌ కల్పించడమంటే.. రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీం కోర్టుకు కొందరు న్యాయవాదులు నివేదించారు. రిజర్వేషన్లపై 50%గా ఉండాల్సిన పరిమితిని అది అతిక్రమిస్తోందని, క్రీమీలేయర్‌ విధానాన్ని ఓడిస్తోందని పేర్కొన్నారు. ఆ కోటా నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలను మినహాయిస్తుండటాన్నీ తప్పుపట్టారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థించింది. 

ఇదీ చట్టం

ఉన్నత వర్గాల్లోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ చట్టం 2019, ఫిబ్రవరి 1న అమలులోకి వచ్చింది. దీంతో వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరుతోందని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: Asaduddin Owaisi On Modi: మోదీ సర్కార్‌ను నమ్ముకోవద్దు, పెళ్లి చేసుకోండి: ఒవైసీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Duvvada Vani: టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
టెక్కలిలో దువ్వాడకు లైన్ క్లియర్ - పోటీ నుంచి తప్పుకొన్న దువ్వాడ వాణి!
Malaysia: గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
గాలిలో హెలికాప్టర్లు ఢీ - 10 మంది నేవీ సిబ్బంది దుర్మరణం, మలేషియాలో ఘోర ప్రమాదం
Bridge Collapsed: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన - తప్పిన ప్రమాదం
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Money Rules: మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
మే నెల నుంచి మారే మనీ రూల్స్‌, మీకు బ్యాంక్‌ అకౌంట్‌ ఉంటే తప్పక తెలుసుకోవాలి
Allari Naresh: అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
అల్లరి నరేశ్ రైటర్‌గా సూపర్ హిట్ సీక్వెల్ - వచ్చే ఏడాది థియేటర్లలోకి సినిమా
Embed widget